Pages

Subscribe:

Sunday, February 7, 2010

అదర నా గుండె లదరా
నిదుర నా కళ్ళు చెదరా
మధుర వెన్నెల గాసెను కదరా !!!
నా పాళీ రాజా !!!
మధుర వెన్నెల గాసెను కదరా !!!


కాలికి గజ్జె కట్టి
కడవ సంకన బెట్టి
కంటినీరు కడవ నిండెను కదరా
నా పాళీ రాజా !!!
కడవ పగిలి కాల్వ పారెను కదరా ....
||అదర నా గుండె లదరా||

నీకు నీ వారు లేరు
నాకు నా వారు లేరు
ఏటి గట్టున గూడు కడదాం పదరా ...
నా పాళీ రాజా !!!
ఏరు వస్తే కూడాబోదం పదరా....
||
అదర నా గుండె లదరా||

అందమంతా కళ్ళకింద
ఛందమంత బుగ్గపైన
నిన్ను చూడ నాడి కదిలెనురా...
నా పాళీ రాజా !!!
నాడి కాస్తా నడక నేర్చెను రా ....
||అదర నా గుండె లదరా||

thanks for visiting

by

తెలుగు జానపదారాధన

you may download audio here


1 Comment:

  1. భావన said...
    బాగుందండి. రాగం ఎలానో తెలిస్తే బాగుండేది ఇంకా. ఎవరైనా పాడేరా?

Post a Comment