Pages

Subscribe:

Monday, February 23, 2009

ఈశ్వరుని అనుగ్రహానికి నాంది మహాశివరాత్రి

ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా సంవత్సరంలో పదకొండు మాస శివరాత్రులు వస్తే ఆ పదకొండింటి కంటే గొప్పదైన ఈ శివరాత్రి - అంటే -మాఘ మాస శివరాత్రి ' మహా శివరాత్రి (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) అవుతోంది .'మహా' అని ఎక్కడ అనిపించినా కొన్ని అలాంటి వాటికంటే గొప్పదని భావం . శివ పార్వతులిరువురికి కలిపి 'శివులు' అని పేరు ( శివ శ్చ శివా చ సివౌ ).ఆ ఇద్దరికీ సంభందించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం . అందుకే శివరాత్రి నాడు అయ్యకి - అమ్మకి కుడా వుత్సవం సాగుతుంది .శివ - మంగళకరమైన ,రాత్రి - రాత్రి ఏదో అది శివరాత్రి అనేది మూడో అర్థం .

ప్రాణికోటి యావత్తు నిద్రపోతూందే కాలం రాత్రి ,నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం.ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు .తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే మొదలవుతుంది.చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. చలి ,మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని కప్పుకుని వుండగా - పిశాచ ,భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన శంకరుడు,నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే.....

ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.

చివరగా ఈ మహాశివరాత్రి సందర్బముకు మీకు మీ కుటుంభ సభ్యులకు మీ మిత్రులకు ,మన బ్లాగరుల కుటుంబ శ్రేయోభిలాషులకు మరొక్కసారి మహా శివరాత్రి శుభాకాంక్షలు , అంతేగాక అందరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ పరమశివుని కోరుకుంటూ.......... సెలవు

మీ ఆరాధన


Tuesday, February 17, 2009

అవును మన పాత పాడు బంగ్లా సినిమాలో కనిపించింది ,కర్నూలు జిల్లా బనగాన పల్లె సమీపంలో వున్న యాగంటి గొప్ప శైవ క్షేత్రము , ఇక్కడి గుహలు చాలా ప్రసిద్ది ,ఈ క్షేత్రము చేరుకునే దారిలోనే పాత పాడు గ్రామములో ఈ బంగ్లా కనిపిస్తుంది, నవాబుల మజిలి కి చక్కని సాక్షిగా కొండపై మనకు దర్శనమిస్తుంది ,ఎన్నో సార్లు ఆ దారి గుండా ప్రయాణించిన నాకు ,ఈ బంగ్లా గురించి ఆశించిన మేర ఆదరణ లభించలేదని తెలిసింది ,



కాని ఇన్ని రోజులకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో గద్వాల్ సంస్తానముగా వెలిగింది ,అలనాడు బనగాన పల్లె నవాబు తన రాసలీల కోసం తన వుంపుడు గత్తె కోసము నిర్మించిన ఈ మహల్ నేడు సినిమాలో సంస్తానముగా కనిపించించింది .


ఈ మహల్ ని సినిమాలో చూపించినదుకు ధన్యవాదములు,ఫ్రెండ్స్ మీరెప్పుడైనా యాగంటికి వెళ్ళినప్పుడు ఈ మహల్ ను చూడటం మరచిపోకండి ,మన తాతల నాటి క్షేత్రాలని గ్రాఫిక్స్ లో చూసుకునే స్థితికి చేరుకోకుండా వుందాం .
పైకి ఇంత అందంగా కనిపించే ఈ మహల్ లో పైకప్పు శితిలావస్తలో వుండటం విశేషం............
thank you for visiting aradhana

Sunday, February 8, 2009

పవన్ కళ్యాన్ పులి ఆడియో సాంగ్


పవన్ కళ్యాన్ నటిస్తున్న తాజా చిత్రం పులి ఆడియో సాంగ్ ఒకటి నెట్ లో దర్శనమిస్తోంది వాటి తాలూకు లింక్ మీ కోసం
OR
THANK YOU FOR VISITING ARADHANA