Tuesday, July 22, 2008
కొండలరావు రావి , Kondalarao Raavi
-------------------
పరిచయం : రవి కొండలరావు , నటుడు , రచియిత మరియు నిర్మాత , పెళ్ళిపుస్తకం , బృందావనం , వరకట్నంమున్నగునవి ఈయన ఆహస క్రుత్యాలలో ముఖ్యమైనవి .
బయోగ్రఫి :
పుట్టిన తేది : ౦/౦/1931.
పుట్టిన స్థలం : శ్రీకాకుళం , ఆంధ్రప్రదేశ్ , ఇండియా .
భార్య : రాధాబాయి .
నివాసము : హైదరాబాద్ , టి.వి.సీరియల్స్ లో పని.
అవార్డ్స్ & ముఖ్య విషయాలు :
కళాప్రపూర్ణ అనే బిరుదు వచ్చింది .
పెన్ నేం -- సుకుమార్ .
ముసికాల్ కంపెని -- సుకుమార్ ఆర్కెస్ట్రా .
ఎడిటర్ -- తెలుగు మేగాజిన్స్ - జ్యోతి ,వనితా , ఫిల్మ్ మగజైన్ " విజయ చిత్ర " చిత్రవల్లియం .
ఫిమోగ్రఫి : Actor, Writer, Producer
Actor:
1. మీ శ్రేయోభిలాషి (2007) .... Raghuram
2. నిన్నీ ఇష్ట పడ్డాను (2003)
3. శ్రీ కృష్ణార్జున విజయం (1996)
4. మాడం (1993)
5. బృందావనం (1992)
6. పెళ్లి పుస్తకం (1991) .... బాబాయ్- ... aka Book of Marriage
7. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం (1991)
8. చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం (1989)
9. సాహసం చేయరా డింభకా (1988)
10. చంటబ్బాయి (1986) .... Chiranjeevi's Boss
11. మంత్రిగారి వియ్యంకుడు (1983) .... రావులపాలెం రామభద్రాయ- ... aka The Minister's In-Laws
12. ఊరికి ఇచిన మాట (1981)- ... aka Promise Made to Our Village (India: English title)
13. రాధా కళ్యాణం (1981)- ... aka The Marriage of రాధా- ... aka Wedding of Radha (India: English title)
14. సొమ్మొకడిది సోకొకడిది (1978)
15. అందాల రాముడు (1973)- ... aka The Handsome Rama
16. దసరా బుల్లోడు (1971) .... Pellilla Perayya
17. శ్రీమంతుడు (1971)
18. శ్రీ కృష్ణ విజయం (1970)
19. వరకట్నం (1968)
20. ప్రేమించి చూడు (1965)
21. శోభ (1958) .... డాక్టర్
బంగారు పంజరం (1965)
Writer:
1. భైరవ ద్వీపం (1994) (dialogue)- ... aka Veera Pratap (India: Tamil title: dubbed version)
2. బృందావనం (1992) (dialogue)
3. పెళ్లి పుస్తకం (1991) (story)- ... aka Book of Marriage
Labels: ఎందరో మహానుభావులు
మనకున్న సీరియలోఫోబియా !! (అలా హశ్చర్యపడిపోయేస్తే కష్టం, మాయాబజార్ లో్ "ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయ్" అన్న ఘటోత్కచుడ్ని ఆదర్శం గా తీసుకుని నేనే కనిపెట్టా ఈ పదం). సరే ఏదో ఒకటి ఏడూ... అని అనేసారని నాకు వినపడిందిలే. సో మనకున్న సీరియలోఫోబియా తో మొదట్లో ఈ అమృతం సీరియల్ జోలికి వెళ్ళే వాడ్ని కాదు. కానీ కొంచెం పాపులర్ అయిన తర్వాత ఇంట్లో బలవంతం గా కూర్చో పెట్టేసి చూయించారు.
మొదట్లో నేను చూసిన ఎపిసోడ్స్ లో కామెడీ కధ కన్నా పాటలకి పేరడీ లు కట్టి వెటకారం చేయడం ఎక్కువ ఉండేది కొన్ని ఎంత బాగా నచ్చేవో కొన్ని అంత చిరాకూ తెప్పించేవి. తర్వాత కొన్ని రోజులకి అన్నీ నచ్చడం మొదలు పెట్టాయి మెల్లగా నేను కూడా Addict అయిపోయాను. మరీ పనులు మానుకుని కాక పోయినా ఆదివారం ఖాళీ వుంటే మాత్రం వదలకుండా చూసే వాడ్ని. మామూలు సాగతీత సీరియల్స్ లా లేకుండా ఇది ఏ వారానికి ఆ వారం చిన్న చిన్న పిట్టకధల లా ఉండటం తో బాగా నచ్చేసింది.
అన్నట్లు ఆదివారం అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఇంకా వేస్తున్నాడో లేదో కానీ అప్పట్లో ఈటీవీ లో ఆదివారం రాత్రి 9:30 కి జంధ్యాల గారి సినిమాలు వేసే వాడు. శ్రీవారికి ప్రేమలేఖ సినిమా అందులో చాలా సార్లు వేసేవాడు అది టెలికాస్ట్ అయిన ప్రతీ సారీ చూసే వాడ్ని. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని హాస్యం ఆ సినిమాకే సొంతం.
ఇక సిరివెన్నెల గారు రాసిన ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ఎంత ఇష్టమంటే, Just Yellow banner ఈ పాటా, లిటిల్ సోల్జర్స్, ఐతే మూడూ కలిపి CD రిలీజ్ చేస్తే నాకు బెంగళూరు లో దొరకడం లేదు అని హైదరాబాద్ నుండి ఒక ఫ్రెండ్ వస్తుంటే తనతో తెప్పించుకున్నా :-) అంత ఇష్టం అనమాట.
సీరియల్ : అమృతం
సంగీతం : కల్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కల్యాణి మాలిక్
అయ్యోలూ హమ్మోలు..ఇంతేనా బ్రతుకు హు హు హు.....
ఆహాలూ ఓహొలు..ఉంటాయి వెతుకు హ హ హ.....
మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోలు....
ఇట్టే మార్చేద్దాము ఎడుపు గొట్టు ప్రోగ్రాం లు.....
వార్తల్లొ హెడ్ లైన్సా... మన కొచ్చే చిలిపి కష్టాలు......
అయొడిన్ తో అయిపోయే.. గాయాలే మనకు గండాలు....
ఎటో వెళ్ళి పోతూ..నిన్ను చూసింది అనుకో ఓ ట్రబులు..
hello..how do u do.. అని అంటోంది అంతే నీ లెవెలు.
ఆతిధ్యం ఇస్తానంటె మాత్రం వస్తుందా...
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా..
గాలైనా రాదయ్యా..నీదసలే ఇరుకు అద్దిల్లు....
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు...
ఒరేయ్ ఆంజినేలు .. తెగ ఆయస పడిపొకు చాలు....
మనం ఈదుతున్నాం..ఒక చెంచాడు భవ సాగరాలు..
కరెంటు రెంటు etc., మన కష్టాలు...
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ.. ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే.. టెన్షన్ లేం పడకు గోలీ మార్.
Labels: సాహిత్యం
చందమామ రావే, జాబిల్లి రావే.. ‘ అనో, ‘లాలి లాలి.. ‘ అనో, ‘జో అచ్యుతానంద.. ‘ అనో … తెనుగింట అమ్మ పాడకపోతే, హన్నన్నా! ఇంకేవైనా ఉందా? కొంపలంటించేయరూ కోతిరాయుళ్ళు.. అదే, పిల్ల పిడుగులు! మనం ఇప్పుడు చెప్పుకోబోయే ‘అన్నమయ్య’ గారు వాళ్ళ మీద జోలలూపడానికి సంధించిన అస్త్రాలే అవన్నీ. ఇలాటివి అన్నీ ఇన్నీ గాక.. ఏకంగా ముప్పైరెండు వేలు పైచిలుకు సంకీర్తనల్ని కూర్చారు.. రాయొద్దూ? ఈ కోతిరాయుళ్ళకే ఇంత బెట్టయితే, ఈ కోతులందరి ముఠానాయకుడైన కోతులరాయుడ్నే కాచే కొండలరాయుడి మెప్పు కోసం, తప్పదు మరి!
‘సరే బాబాయ్ , సినిమా చూసాం కదా, మళ్ళీ ఏంటి?’ అన్న ప్రశ్న ఒకదానికి నేను సమాధానం చెప్పుకోవాల్సి ఉంది కదా? ఏంటంటే, సినిమాలో అన్నీ చెప్పడం కుదరదుగా, జనాల నాడి బట్టి, రక్తి గట్టే సన్నివేశాలు చూపించారు. ఏదో నాకు తెలిసిన సినిమాలో లేని నాలుగు ముక్కలు చెబుదామని మొదలెట్టా.
కాని నేను చెబుదామనుకునే లోపే నాకంటే ఉత్సాహవంతులు కొంతమంది చాలా విషయాలు పొందుపరిచారు. ఇక్కడ (రమ్య గార్కి కృతజ్ఞతలు) అన్నమయ్య గారి నివాస స్థల విశేషాలు, వారికి ఇటీవల 600వ జయంతి సందర్భంగా కట్టించిని 108 అడుగుల విగ్రహాన్ని చూడవచ్చు. అన్నమయ్య వంశంలో ఆయనేకాదు, మొత్తం అందరూ కళాకారులే. వారి తాతగారి గురించి చిన్న కధ ప్రచారంలో ఉంది (మూలం). అదేంటంటే, అన్నమయ్య తాత నారాయణయ్యకి (మూలంలో నారయణసూరి అనుంది, అది తప్పు(దీనికి మూలం)) చదువబ్బేది కాదట.చెవులు నులిపెట్టినా, కోదండం వేయించినా, గుంజిళ్ళు తీయించినా ఓనమాలు కూడా అబ్బకపోతే, ఆ బాధతో, ఆ వూరి చింతలమ్మ గుడిలో ఉన్న పాము పుట్టలో చెయ్యిపెట్టి చావడానికి సిద్దపడ్డాడట, అప్పుడు ఆ చింతలమ్మే ఒక ముసలిదాని రూపంలో వచ్చి, మీ వూరి కేశవస్వామిని(గుడి చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు) నీకు చదువు ప్రసాదించమని అడుగు - ఇస్తాడు అని చెప్పి పంపించిదట. అప్పుడా నారాయణయ్య “సరస్వతికి మామగారివి నువ్వు, నాకింత విద్యా దానం చెయ్యి” అని వేడుకొన్నాట్ట. ఆ స్వామి అనుగ్రహంతో మాహా విద్వాంసుడయ్యాడు, ఆ స్వామి ఒక్క నారాయణయ్యని మాత్రమే కాకుండా, అతని సంతతినంతటినీ కరుణించినట్టున్నాడు. తాళ్ళపాక కుటుంబంలోని వారంతా - వాగ్గేయకారులూ, సాహితీవేత్తలూ, సంగీత కళాకారులూ, కవులూ, విద్వాంసులూ, పండితులూను. స్వయానా అన్నమయ్య భార్య తిమ్మక్కే “సుభద్రాకల్యాణ”మనే ద్విపద కావ్యాన్ని రచించింది కూడా.
ఆ.. ఇంకో ముక్కేంటంటే, మొన్న “కట్టుబాట్లు” పేరుతో ఒక టపా రాయడం జరిగింది. అందులో ‘దేవాలయం పై బూతుబొమ్మలు’ అనే విషయం మీద చర్చ జరిగింది. బహుశా, అన్నమయ్య రచనల వెనకున్న ‘భగవదారధనా భావం’, ఆ శిల్పాల వెనకున్న కారణం ఒక్కటేనని, నాకు అనిపిస్తుంది, అలాగే ఇది వరకే చాలా మందికి తోచింది (మూలం హైదరాబాద్ విశ్వవిద్యాలయం). ఈ మూలంలో ఏముందంటే, ” అన్నమయ్య విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించినవాడు. ఆ సిద్ధాంతం ద్వైధీభూతమెలాగో ఆయన కవిత్వమూ ద్విధావిభజితం. భగవత్కీర్తనకై పరమ ఆధ్యాత్మిక సంకీర్తనలు ఎలా రచించాడో, వెంకటేశ్వరుడు ఆయన ఇరువురు భార్యలు - అలమేలు మంగ , పద్మావతుల శృంగారాన్ని రసరమ్యంగా కీర్తించాడు. భక్తుడైన వ్యక్తి ఆ శృంగార సంకీర్తనలను నాయక, నాయికలు అలౌకికులని భావిస్తే అవి భగవదారాధనలో భాగమవుతాయి. ఆ శృంగార సంకీర్తనలు భగవంతునికి సంబంధించినవని భక్తుడు నిరంతరం భావిస్తూ ఉండాలి. భక్తుడు/ శ్రోత/ పాఠకుడు ఆ పాత్రల్లో తాదాత్మ్యమవడానికి వీలు లేదు. అప్పుడవి పరమలౌకిక శృంగార గీతాలయ్యే ప్రమాదముంది. అన్నమాచార్యుడిని తన ఆస్థానానికి ఆహ్వానించి వేంకటేశ్వరుడి పై పాట పాడుమన్న సాళువ నరసింహరాయుడు ‘ఏమొకో చిగురుట ధరమున’ అనే రమ్యమైన గీతాన్ని విని, తనపైగూడా అటువంటి కీర్తనే పాడుమని అనడం, నరసింహరాయుడు ఆ పాత్రలో తాదాత్మ్యమవడం వల్లే జరిగింది. ‘నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపదు జిహ్వ’ అని అన్నమయ్య సున్నితంగా తిరస్కరించాడు.” ఇహ నేను చెప్పేదేంటంటే, ఇంతకు మించి నేను గాని, ఇంకెవరైగాని చెప్పడం కష్టం. అదీ మీరు, “చదివినవన్నీ చేయనలవి కావు” అని మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తే అంతకంటే అసాధ్యం లేదు.
Labels: సాహిత్యం
మనలో చాలా మంది తెలిసో తెలియకో ముఖ్యమైన ఫైల్స్ డిలేట్ అయిపోతే అయ్యో పోయాయే ని బాధ పడుతుంటారు. అయితే ఇలా డిలేట్ అయిపోయిన ఫైల్సును సైతం వెనుకకు తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
కంప్యూటర్లోని ఫైల్స్ డిలేట్ అయిన విధానాన్ని బట్టి రికవరీ అనేది ఆధార పడి వుంటుంది.
1. మీరు కీబోర్డ్లోని డిలేట్ గాని, రైట్ క్లిక్ డిలేట్ ద్వారా గాని డిలేట్ చేస్తే వాటిని రికవరీ చేయాలంటే డెస్క్ టాప్ పై ఉన్న రీసైకిల్ బిన్ ఓపెన్ చేస్తే దానిలో డిలేట్ అయినవి కనిపిస్తాయి. అపుడు వాటిని సెలక్ట్ చేసి మౌసు రైట్ క్లిక్ చేస్తే వచ్చే మెనూలో రిస్టోర్ అనే ఆప్షన్ సెలక్ట్ చేస్తే రికవరీ అవుతాయి.
2. అలా కాకుండా పర్మినంట్ గా డిలేట్ అయిపోతే ఇక తర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ వాడాల్సిందే. అలాంటి వాటిలో బాగా పనిచేసేది గెట్ డాటా బ్యాక్
ఈ సాఫ్ట్ వేరును మీరు ఉపయోగించే ఫైల్ సిస్టము ఆధారంగా కొనుగోలు చేయవలసి వుంటుంది. అనగా ఫాట్ లేదా ఎన్.టి.ఎఫ్.ఎస్.ను బట్టి.
అయితే ఈ డాటా రికవరీ అనేది డిలేట్ చేసిన లొకేషన్ లో వేరే కొత్త డాటా రాయబడనంత వరకూ రికవరీ చేయవచ్చు. కాబట్టి డాటా రికవరీ అనేది డాటా లాస్ అయిన వెంటనే ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వుంటాయి.
ఈ సాఫ్ట్ వేర్ ను ఈ క్రింది సైట్ నుండి డవున్లోడ్ చేసుకోవచ్చు.
http://www.runtime.org/downloads.htm
Labels: TECHNOLOGY
మన దేశం గురించి వెటకారంగా ఒక కథ చెబుతొంటారు కొందరు.ఒకసారి జపాన్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే చిన్న సూదిని తయరుచేస్తే మనవాళ్ళు దాని మీద Made in India అని రాసుకొన్నారని,ఈ మాటలో వేటకారాన్ని పక్కన పెడితే అసలు అంత చిన్న సూది మీద అని రాసారంటే మనవాళ్ళు ఇంకా సన్నని సూదిని తయారుచేసి దానితో రాసారన్నమాటే కదా.
అలాగే C-Brain వైరస్ మన వాళ్ళు కనిపెత్తకొపొయిన దాన్ని తొలగించే Red alert ను మనవాళ్ళే కనిపెట్టారని చదివినట్టు గుర్తు.
ఇంతకీ ఇదంతా ఏందుకు చెబుతున్నానంటే,సోషల్ నెట్వర్కింగ్ లో ప్రభంజనమైన ఆర్కుట్ను వెబ్ పేజ్ లోకి వెళ్ళకుండానే మన డేస్క్ టాప్ నుండి వాడుకొనేందుకు మన భారతీయుడోకరు ఒక టూల్ తయారుచేశారు కాబట్టి ,కావాలంటే కింది బొమ్మలు చూడండి.
ఈ Software పేరు scrape mate.ఇది install చేసుకొంటే,మన Desktop నుండే Orkut కి Login కావచ్చు.
మన orkut Friends listలో ఉన్న photos అన్ని పైన చూపించినట్టు మన Desktop మీదే ప్రత్యక్షమవుతాయి.
అప్పుడు మనకు కావలసిన photo మీద click చేసి scrap రాసుకోవచ్చు.
"S" అక్షరం పక్కనున్న Arrow marks తో మన friends list లోవున్న contacts అన్ని Navigate చేసుకోవచ్చు.
ఈ tool తయారుచేసిందిశ్రీనివాస్ అన్నం .ఈ software ను అతని blog నుండే download చేసుకొవచ్చు.ఇది పనిచేయాలంటే AIR తప్పనిసరి.
Labels: TECHNOLOGY
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ టైటిల్ బార్‌లో Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కన మీ పేరు కూడా చూపించబడేలా WinXpలో ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గముంది.దీనికిగాను,మొదట Start>Run కమాండ్ బాక్స్ లొ gpedit.msc అనే కమాండ్‌ని టైప్ చేసి O.K కొట్టండి. వెంటనే Group Policy Editor Options అనే పలు ఆప్షన్లతో కూడిన యుటిలిటీ ఓపెన్ అవుతుంది. అందులో User Configuration>Windows Settings అనే విభాగంలోకి వెళ్ళండి. దాని క్రింద Internet Explorer Maintainance అనే ఆప్షన్ వద్ద కుడిచేతి వైపు 'Browser Title' అనే ఆప్షన్ దర్శనమిస్తుంటుంది. దాన్ని మౌస్‌తొ డబుల్ క్లిక్ చెయ్యండి. దాంతో Browser Titleపేరిట ఒక విండో ప్రత్యక్షమవుతుంది. ఆ విండోలో Customize Title Bars అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి... Title boxలో మీరు ఇవ్వాలనుకున్న పేరుని టైప్ చెయ్యండి. ఇకపై మీరు ఎప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసినా Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కనే మీ పేరూ టైటిల్ బార్‌పై చూపించబడుతుంటుంది.
Labels: TECHNOLOGY
Youtube, Google Video, Bglip.tv వంటి వీడియో షేరింగ్ వెబ్ సైట్లతో పాటు CNBC, ABC News, BBC వంటి ప్రముఖ వార్తా సంస్థలు కూడా ప్రముఖ వార్తలను వీడియో క్లిప్‍ల రూపంలో ఇంటర్నెట్‍లో పొందుపరుస్తున్నాయి. ఈ నేఫధ్యంలో ఆయా వెబ్ సైట్లు అన్నింటికి విడివిడిగా వెళ్ళి కావలసిన వీడియో క్లిప్‍ల రూపంలో ఇంటర్నెట్‍లో పొందుపరస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయా వెబ్ సైట్లు అన్నింటికి విడివిడిగా వెళ్ళి కావలసిన వీడియో కోసం వెదికే కన్నా www.truveo.com అనే వెబ్ సైట్‍ని సందర్శించండి. ఇందులో Search బాక్స్ లో మీరు ఏ కీవర్డ్ టైప్ చేసినా అన్నివీడియో సైట్లలో వెదకబడుతుంది. ఈ వెబ్‍సైట్ ద్వారా మనం టైప్ చేసిన కీవర్డ్ కేవలం ఒక నిర్ధిష్టమైన విభాగంలోనే (స్పోర్ట్స్, ఎంటర్‍టైన్‍మెంట్) వెదకబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు.అలాగే బాగా పాపులర్ అయిన వీడియోలను మాత్రమే, లేదా ఎక్కువ మంది చూసిన వీడియోలను మాత్రమే లేదా తాజాగా అప్‍లోడ్ చేయబడిన వీడియోలను మాత్రమే .. ఇలా భిన్న అంశాల ఆధారంగా వీడియోలను వెదికే అవకాశం కల్పించబడింది. ఇందులో టివి షోస్, మూవీక్లిప్స్, మ్యూజిక్ వీడియోస్ వంటి వేర్వేరు విభాగాల క్రింద వీడియోలు అమర్చబడి ఉన్నాయి.
Labels: TECHNOLOGY
వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి, లేదా తమకు తాము స్వంతంగా వెబ్ సైట్లని రూపొందించుకోదలుచుకున్న వారికినెట్‍లో వివిధ ఆకర్షణీయమైన వెబ్ సైట్లని చూసినప్పుడు అవి ఏ వెబ్ టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడ్డాయన్న ఆసక్తి కలగడం సహజం. మీకు తారసపడే ఏ వెబ్‍సైట్ అయినా ఏయే టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడిందో తెలుసుకోవాలనుకుంటే builtwith అనే వెబ్ సైట్‍ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్‍లో మీరు ఏ సైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేసి Lookup అనే బటన్‍ని క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి.
Labels: TECHNOLOGY
మీ కంప్యూటర్లో ఎంత మెమరీ ఉన్నా, ఎంత శక్తివంతమైన కంప్యుటర్ అయినా ఒకేసారి పలు అప్లికేషన్ ప్రోగ్రాములను సుదీర్ఘ కాలం పాటు ఓపెన్ చేసి పెట్టడం వల్ల సమయం గడిచేకొద్దీ పనితీరు నెమ్మదిస్తుంది. అలాంటప్పుడు కంప్యుటర్ ని రీస్టార్ట్ చేస్తేనే తిరిగి ఊపండుకుంటుంది. ఇలా స్లో అయినప్పుడు రీస్టార్ట్ చేసే అవసరం లేకుండా ఒ చిట్కా పాటించవచ్చు. డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకుని Type the location of the item బాక్స్ లో క్రింది కమాండ్ ఉన్నదున్నట్లు టైప్ చేయండి.
%windir%system.32\rundll32.exe advapi32.dll,ProcessIdleTasks ఇప్పుడు Next అని ప్రెస్ చేసి ఆ షార్ట్ కట్ కి Memory Cleaning లేదా మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ఇకపై సిస్టం స్లో అయిందని భావించినప్పుడల్లా ఈ షార్ట్ కట్ ని ఉపయోగించండి. మెమరీలో మొండిగా కూర్చున్న టాస్క్ లు , త్రేడ్ లు క్లోజ్ చేయబడి మెమరీ ఫ్రీ చేయబడుతుంది.
Labels: TECHNOLOGY
TIFF,BMP వంటి హైక్వాలిటీ ఇమేజ్ ఫార్మేట్లకు చెందిన ఇమేజ్‌లను
ఫైల్ సీజ్‌ని తగ్గించుకోవడానికి JPEG ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేస్తుంటాం.
JPEG లోకి మార్చబడేటప్పుడు ఫైల్ సైజ్ తగ్గడానికి కొంత ఇమేజ్ క్వాలిటీ
కూడా తగ్గించబడుతుంది. అలా ఇమేజ్ క్వాలిటీ కోల్పోయిన JPEG
ఇమేజ్‌లను తీసుకుని తిరిగి వాటిని సాధ్యమైనంత పూర్తి క్వాలిటీలోకి రప్పించే
ప్రోగ్రామే.. "Unjpeg". ఈ ప్రోగ్రాం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తుంది.
Labels: TECHNOLOGY
ఇంటర్నెట్ షేరింగ్
మీ ఆఫీసులో లోకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) వుందా? ఒకే కంప్యూటర్ లో ఇంటర్నెట్ కనెక్షన్ వుందా ? నెట్ వర్క్ లోని మిగతా కంప్యూటర్ల లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ కావాలా? అయితే ccproxy ని http://www.youngzsoft.net/ccproxy/client.htm నుండి డౌన్ లోడ్ చేయండి. ఇదే సైట్ లో లాన్ (LAN)సెట్టింగ్స్ గురించి కూడా వివరించారు. ఇది మేనేజబుల్ proxy చాలా చక్కగా పని చేస్తుంది.
లాన్ సెట్టింగ్స్ క్లుప్తంగా:
౧. ముందుగా ccproxy ని ఇంటర్నెట్ కనెక్షన్ వున్న కంప్యూటర్ లో ఇనస్టాల్ చెయ్యాలి.
౨. లాన్ నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ లో అయితే ఇంటర్నెట్ యాక్సెస్ కావాలో ఆ కంప్యూటర్ లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ తెరచి మెయిన్ మెనూ లోని Tools -> Internet Options -> Connections -> Lan Settings లో ముందుగా Automatically detect settings దగ్గర టిక్ (Select) చెయ్యాలి. తరువాత Use a proxy server for your LAN ను టిక్ చేసి Address దగ్గర ఐపి అడ్రస్ (ఇంటర్నెట్ కనెక్షన్ వున్న కంప్యూటర్ IP Address)ఎంటర్ చెయ్యాలి, Port దగ్గర 808 ఎంటర్ చెయ్యాలి. ఇప్పుడు ’ఒకే’...’ఒకే’ ...చెయ్యాలి.
ఇంటర్నెట్ యాక్సెస్ చెయ్యటానికి లాన్ నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ రెడీ...
Labels: TECHNOLOGY
విండోస్ రన్ కమాండ్లు
వివిధ అప్లికేషన్లు, అడ్మిన్ టూల్స్, కంట్రోల్ పానెల్, యుటిలిటీ లను డైరెక్ట్ గా Start --> Run నుండి ఓపెన్ చెయ్యటానికి ఈ క్రింద యివ్వబడిన విండోస్ రన్ కమాండ్లను ట్రై చేయండి
Applications:
calc - Starts Calculator
excel - Starts Microsoft Excel
explorer - Starts Windows Explorer
firefox - Starts Firefox if installed
iexplore - Internet Explorer
mobsync - Starts Microsoft Synchronization Tool
msimn - Outlook Express
mspaint - Starts Microsoft Paint
notepad - Starts Notepad
outlook - Starts Microsoft Outlook
powerpnt - Starts Microsoft Powerpoint
wab - Starts Windows address book
winchat - Starts Microsoft Chat
winword - Starts Microsoft word
wordpad - Starts Wordpad
Control Panel:
appwiz.cpl - Starts Add or Remove Programmes
control - Starts the Control Panel
control desktop - Opens Display Properties
control folders - Opens Folder Options
control fonts - Opens Fonts
control mouse - Opens Mouse Settings
control netconnections - Opens Network Connections
control schedtasks - Opens Schedules Tasks
control userpasswords - Opens User Accounts
firewall.cpl - Starts Windows Firewall
mmsys.cpl - Starts Sound and Audio Device Properties
netsetup.cpl - Starts Network Setup Wizard
powercfg.cpl - Starts Power Options Properties
sysdm.cpl - Opens Systems Properties
wuaucpl.cpl - Starts Windows Updates
Administration:
ciadv.msc - Opens Indexing Service
compmgmt.msc - Opens Computer Management
devmgmt.msc - Opens Device Manager
diskmgmt.msc - Opens Disk Management
eventvwr.msc - Opens Event Viewer
fsmgmt.msc - Opens Shared Folder Management
gpedit.msc - Starts Group Policy Editor
ntmsmgr.msc - Opens Removable Storage Management
perfmon.msc - Opens Performance Monitor
secpol.msc - Opens Security Policies
services.msc - Opens Service management
Utilities:
chkdsk - Runs Check Disk (Ex: chkdsk C:)
clipbrd - Opens Clipboard Viewer
cmd - Starts a Command Prompt Window
diskpart - Runs Microsoft Disk Partitioning Tool
drwtsn32 - Runs Dr.Watson Debugger
dxdiag - Runs DirectX Diagnostic Tool
eudcedit - Starts Private Character Editor
fsquirt - Runs Bluetooth Transfer Wizard
logoff - Logs Off User from Windows
msconfig - Starts System Configuration Utility
mstsc - Starts Remote Desktop Connection
osk - Starts On Screen Keyboard
packager - Opens Packager
regedit - Starts Registry Editor
shutdown - Runs Windows Shutdown Command
taskmgr - Runs Task Manager
tourstart - Starts Windows Tour
Labels: TECHNOLOGY
ఫైల్ / ఫోల్డర్ క్రియేట్ చేయండి పేరు లేకుండా... (create file/folder with no name)
విండోస్ లో ఫైల్ కాని ఫోల్డర్ కాని పేరు (File Name/Folder Name) లేకుండా క్రియేట్ చెయ్యవచ్చా??? ... సాధారణంగా అయితే చెయ్యలేము...కాని ఈ విధంగా చేస్తే పేరు లేకుండా ఫైల్ కాని ఫోల్డర్ కాని క్రియేట్ చెయ్యవచ్చు...
౧. ముందుగా పేరు లేకుండా చెయ్యవలసిన ఫైల్ / ఫోల్డర్ మీద మౌస్ రైట్ క్లిక్ చేసి...’Rename' సెలెక్ట్ చెయ్యాలి
౨. [Alt] కీ హోల్డ్ చేసి 255 నంబరు ఎంటర్ చేస్తే ఖాళీ స్పేస్ వస్తుంది. ఇప్పుడు [Enter] కీ ప్రెస్ చెయ్యాలి...
ఇప్పుడు ఫైల్ / ఫోల్డర్ అవుతుంది పేరు లేకుండా...
Labels: TECHNOLOGY
సిల్లీ పాయింట్
పేకముక్కల్లో కళావర్ రాజు, ఇస్పేట్ రాజు చేతుల్లో కత్తి కిందకి దించి ఉంటుంది. ఆఠీన్ రాజు చేతులు రెండూ కోటును పట్టుకున్నట్టుగా ఉంటాయి కానీ మెడ వెనగ్గా ఒక కత్తి కన్పిస్తుంటుంది. డైమండ్ రాజు చేతిలో గొడ్డలి ఉంటుంది.
* ఆనియన్(ఉల్లిపాయ) అనేది లాటిన్ పదం. ఆ పదానికి అర్థం... 'పెద్దముత్యం' అని.
* మానవశరీరంలో ఇతరభాగాలపై ఉన్న వెంట్రుకల కన్నా గడ్డం మీది వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి.
* గుర్రాలూ, ఎలుకలూ వాంతి చేసుకోవు.
* మనిషి కాళ్లల్లో 2,50,000 చెమటగ్రంథులు ఉంటాయి.
* ఒక అధ్యయనం ప్రకారం సెలబ్రిటీలతో శృంగారమే అంతర్జాతీయంగా అత్యధికులు కనే కల.
* ఒక గంటసేపు టైపింగ్ చేస్తే 110 క్యాలరీలు ఖర్చవుతాయి.
కథల్లోనూ యానిమేషన్ చిత్రాల్లోనూ ఉండే కల్పిత పాత్రల మీద వోజుతో ఆయా క్యారెక్టర్ల దుస్తులను ధరించడాన్ని 'కాస్‌ప్లే' అంటారు. దీనికి ఆద్యులు జపనీయులు. కాస్‌ప్లే అంటే కాస్ట్యూమ్‌ప్లే అని అర్థం. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు కాస్‌ప్లే కిందకు రావు.
* శరీరంలో మరే ఇతర భాగంకన్నా నాలుకపైనే అత్యంత సున్నితమైన నరాలుంటాయి.
*అమెరికా తర్వాత సరికొత్త సాఫ్ట్‌వేర్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఐర్లాండ్.
*పదిహేడో శతాబ్దం తొలినాళ్లలో థర్మామీటర్‌లో పాదరసానికి బదులు బ్రాందీని పోసేవారట.
హ్యారీపోటర్ సిరీస్ పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ మంది చదివినట్టు ఒక సర్వేలో తేలింది.
* స్విమ్‌సూట్లన్నీ బికినీలు కావు. రెండుముక్కలు(టూపీసెస్) ఉంటేనే దాన్ని బికినీ అనాలి. త్రీపీసెస్ ఉంటే అది 'ట్రికినీ'. పై నుంచి కిందదాకా ఒకటే ఉంటే అది 'వోనోకినీ'.
* ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు సగటున ఆరుసార్లు మూత్రవిసర్జన చేస్తాడు.
* ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య కేసులు మహిళల్లో కన్నా పురుషుల్లో మూడింతలు ఎక్కువ. కానీ... ఆత్మహత్యా ప్రయత్నాలు పురుషుల్లో కన్నా మహిళల్లో మూడురెట్లు అధికం.
* ఒక పూర్తి సీడీలో దాచి ఉంచిన సమాచారాన్ని దారం రూపంలోకి మార్చగలిగితే అది మూడున్నరమైళ్ల పొడవుంటుంది.
* వైట్ హౌస్‌లో 59 సీట్ల మినీ థియేటర్ ఉంది.
*మీసమున్న ఆఖరి అమెరికన్ అధ్యక్షుడు టాఫ్ట్.
Labels: సిల్లీ పాయింట్
ఇది ఓ ప్రత్యేకమైన మెమొరీ. ఎక్కువ మెమొరీ కలిగి ఉ౦డే పెద్ద పెద్ద ప్రోగ్రాములు నడిపెటప్పుడు ర్యామ్ సరిపోకపోతే ప్రోగ్రా౦ పని చేయకు౦డా ఆగి పోతు౦ది. అ౦దుకే కొన్ని సీపీయుల్లో వర్చ్యువల్ మెమొరీ సౌకర్య౦ ఉ౦టు౦ది. ఇది చేసే పని ఎమీట౦టే ఆ పెద్ద ప్రోగ్రాముల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి, హార్డ్ డిస్క్ లోని ప్రదేశాన్నే ర్యామ్ గా వినియోగి౦చుసునే వీలు కల్పిస్తు౦ది. ఇ౦దువల్ల తక్కువ ర్యామ్ తో పని పూర్తవుతు౦ది. అ౦టే ఉదా.కి ఓ ప్రోగ్రామ్ 24MB ర్యామ్ కావాలనుకు౦దా౦.వర్చ్యువల్ మెమొరీ సౌకర్య౦ ఉ౦టే 16MB ర్యామ్ తో ప్రోగ్రా౦ పనిచేస్తు౦ది. వర్చ్యువల్ అ౦టే మధ్య.‘లేకపోయినా ఉన్నట్లు భ్రమి౦పజేసేద’ని అర్ద౦. అ౦దుకే ఈ పేరు.
Labels: TECHNOLOGY
Apr 15 మీ జీవితకాల౦ తెలుసుకో౦డి (When ur going to die ? )
0 comments Posted by aradhana at 7:30:00 AMhttp://deathclock.com/
అ౦త ధైర౦ ఉ౦టేనే చుడ౦డి!!!!!
Labels: ఫన్
‘వోరేయ్ బ౦టిగా ని చేష్టలు చూస్తు౦టే పోయిన జన్మలో కోతివై పుట్టి ఉ౦టావు’ అని సరదాగా మన స్నేహితులు , పెద్దవాళ్ళు అనడ౦ మీరు గమని౦చే ఉ౦టారు. కొ౦త మ౦ది వాళ్ళ గత జన్మలో ఎక్కడ పుట్టామో, ఏమి చేసేవాళ్ళమో అని సమయ౦ దొరికినప్పుడు ఆలోచిస్తు౦టారు కూడా! అ౦దులో నేను కూడా ఒకడిని :) నాకే కాదు ఎవరికైనా తమ గత జన్మ గురి౦చి తెలుసుకోవాల౦టే ఆసక్తే కదా! మీకు కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉ౦టే లోకి వెళ్లి మీ పుట్టిన తేది,నెల,స౦వత్సర౦ ఇస్తే చాలు వె౦టనే మీ గత జన్మ వివరాలు వస్తాయి. మరి౦కె౦దుకు ఆలస్య౦.....
Labels: ఫన్