Pages

Subscribe:

Friday, December 18, 2009



అనుకోకుండా ... అతిచేరువగా ..

కొన్ని పరిచయాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి ..



అది ఎంతగా అంటే ..

కష్టానైన .. సుఖానైన ..
బాదనైన .. సంతోషనైన ..
లాభానైన .. నష్టానైన ..
చివరికి ... నిజానైన .. అబధనైన ..
నిర్భయంగా , నిష్కల్మషంగా , నిర్మొహమాటంగా ...చెప్పేస్తూ వుంటాం ...


ఎందుకిలా అని ఎవరినా అడిగితె.?..



సమాదానం మాత్రం .. ఏమో .."



కొందరు అంటున్నారు మనిషిలో సొంతం , బంధం అన్న మాటకి ఈ రోజుల్లో అర్ధం లేదని ....కాని నేను చెబుతున్న "friend" అనే పేరుతో అవి శాశ్వతంగా మిగిలే వుంటాయి అని....






పై వ్యాసం ఎందుకు రాసానంటే నేటితో నేను ఈ హైదరాబాద్ నగరానికి వచ్చి సరిగ్గా సంవత్సరము , గత సంవత్సర జ్ఞాపకాలనుండి నూతన సంవత్సర ఆలోచనలలోకి పయనిస్తున్న నా మనస్సుకి ఇదో గొడుగు లోపలి వాన వంటి బాధ, ఇలాంటి సంఘటనలే మీ జీవితంలోను జరిగిండొచ్చు, ఒకసారి గతంలోకి వెళ్ళండి ......
thanking u
urs
sudharshanAradhana

Wednesday, December 9, 2009

వ్యక్తి నుంచి వ్యవస్థ చేతుల్లోకి మారిన ఉద్యమం


మూడు కోట్ల మంది ప్రజల గొంతోక్కటే ఘోశోక్కటే ...తెలంగాణా వెలసి
నిలిచి ఫలించిన భారతాన


కల్వకుంట్ల చంద్రశేకరరావు లేదా కే సి ఆర్ నే నాయకుడు తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినపుడు వేలాది మంది సంతోషించారు అనుసరించారు , ను చూసుకుని జనం ఉప్పొంగిపోయారు అలాంటి కే సి ఆర్ నిరాహార దేక్ష చేస్తున్నాడు తెలంగాణా సాక్షిగా ...

ఇంతకాలం ఉద్యమ్మాన్ని ఆయన నడిపించాడు కాని ఇప్పుడు ఉద్యమమే ఆయన్ని నడిపిస్తుంది ,కారణం ఉద్యమం ఏనాడో టి ఆర్ ఎస్ నుంచి విద్యార్తుల్లోకి చేరింది ,గతంలో లాగ దీక్ష విరమించా తలచిన కి విద్యార్థులు చేష్టలు భయ బ్రాన్తుల్ని చేసాయి,ఇదికూడా ఆయనకు శుభ పరిణామమే.


తెలంగాణా సెంటిమెంట్ అనే చెరువు పూర్తిగా ఎండిపోతున్నపుడు దాన్ని కాస్తా ఇప్పుడు విద్యార్థి సంద్రంలోనికి తెలివిగా కలిపారు, ఇప్పుడా సముద్రం ఉప్పొంగి పోతోంది ....



విద్యార్థులారా !

చిన్నపుడు పాటశాల చదువుల్లో సిపాయిల తిరుగుబాటు మొదలు ఎన్నో ఉద్యమాల గురుంచి చదివాం కాని అలాంటి వాటిని చేసే అవసరం మనకి ఇంతవరకు రాలేదు,కాని వేర్పాటువాదంతో అట్టుడుకుతున్న తెలంగాణా లో ఇప్పుడా ఆవశ్యకత ఏర్పడింది ,


o సహా విద్యార్థిగా నా తోటి విద్యార్థులు చేసే ఉద్యమం విజయ వంతం కావాలని ఆసిస్తూ .....

raayalaseema vidyaarthi

thank u

by ARADHANA

Sunday, August 9, 2009


"జీవితంలో విషాదం వుండాలి అప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది,నవ్వులోంచి విషాదం పుట్టాలి "

సినిమా విడుదలైంది ,చూసిన జనమంతా గొల్లున నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు "రేలంగోడెం చేశాడ్రా" అని చెప్పుకుని మరి మరి నవ్వుకుంటున్నారు ,అదే జనం మళ్ళి మళ్ళి ఎగబడుతున్నారు,రెండో రోజూ రేలంగి అలా ఆకర్షించాడు , ఆకట్టుకున్నాడు ,ఆనందం పంచాడు ,సినిమాల్లో బంగారం లాంటి నవ్వులు పండించిన రోజులవి ,సినిమా బాగున్నా లేకపోయినా రేలంగుంటే సరే సరి ,సినిమా హాస్యానికి రేలంగే హీరో .

ఈ రేలంగోడి వెనుక చాలా గోడుంది బాబూ!!! అని కథంతా చెప్పేవారు ,కష్టాలు చెప్పేవారు ,నాలాగా అందర్నీ కష్ట పడమని కాదు ,కష్ట పది పైకి వచ్చే
వాడికి సుఖ పడి పైకి వచ్చేవాడికి తేడా తెలుస్తూంది ,కష్టంలో వున్న మజా సుఖంలో వుండదు ,అని సూత్రాలు చెప్పేవారు రేలంగి నవ్వుతూ.....

చిన్న తనం నుండి తను నాటకాలు వేయడం, వుంటే తినడం ,లేకపోతే గాలి తినడం గాలి కూడా అయిపోతే గోళ్ళు కొరుక్కోవడం అంతే.... తండ్రి సంగీతం మాస్టరు ,హరి కథలు చెప్పేవారు ,అది "ప్రమాదించింది " ,రేలంగికి పాట మీద కి
మనసు మళ్ళింది ,గాలి పాట వచ్చింది ,అది అలా మాటలోకి దించింది.చదువు మాట దేవుడెరుగు ,పాట దేవుడిలా పరిణమించింది..

కాకినాడ యంగ్ మన్స్ హ్యాపీ క్లబ్లోకి దిగి పోయి పౌరాణికాల్లో పద్యాలు చదువుతూ పాటలు పాడుతూ జీవితం వెతుక్కున్నాడు ,ముందు ఆడ వేషాలు వేశాను ,తరువాతే మగ వేషం వచ్చింది ఆ వేషం ఎం చేశానో ఎం చెప్పానో ప్రేక్షకులు నవ్వారు ,
"అరె నవ్వారే!!! వహ్వారే నే
నవ్వులు పంచగలనన్నమాట " అనుకున్నారట .

సినిమాలు ఎక్కువగా బొంబాయి లో తీస్తారని అక్కడి స్టూడియో ల పేర్లు తెలుసుకుని వెంకటరామయ్య ఇంగ్లీషులో వుత్తరాలు రాసేవారట "

my name is r R.Venkataramayya I am see your picture , i am want to act , give me chance sir reply sir "

అని తన ఎత్తు బరువు వయసు రాసి పోస్ట్ చేసేవారట . "నాకు జవాబు ఎందుకు వస్తుందీ? నా ఎత్తు బరువు వున్న వాళ్ళు బొంబాయి లో లేరూ? ఏదో తెలీక ...అజ్ఞానం వుబలాటం ",అని తన ఇంగ్లీష్ ప్రజ్ఞ గురుంచి చెప్పేవారు .

బాల నాగమ్మ గొల్లభామ లలో తెలిసిన రేలంగి ఆ సినిమాల్ని చరో భుజం మీద పెట్టుకుని డొక్కు సైకిలు కొనుక్కుని ,దర్శక నిర్మాతల ఇళ్ళ చుట్టూ తిరిగే వాడు ,తిరిగి తిరిగి శోబనా చలపతి స్టూడియో కి వచ్చి ,ఓ చెట్టుకింద సైకిలు పెట్టి ,అక్కడికి వచ్చి పోయే వాల్లందిరికి సలాం కొడుతూ కాలక్షేపం చేస్తుండేవాడు
,పాత సైకిలు కాస్త "దిసాల్వ్" లో కొత్త సైకిలయ్యింది,కొత్త సైకిలు పాత కారయ్యింది ,పాతకారు పెద్దకారు అయ్యింది ,వెంకటరామయ్య రేలంగి అయ్యాడు ,చిన్నతనంలో వేళకి తినకా ,నిద్రపోకా ఎలా తిరిగానో ఏమిటో గాని ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతీసింది " అని తన మీద తనే జోక్ చేసుకునే వాడు ,.....

ఆ రోజుల్లో తిందామంటే వేరుశనక్కాయలు కుడా కొనుక్కోలేక పోయేవాన్ని ,కాని ఇప్పుడి ఇంత సంపద వున్నా తినాలంటే వేరుశనక్కాయలు కూడా అరగడం లేదు ...అని ఎప్పుడూ సైలంట్ ఎరుగని రేలంగి పైమాటగా అనేవారు...

మద్రాసులో జర్నలిస్టులంతా కలిసి ఓ సారి ఆయనకు ఘన సత్కారం ఏర్పాటు చేశారు ,సన్మానానికి వెళ్ళే ముందు సర్ మిమ్మల్ని ఏనుగు మీద తీసుకెళతాం," అన్నారు అపుడు రేలంగి మొహం అదోలా పెడితే " చాలా మంచిదండి - గజారోహణం జరుగుతుంది " అని అన్నాడో మిత్రుడు అప్పుడు మరి మావటి వాడు ఎప్పుడు ఎక్కుతూనే వుంటాడే " అని
నవ్వించారు ఆయన.......
చివరగా ఓ గున్న ఏనుగు మీద వూరేగింపు మొదలైతే " పాండి బజార్లోనుండి తీసుకెళ్ళండి ,ఆ బజార్లో మనం ఎండనకా వాననకా చెప్పులు లేకుండా తిరిగాము ఇప్పుడు ఏనుగు మీద వెళుతుంటే బజారు సంతోషిస్తుంది " అని నవ్వించారు రేలంగి .

సినిమా హాస్య నటుల్లో భారత దేశం మొత్తం మీద పద్మశ్రీ అందుకున్న మొట్ట మొదటి నటుడు రేలంగి ,సునిశితమైన హాస్యం రేలంగిది,అంటారు అయన గురించి తెలిసినవాళ్ళు ,ఆయన శైలి ఆయనదే జీవితలో విషాదం వుండాలి అప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది,నవ్వులోంచి విషాదం పుట్టాలి ,రెండూ వొకటే అనిపిస్తుంది నాకు అంటారు రేలంగి .
రేలంగి ముఖంలోనే హాస్యముంది ,క్షణంలో రేఖలు రంగులు మార్చగల ఘనాపాటి.....


గమనం ఓ నిరంతర సంగ్రామం
ఇది ఓ సుదీర్గ పయనం...


thank u for visiting...

visit again

by

ARADHANA




Tuesday, June 30, 2009

అతన్ని అందరు రాజుగానో , మహా రాజుగానో ,రారాజుగానో కీర్తిస్తున్నారు.అందులో నేను మాత్రం తక్కువా అని అతన్ని చక్రవర్తిగా కీర్తించ దలచాను . కాని చక్రవర్తి కుడా మామూలు మనిషే ,అతను చక్రవతిగా ఎలా ఎదిగాడో కాని మనందరి మద్య ఇలా మామూలు మనిషిగా తనువుచాలించాడు ,అటువంటి సంగీత సామ్రాట్ గురించి ఇలా రాయగలగడం కుడా ఒకింత ఆశ్చర్యమే ,ఎందుకంటె ఆయనో సముద్రం ఆయనో ఆకాశం,అయన గురించి చెప్పడమంటే నా దోసిట్లో వున్న ఆకసాన్ని గురించి చూడటమే అవుతుంది అతనే పాప్ చక్రవర్తి మైఖేల్ జాక్సన్.

ఆ పేరు వింటేనే ఏదో తెలియని భావన,ఎక్కడో ఆ పేరు విన్నామనే స్ఫురణ ,ఆ పేరు వింటేనే తెలియని పులకింత,ఏదో తెలియకుండా మన శరీరంలో తెలియని కదలిక ,ఇల్లాంటి తెలియని భావాలను మనకు తలియకుండానే మనకు రుచి చూపించిన ఆయన ఇక మన మద్య చిరంజీవి గా నిలిచి పోయాడు .




అతని కళా జీవితం వీది బాలల అనుకరనలోను,అభినయంలోను మారరు తీసుకొచ్చింది ,అతని వ్యక్తిగతం ఖరీదైన మనిషి యొక్క కష్టాలకు పరాకాష్టగా నిలిచి కనువిప్పు చేయగలిగింది ,"పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు " అలాగే ఖరీదైన మనిషికే కష్టాలు అని మైఖేల్ జీవితాన్ని చూసిన ఎవరికైనా తెలుస్తూంది .

మాములుగా మనకు ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అని అసహజంగా నే ఎలా అంతమో ఎవరైనా బ్రేక్ డాన్స్ వేసినపుడు అచేతనంగానే అతన్ని మైఖేల్ తో పోలుస్తాము , ఆటను మన జీవితమో అంతలా మమేఖమైపోయాడు,భౌతికముగా అతను లేకపోయినా చిరంజీవిగా మన మసుల్లో ఎప్పటికి వుంటాడు ..


ఈ లోకము కొందరి కోసము పరలోకము కొందరి కోసము ,కాని ఈ లోకంలో ఆర్జించిన ఖ్యాతితో పరలోకానికి దారి కాచి పరలోకంలో ప్రాచుర్యాన్ని పొందిన వారిని మహానుభావులు అంటారు,అలాంటి వారు మనతో లేకపోయినా పరలోకంలో మన కోసం పరితపిస్తుంటారు ... గట్టిగా కొలిస్తే గుప్పెడు కుడా వుండని గుండెలో జ్ఞాపకాలకు కొండంత స్థలం వుంటుందంటారు ,అలాంటి కొండంత స్థలంలో నీ జ్ఞాపకాల పూదోట ఎప్పుడు పచ్చగా వుంటుంది ,అంతలా నువ్వు మాతో అంత అనుబందాన్ని ఏర్పరచుకున్నావు జాక్సన్ ...

మమ్మల్నందర్నీ విస్మయ పరుస్తూ తిరిగిరాని లోకాలలో విహరిస్తున్నావు,మళ్ళి మమ్మల్ని వినోద పరచడానికి తిరిగి రావా మైఖేల్ ...

అందరు చనిపోయిన తరువాత మన పూర్వికులను కలుకుంటారు అని అంటారు ,కాని మన మైఖేల్ ని కలుసు కోవాలని ఎంతమంది అనుకుంటారో ......

అందులో మీరు వున్నారా...?????????
Thank u for visiting
by
praveenAradhana

Sunday, May 3, 2009

"దిగి రాను దిగి రాను అంటూ విను వీధులలో విహరిస్తున్న మన తెలుగు కవితను ఈ భూలోకానికి దించి భూకంపాన్ని సృష్టించిన అపర కవీరధుడు ఆయన ",


ఇంతకాలం నన్ను తెలుగు సాహిత్యం నడిపించింది ఇప్పుడు తెలుగు సాహిత్యాన్నీ నేను నడిపిస్తాను అంటూ తన నాయకత్వం గురించి వినమ్రంగా వివరించిన మహా మనిషి శ్రీ శ్రీ .

సంప్రదాయ తెలుగు ప్రకారం ఒక వ్యక్తిని గౌరవ సూచకముగా ,గొప్పగా సంభోదిన్చుటకు మొదట వాడే శబ్దం "శ్రీ ",అలాంటి శ్రీ నే తన పేరులో రెండుసార్లు ఇముడ్చుకుని భావ కవులచే గర్వంగా ,సగౌరవంగా కిర్తించబడుతూ వారికి మార్గదర్శిగా మారిన కవిత నిఘంటువు శ్రీ శ్రీ .

"శ్రీ శ్రీ అంటే ఆకాశం ,శ్రీ శ్రీ అంటే సముద్రం" అనుకుంటూ వున్నా వారికి నేను కేవలం "అనంతం" నీ మాత్రమె అంటూ వినమ్రంగా తన అంతరంగికాన్ని అందరికి తెలిపి అందరాని శిఖరాలను చేరిన మహాకవి ఆయన.

రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగులు పడతారు అంటూ కమ్యునిజం పై విమర్శలు వున్న ఆ కాలంలో కుడా కమ్యునిజం నా వూపిరి సోషలిజం నా శ్వాస అంటూ వెలిగెత్తి చాటి ఇక్కడి గొడుగులు వర్షాన్ని నిలువరించగలవు అంటూ ఇక్కడి వారి వునికిని చాటిన వ్యక్తి శ్రీ శ్రీ.

శ్రీ శ్రీ జయంతి రోజున రాయాల్సిన ఈ వ్యాసం ఆలస్యంగా రాస్తున్నందుకు క్షమించగలరు ,ఈ నా వ్యాసం పులి చంపిన లేడి నెత్తురంతా వేడిగా వాడిగా లేక పోయినా ఆయనపై వున్న అభిమానానికి చంద్రునికో నులు పోగు వంటిది.


మరో ప్రపంచం పిలుస్తోంది అంటూ మరలి రాని లోకాలు తరలి వెళ్ళిన ఓ మహాకవి మళ్ళి మా ప్రపంచం పిలుస్తోంది దిగిరావా ...నీ మహా ప్రస్థానాన్ని కొనసాగించడానికి కదలి రావా ....


Thank u for visiting Aradhana

keep visiting

by

praveenAradhana




Sunday, April 26, 2009

అప్పుడప్పుడు మన కిటికీలు మనకు అద్భుతాలని చూపిస్తాయండోయ్.....
అలాంటి వాటిల్లోంచి కొన్ని మీ కోసం .....





























Thank u for visiting Aradhana
visit again
by
Aradhanasankar








Tuesday, March 10, 2009


రంగుల పండుగ వచ్చేసింది,ఈ పౌర్ణమికి ఆకాశాన వుండే తెల్లటి నిండు జాబిల్లికికి రంగులేయడానికి సిద్దంగా వున్నారా అయితే రండి అందరమూ కలిసి మామ ను వెంబడిద్దాం, ....

హొలీ అనేది రంగుల పండుగ. వసంతోత్సవం లేదా కామునిపండుగ అని కూడా పిలుస్తారు. నీళ్ళలో రంగులు కలిపి చల్లుకోవడం, రంగు పౌడర్ మొహాలకు రాసుకోవడం చేస్తారు.

ఇక పొతే ఈ రంగుల పండుగానే కాముని పండుగ అని కూడా అంటారు , ఈ కాముని పౌర్ణమికి మా వూరిలో అయితే కామిని అంతం ని ఓ గొప్ప వేడుకగా నిర్వహిస్తారు,హిరణ్య కసిపుకుని చెల్లెలైన కామిని ని ఓ బొమ్మగా తయారు చేసి నిప్పంటించగా ,వూరిలోని ప్రజలు తమ వంతుగా తమ తమ ఇండ్ల లోని పాత వస్తువులని తీసుకు వచ్చు ఆ హోమంలో వేసి హోమాన్ని తెల్లవారు జాము వరకు కొనసాగించటం విశేషం.

అంతకు ముందు రాత్రి యువకులు తమ రాత్రి భోజనాన్ని గ్రామములోని వేరే గృహాలనుంచి యాచించి (యాచన ఇలా వుంటుంది "కాం బువ్వ మ్మ కామ్బువ్వ") తద్వారా లభించిన ప్రతిని వురి మద్యలో ఓ చోట కుప్పగా పోసి అందరు సమానముగా ఆరగించడం కొన్ని గ్రామాలలో కనిపిస్తుంది ,ఒకవేళ ఇలాంటి సంప్రదాయాన్ని మీరు చూడాలనుకుంటే మా యింటి కి రాగలరు మీ కోసము మా వురి పొలిమేర మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే వుంటాయి..

ఇక పల్లెటూరి వసంతోత్సవము కాదు కాదు వసంతకము అంటారని మా జేజి చెపుతూ వుంటుంది , ఈ రోజు వరుసకు బావ బావమరుదులైన వారి పైన తమ అభిమానాన్ని రంగుల రూపంలో చూపించడం పరిపాటే , మా కాలేజి రోజుల్లో మేము ఎలా ఎంజాయ్ చేసామంటే ఆ రోజులు మల్లి తిరిగి రావనిపిస్తోంది ,కొసమెరుపేంటంటే కాలేజ్ లో మేమంతా బావ బావ అని పిలుచుకునే వాళ్ళం కాబట్టి మా కు రంగు పడాల్సిందే .

మీకు మీ శ్రేయోభిలాషులకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
ఇట్లు మీ ఆరాధన

Sunday, March 8, 2009

అవును మహిళా దినోత్సవమండి.....!!!



బ్లాగు వనంలో విరబూస్తున్న మహిళా మల్లెపూలకు పండగోచ్చిందండి , మిమ్మల్ని చూస్తె మాకు అసూయగా వుంది ప్రతి చోట ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానముగా వున్నా వారికి ప్రత్యేకంగా పండగేందుకో ,

ఏదో వొకరోజు మాకోసము ఓ రోజొస్తుంది ఆ రోజు మేము మా పండగ చేసుకుంటాము ,ఆ రోజేంతో దూరంలో లేదు ....

కాబట్టి కామ్రేడ్స్
నే చెప్పేదేమిటంటే ....

"జై పురుషుల దినోత్సవము"

కాబట్టి నే చెప్పేదేమిటంటే మా రోజు కోసము మేము నిరీక్షిస్తున్నా మీకోసం వచ్చిన ఈ రోజు కోసం నా తరఫున మీకు మీ మిత్రులకు మీ శ్రేయోభిలాషులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ,



Friday, March 6, 2009



సి నా రె అన్నవి పొడి అక్షరాలూ కావు
పుప్పొడి అక్షరాలూ
అందుకే సి నా రె ను పిండితే మకరందం జాలువారుతుంది




జొన్నరొట్టె మీద వెన్న పూస పూసినారె
తెలుగు పాట బుగ్గ మీద చిటిక వేసినారె
ఇంతింతై విశ్వంభర నంత చూసినారె
జ్ఞానపీటి పైన జానపదములేసినారె






స్వరాల మాలలళ్ళు వేళ
'మామ' కు కుడి చేయి

గురుదేవుని తలచుకుంటూ గుండెలు తడిచేయి
(అందరికి కన్నులు తడిస్తే ఈయనకు గుండెలు తడిచేయి )







మాట పెళుసు గాని
మనసు మల్లెమాల
కవితాత్మక వ్యాపారం
పరమాత్ముని లీల - ఎం ఎస్ రెడ్డి








thank u for visiting ARADHANA

Monday, February 23, 2009

ఈశ్వరుని అనుగ్రహానికి నాంది మహాశివరాత్రి

ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా సంవత్సరంలో పదకొండు మాస శివరాత్రులు వస్తే ఆ పదకొండింటి కంటే గొప్పదైన ఈ శివరాత్రి - అంటే -మాఘ మాస శివరాత్రి ' మహా శివరాత్రి (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) అవుతోంది .'మహా' అని ఎక్కడ అనిపించినా కొన్ని అలాంటి వాటికంటే గొప్పదని భావం . శివ పార్వతులిరువురికి కలిపి 'శివులు' అని పేరు ( శివ శ్చ శివా చ సివౌ ).ఆ ఇద్దరికీ సంభందించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం . అందుకే శివరాత్రి నాడు అయ్యకి - అమ్మకి కుడా వుత్సవం సాగుతుంది .శివ - మంగళకరమైన ,రాత్రి - రాత్రి ఏదో అది శివరాత్రి అనేది మూడో అర్థం .

ప్రాణికోటి యావత్తు నిద్రపోతూందే కాలం రాత్రి ,నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం.ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు .తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే మొదలవుతుంది.చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. చలి ,మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని కప్పుకుని వుండగా - పిశాచ ,భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన శంకరుడు,నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే.....

ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.

చివరగా ఈ మహాశివరాత్రి సందర్బముకు మీకు మీ కుటుంభ సభ్యులకు మీ మిత్రులకు ,మన బ్లాగరుల కుటుంబ శ్రేయోభిలాషులకు మరొక్కసారి మహా శివరాత్రి శుభాకాంక్షలు , అంతేగాక అందరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ పరమశివుని కోరుకుంటూ.......... సెలవు

మీ ఆరాధన


Tuesday, February 17, 2009

అవును మన పాత పాడు బంగ్లా సినిమాలో కనిపించింది ,కర్నూలు జిల్లా బనగాన పల్లె సమీపంలో వున్న యాగంటి గొప్ప శైవ క్షేత్రము , ఇక్కడి గుహలు చాలా ప్రసిద్ది ,ఈ క్షేత్రము చేరుకునే దారిలోనే పాత పాడు గ్రామములో ఈ బంగ్లా కనిపిస్తుంది, నవాబుల మజిలి కి చక్కని సాక్షిగా కొండపై మనకు దర్శనమిస్తుంది ,ఎన్నో సార్లు ఆ దారి గుండా ప్రయాణించిన నాకు ,ఈ బంగ్లా గురించి ఆశించిన మేర ఆదరణ లభించలేదని తెలిసింది ,



కాని ఇన్ని రోజులకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో గద్వాల్ సంస్తానముగా వెలిగింది ,అలనాడు బనగాన పల్లె నవాబు తన రాసలీల కోసం తన వుంపుడు గత్తె కోసము నిర్మించిన ఈ మహల్ నేడు సినిమాలో సంస్తానముగా కనిపించించింది .


ఈ మహల్ ని సినిమాలో చూపించినదుకు ధన్యవాదములు,ఫ్రెండ్స్ మీరెప్పుడైనా యాగంటికి వెళ్ళినప్పుడు ఈ మహల్ ను చూడటం మరచిపోకండి ,మన తాతల నాటి క్షేత్రాలని గ్రాఫిక్స్ లో చూసుకునే స్థితికి చేరుకోకుండా వుందాం .
పైకి ఇంత అందంగా కనిపించే ఈ మహల్ లో పైకప్పు శితిలావస్తలో వుండటం విశేషం............
thank you for visiting aradhana

Sunday, February 8, 2009

పవన్ కళ్యాన్ పులి ఆడియో సాంగ్


పవన్ కళ్యాన్ నటిస్తున్న తాజా చిత్రం పులి ఆడియో సాంగ్ ఒకటి నెట్ లో దర్శనమిస్తోంది వాటి తాలూకు లింక్ మీ కోసం
OR
THANK YOU FOR VISITING ARADHANA

Monday, January 26, 2009

స్వాతంత్ర అపురూప ఘట్టాలు
గర్వంగా సెల్యూట్ చేయి నేస్తం



1946 AICC మీటింగులో గాంధి పిలుపు
నేహ్రును ప్రధానమంత్రిగా మౌంట్ బాటన్ ప్రకటన (1947 AUG 15)


బంగ్లాదేశ్ తో యుద్దానికి సిద్దం కండి


గాంధి దారుణహత్య వార్త


మహాత్ముని కడసారి చూపు కోసం

మౌంట్ బాటన్ వచ్చాడు-1947 MAR 25

పంజాబ్ దారుణం


స్వతంత్ర సంగ్రామ మంతనాలు

ఒకే రూపాయి అయినా బొమ్మ బొరుసును చూడలేదు (ఆనాటి లైబ్రరి లో ఓ వేరు కుంపటి )
పాకిస్తాన్ కి రైలు ప్రయాణం ( ఇక సెలవు మరి )