Pages

Subscribe:

Wednesday, August 6, 2008

సూత్రధారులు
తారాగణం:నాగేశ్వరరావు,మురళిమోహన్,భానుచందర్,సుజాత,రమ్యకృష్ణ

దర్శకత్వం:కె.విశ్వనాథ్

సoగీతం:కెవి.మహదేవన్

నిర్మాతలు:సుధాకర్,కరుణాకర

విడుదల:1989

ఆరాధన

ఆరాధన
తారాగణం:చిరంజీవి,రాజశేఖర్,సుహాసిని,రాధిక

గాత్రం:బాలు,జానకి

సాహిత్యం:వేటూరి

సంగీతం:ఇళయరాజా

దర్శకత్వం:భారతీరాజా

పల్లవి:అరె ఏమైందీ అరె ఏమైందీఅరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ

కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీ

అది నీలో మమతను నిద్దురలేపిందిఆ ఆ ఆ

అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

అది ఏమైందీ

చరణం1:నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ

నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది

పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు

నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు

కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో

కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో

అది దోచావో ఓ ఓ ఓ

లలలలలా లలల ల ల ల ల ల ల ల ల లలలలా

చరణం2:బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది

పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది

గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు

మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు

రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో

చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు

మనిషౌతాడు ఉ ఉ ఉ

అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ

కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీఅది నీలో మమతను నిద్దురలేపింది

అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ