Monday, January 25, 2010
అతని తల మూడు దశాబ్దాల పాటు ఓ కోట బురుజుకు వేలాడింది,అతని మరణం ఎంతో మంది విప్లవకారులకు ఆదర్శంగా నిలిచింది, పాపం చరిత్ర తన దైర్యాన్ని చూసి ముచ్చటపడిందో ఏమో వెంటనే తనలో ఐక్యం చేసుకుంది.దేవుడతని ధైర్యాన్ని పరిహసించినాడో ఏమో వెంటనే ఈ లోకంలో లేకుండా సుదూర తీరాలకు చేర్చినాడు.
1857 సిపాయీల తిరుగుబాటు కంటే ముందే భారతదేశాన్ని దాస్య శృంఖలాలనుండి విడిపించడానికి ప్రయత్నం చేసి బ్రిటీష్ వారితో పోరాడిన వాడు ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి. బ్రిటిష్ పాలన మీద కత్తి దూసి స్వేచ్చకోసం పోరాడి ఉరికొయ్యకు బలై పోయి తరువాతి స్వాత్రంత్ర ఉద్యమానికి స్వాతంత్ర కాంక్షను రగిలించి మండే సూర్యుడయ్యాడు.
ఉద్యమాన్ని అణచి వేయాలంటే ముందా ఉద్యమ స్థావరాన్ని కనుగొని కూల్చి వేయండి,ఈ మాట వింటేనే తెలుస్తోంది ఉద్యమ స్థావరము యొక్క విశిష్టత.ఉద్యమం విజయవంతమైతే అదొక రాజాస్తానముగా చరిత్రని సృష్టిస్తుంది విఫలమైతే ఒక మూగ సాక్షిగా చరిత్రలో నిలిచి పోతుంది,అలాంటి ది ఇప్పుడు ఎక్కడ వుంది అన్నదే చరిత్రకారులకి అంతుచిక్కని విషయం .
ఇంతకి ఆ కోట అహోబిలం అడవుల్లోనే ఉందా !!!
ఇంకా అక్కడ ఏ రకమైన ఆధారాలున్నాయి !!!
అడుగుగునా నక్సల్స్ కోసం జల్లెడ పట్టే గ్రీ హౌండ్స్ దలాలకి ఆ కోట కనిపించిందా !!!
ఆ కోట ఇప్పుడు గిరిజనుల ఆధీనంలోనే ఉందా @@@
ఇంతకి నరసింహా రెడ్డి భావితరాల వారికి ఇచే సందేశం ఆ అడవిలోనే వుండి పోవలసిందేనా ?
1847 ఫిబ్రవరి 22వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు నరసిం హరెడ్డిని ఉరితీస్తారని విస్తారంగా ప్రచారం చేశారు.నరసిం హారెడ్డి మాత్రం ధైర్యంగా, ప్రశాంతంగా ఉన్నాడు. కడపనుండి కోయిలకుంట్ల చేరేవరకూ కూడా నిగ్రహం చూపాడు. దాదాపు 2 వేల మంది పై చిలుకు ప్రజలు- తమను నిశ్శబ్ద రక్కసి ఆవహించి తమనోళ్ళు కుట్టేసినట్లు కిమ్మనకుండా, వళ్ళంతా కళ్ళు చేసుకుని నిక్కి నిక్కి చూశారు. ఉరి తీసిన తర్వాత శిరస్సు మూడు తరాల దాకా 1877 వరకు అంటే 30 సంవత్సరాలు చుట్టు పక్కల ప్రజల్ని హెచ్చరిస్తూ ఆ బురుజుకు వేలాడుతూ ఉండిందట.ఆ బురుజు వుండే వూరే ఇప్పుడు అయన పేరు (నరసింహం ) నొస్సం( కర్నూలు జిల్లా ) గా పిలవ బడుతోంది ..
1857 కంటే ముందు 1846-47 ప్రాంతాల్లో 9000 మంది సైన్యంతో సాయుధపోరాటం నడిపిన ఉయ్యాలవాడ నారసింహారెడ్డి విప్లవానికి భారతీయ స్వాతంత్ర చరిత్రలో సముచిత స్థానాన్నిచారా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకం। మన చరిత్రను మనము రాసుకోకపోవడమే ఇందుకు కారణం. ఇట్లాంటి వీరులు ఇంకా ఎంతమంది చరిత్రలో మరుగున పడిపోయాయో?
నేడు మనముందు కుడా ఓ ఉద్యమము వుండి ఉస్మానియా ఉద్యమ స్థావరముగా ,కాని మనకు ఇప్పుడు కావలసినది జై తెలంగాణమా!!! జై తెలుగుగానమా!!! కాదు "జై ప్రజాస్వామ్యము" నాటి ఉద్యమాల ద్వారా ఏర్పడిన స్వతంత్రాన్ని నిలుపునే కాంక్ష రావాలి...
గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
than q for visiting
BY
viplavAradhana
viplavAradhana
Labels: ఎందరో మహానుభావులు
8 Comments:
Subscribe to:
Post Comments (Atom)
You blog is good. You have good taste. Your knowledge and interest in both the past and the present are worth praising.
Thanks for sharing.
Biddn
Explore Quotes
Adult Jokes
Quotes About Life
Inspirational Quotes
Friendship Quotes
Love Quotes
Funny Jokes
Birthday Wishes
Poems About Love
Happy New Year Quotes
Merry Christmas Quotes
Life Quotes
Inspirational Quotes
ఉయ్యాలవాడ నరసిం హ్మారెడ్డి బ్రిటీషు వారు తనకివ్వాల్సిన ఫించను ఇవ్వలేదని వారిపై తిరగబడ్డాడు. మరి అది స్వాతంత్ర పోరాటమా ... ఒకవేళ పింఛను సజావుగా ఇచ్చివుంటే ఆయన తిరగబడి వుండేవాడా...మరి ఆయన చేసింది స్వాతంత్ర పోరాటమా..
Friendship Quotes
Funny Quotes
Happy Valentines Day
Love Quotes
merry christmas quotes
ncert books pdf download