Sunday, November 23, 2008
నేడు రాష్ట్రము మొత్తము సిరిసిల్ల ఆత్మహత్యల గురించే చర్చిస్తోంది.మన దేశంలో వ్యవసాయము తరువాత అంతటి ప్రాదాన్యాన్ని కలిగిన రంగం చేనేత రంగమే , మరి ఎందుకో ఆ హస్తకలకు ఆస్తి కల లేదు,విధానాల లోపమా ,ఆచరణ లోపమా ....
మన రాష్ట్రంలో చేనేతల గురించి మాట్లాడగానే మొదటగా స్ఫురించే పదం సిరిసిల్ల నే మరి ఆ సిరిసిల్ నేడెందుకు వురిసిల్ల గా మారుతోంది ,మహాత్ముదన్నట్లుగా యాంత్రీకరణం హస్త కలల్ని అణచి వేస్తోందా , మర మగ్గాల మారణ హోమంలో చే మగ్గం అసువులు బాస్తోందా , మర మగ్గాలని కూడా మన మగ్గాలుగా మర్చి మంచి వుత్పట్టులను అందించలేమా .... ఖచ్చితంగా అందించగలము .
నేడు సిరిసిల్ల కాకుండా వేరే వూరిలో వున్న నేతన్నల అత్మఘోశాలు ఎందుకు తక్కువగా వినిపిస్తున్నాయి , అక్కడ నేతన్నకు సరిన ఆదయ వనరులు సమగ్రంగా వున్నాయా ,ఎందుకీ వ్యత్యాసము అని ఒకసారి పరికిస్తే ...
౧. సిరిసిల్ల దాదాపుగా తెల్ల వస్త్రాల తయారీలో నిమగ్నమయి వుంది .
౨. దళారి వ్యవస్థ సిరిసిల్ల లో రాజ్యమేలుతోంది .
౩. పోటి ప్రపంచానికి తగిన ప్రత్యేకతలను,మార్పులను అనుకరించడం.
పై కారనాలన్నింటికి ఒకే ఒక సాక్షం అందించగాలిగాలననే ఓ సదుద్దేశ్యంతో ఓ వుదాహరణ ...
నేడు రాష్ట్రము మొత్తం కడప జిల్లా లోని అబివ్రుద్దిని తొంగి చూస్తోంది ,అలంటి కడప జిల్లా లోని జమ్మలమడుగు ప్రాంతం హస్త కళలకు ప్రసిద్ది ,అక్కడ వుండే ఓ చిన్న గ్రామమే వేపరాల , జనాభా సుమారుగా ,ఆర్థిక వ్యవస్థ అంతకంటే పటిస్టమే,....
నేడు రాష్ట్రము మొత్తం కడప జిల్లా లోని అబివ్రుద్దిని తొంగి చూస్తోంది ,అలంటి కడప జిల్లా లోని జమ్మలమడుగు ప్రాంతం హస్త కళలకు ప్రసిద్ది ,అక్కడ వుండే ఓ చిన్న గ్రామమే వేపరాల , జనాభా సుమారుగా ,ఆర్థిక వ్యవస్థ అంతకంటే పటిస్టమే,....
అక్కడ ఎలా(ఏమి) జరుగుతోందంటే ....
సాధారణ చే మగ్గాల పైన నేయవలసిన రక రకాల వుత్పట్టులను మర మగ్గాల సమయమ్తో నేస్తున్నారు ,ఇక్కడ మగ్గాలు కూడా సిరిసిల్ల లోని మగ్గాలకు సంభందించినవే , కాని మార్కెట్లో దాని ప్రాశస్త్యం చే మగ్గాల నుండి వచ్చినట్లుగా వుంటుంది ,మార్కెట్ లో ఒక వస్త్రం విలువ :500 నుంచి 700 దాకా ఉంటుంది ,చే మగ్గం పై ఆ నేతని రోజుకి ఒక వస్త్రాన్ని నేయగలరు ,అందుకు ఒక నేతన్నకి ఒక రోజుకు లభించే వేతనం : 100 రూపాయలు ,కాని ఇక్కడ అదే రకమైన వస్త్రాన్ని మర మగ్గాల సాయం తో రోజుకు నాలుగు లేదా అయిదు నేయ గలుగుతున్నారు ,అందుకు అతనికి లభించే వేతనం :400 , ఎంత వ్యత్యాసమో మీకే తెలుస్తూంది పేరుకు చేనేత కాని మరనేత ,ఇది తప్పు అని అనటం లేదు ,ఎలాగు అలవాటు పడ్డాం కనుక అనుకరించాలని నేననుకుంటున్నా .....
చీర కట్టుకునే ప్రతి వాళ్లకి తెలియదు కదా నేసిన మగ్గం గురుంచి,....
ఇక పొతే దళారీ వ్యవస్థ ,దళారీలు లేని రంగం వుండదేమో బహూశా , ఇక్కడ కూడా ఇది వున్న ఎక్కువ భాగం మంది ఆదాయాన్ని కూడా కూలి లాగానే భావిస్తున్నారు , ఎందుకంటే ఇక్కడ ప్రతి వొక్క కూలి ఒక దళారియే,అంటే ఇది కులిల ప్రజా స్వామ్యము ,...
మారుతున్న కాలానికి కాదు మారుతున్న నడవడికకు అనుగుణంగా ఇక్కడి నేతన్నలు తమ తమ వుత్పత్తులలో రకరకాల ప్రత్యేకతలను వల్లిస్తున్నారు ,అదెలాగంటే మొన్నటి దాక వున్న నెంబరు(పోగు లావును బట్టి నెంబరును నిర్ణయిస్తారు)స్థానంలో నేటి నెంబరు గల చీరలు రాజ్యమేలుతున్నాయి ,తరువాత పట్టు పరిశ్రమలో కుడా రాజ్యమేలడానికి వేపరాల సన్నద్దమవుతోందని అక్కడి వారిని చూస్తేనే తెలుస్తూంది ....
ఈ వ్యాసం ఎందుకు రాసానంటే ఇక్కడ తయారయ్యే ఇలాంటి వుత్పత్తులనె సిరిసిల్ల ప్రజలు అభినందించి అనుకరిస్తారని , సిరిసిల్ల సిరి నిల్లు గా మారగలదని ఆశాభావం వ్యక్తం చెస్తూ....
Labels: వృత్తి
Subscribe to:
Posts (Atom)