Pages

Subscribe:

Saturday, November 22, 2008

సావిత్రి గతంలోకి ఒకసారి .....

సావిత్రి , తెలుగు సిని వుద్యానవనంలో వాడి పోనీ మల్లెపువామే,ఇప్పుడొస్తున్న ఎంతో మంది ఎకలవ్యుడు లాంటి నటిమనులకు ద్రోనాచార్యుల వంటి గురువామే ,తెలుగు సిని వనంలో ఎప్పుడు పరిమళాలు వెదజల్లు తుండే మల్లెపువ్వు భౌతికంగా మన మద్య లేక పోయినా అజరామరంగా మన మసుల్లో సుస్థిర స్తానాన్ని సంపందించుకుని వెళ్లి పోయింది ,
వెండితెర వేల్పు
------------------
ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలతో తెలుగు సినిమాలలో అరంగేట్రం చేసింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళబైరవి లో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానిఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ మిస్సమ్మ సినిమాలో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది.


దేవదాసు“ సావిత్రి ని చూస్తే నిజంగా పార్వతి ఇలానే ఉండి ఉంటుంది ఏమో అనిపించింది. ఎప్పటి మాయాబజార్, ఎప్పటి మిస్సమ్మ, ఎప్పటి దేవదాసు? అవి వచ్చి యాభై ఏళ్ళు డాతింది. ఇంకా మనం చూసి ఆనందిస్తున్నామంటే, ఈ తరం లో కూడా సావిత్రికి అభిమానులున్నారంటే అంతకంటే సాక్ష్యం ఏమి కావాలి సావిత్రి గొప్పదనానికి?

నటీమణులెందరున్నా మహానటి అంటే సావిత్రే!

ఆమె సంతకం చేసేటప్పుడు సావి౩ అని రాసేదట.

కాని ఓ అభిమాని autograph అడిగితె ఇలా savitri ganeshan అని చేసి
ఇచ్చిందట
-----------------------------------------------------------------------------------------
ఒకసారి సావిత్రి గారు ,భర్త జెమిని గణేశన్ గారు మరియు వారి కూతురు కొడుకు -చాముండేశ్వరి ,సతీష్ లు తమిళనాడు లోని రామేశ్వరం ,కన్యాకుమారి ఆలయాలకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా తుఫానులో చిక్కుకుని పోయారట ,అప్పుడు పత్రికలంతా సావిత్రి గారి కుటుంబం కూడా తుఫానులో కొట్టుకు పోయిందని సావిత్రి గారు ఇక లేరని రాశాయట,కాని అదృష్ట వశాత్తు వారు ఓకే ద్వీపం లో చిక్కి తరువాత మన సైన్యం హెలికాఫ్టర్ల చేత బయట పడ్డారట.
సావిత్రి గారికి వర్షమంటే చాల ఇష్టమట ఎప్పుడైనా షూటింగ్ స్పాట్ లో వర్షం పడితో వర్షంలో తడిచి గంతెయకుండా వుండలేక పోయేదట ,ఇంకా సావిత్రిగారికి మల్లెపూవులంటే చాలా చాలా ఇష్టమట ఎప్పుడు గంపెడు పూలతో తన తలను అలంకరించుకునేదట,ఒకసారి సావిత్రి కూతురు చాముండేశ్వరి గారు తన తలలో కూడా ఇలా సావిత్రిగారిలా పూలు అలంకరించుకుని వుండగా వారి భర్త నిన్ను ఈ వేషంలో చూస్తె మేకలు వేంబడిస్తాయి,అని సరదాగా అనేవారట ,మాములుగా సినిమాలలో ఏడుపు సన్నివేశాలు వచినపుడు నటినటులు గ్లిసరిన్ మీద ఆధారపడటం అందరికి తెలిసిందే ,కాని సావిత్రి గారు చాలా తక్కువ భాగంలో గ్లిసరిన్ మీద ఆధారపడి ,సన్నివేశానికి తగినంత కన్నీటి చుక్కలు రాల్చి చాలా మంది దర్శకుల మన్ననలు పొడి భావి కథానాయికలకు దార్శనికంగా వుండేదట.

దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలలు కురిపించి,అభినయంలో తనకు సాటి మరొకరు లేరని అశేష ప్రజల హృదయాలలో అభినేత్రిగా నిలిచిపోయారు మహానటి సావిత్రి.ఆ నటకోవిదురాలు దాన ధర్మాలు చేయడంలో ఎముకలేని చేయి చివరకు తన జీవితాన్నే విధికి దాసోహం చేసింది ...


గుజరాత్ భాదితుల కోసం లాల్ బహదూర్ శాస్త్రి చెవి పోగుల్ని దానం చేస్తున్న చిత్రం
-----------------------------------------------------------------------------

తెలుగు సినిమా దేవతలా భావించే సావిత్రి గారికి దైవభక్తి చాల ఎక్కువ ,ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తూనే వుండేదట ,వారంలోని ప్రతి వారము ఆయా దేవుల్లన్ని ప్రార్తించేది ,ఇందులో భాగంగానే అనేక ఆలయాలకు వెళ్ళేది .తిరుపతి వెన్న్కన్న స్వామి సన్నిదిలో కుడా పొల్లు దండాలు చేసిందట .

అప్పటి ప్రదాని ఇందిరా గాంధీ తో
--------------------------------------------------

నట చతుష్టయం (శారదా ,అంజలి దేవి ,గిరిజ ,సావిత్రి )
------------------------------------------------------------
చెల్లెలితో మహానటి

సంఘంలో ఎంత తల ఎత్తుకుని చూస్తున్న తలరాత ముందు తల దించాల్సిందే , అదే ఆమె విషయంలోను ......
1956 లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి చెడిపోయింది. ఆస్తిపాస్తులూ కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.

కొన్ని గంటల్లో చనిపోయే ముందు మహానటి
-----------------------------------------------------------

మన మన స్సుల్లో చెరగని frame
----------------------------------------------------------


ఆమె మరణం సంగతి గురించి తెలిసిన వారందరూ ఆమె పైన జాలి చూపకుండా వుండలేరేమో ,కాని ఇప్పుడు ఆమె సంతానం సినిమా సముద్రంలో ఒలలాడక పోయినా సముద్రాన్ని ఒక ప్రకృతి ప్రసాదంలా భావించి వారి జీవితాల్ని వారు గడుపుతున్నారు ,ఇప్పుడు ఆమె కుమారుడు సతీష్ అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు ,కూతురు విజయ చాముండేశ్వరి గారు కూడా మంచి స్తాయిలో వుంటూ ఆమె అందించిన ఈ విలువైన జీవితాన్ని ఆనందిస్తున్నారు .



"జీవించినంత కాలం నటించాలి తరువాత నటనా కీర్తితో జీవించాలి , అన్న భావంతో స్పూర్తి తో నటించిన ఆమె కీర్తి తో వెలుగుతోంది."


thank u for visiting ARADHANA