Pages

Subscribe:

Tuesday, June 30, 2009

అతన్ని అందరు రాజుగానో , మహా రాజుగానో ,రారాజుగానో కీర్తిస్తున్నారు.అందులో నేను మాత్రం తక్కువా అని అతన్ని చక్రవర్తిగా కీర్తించ దలచాను . కాని చక్రవర్తి కుడా మామూలు మనిషే ,అతను చక్రవతిగా ఎలా ఎదిగాడో కాని మనందరి మద్య ఇలా మామూలు మనిషిగా తనువుచాలించాడు ,అటువంటి సంగీత సామ్రాట్ గురించి ఇలా రాయగలగడం కుడా ఒకింత ఆశ్చర్యమే ,ఎందుకంటె ఆయనో సముద్రం ఆయనో ఆకాశం,అయన గురించి చెప్పడమంటే నా దోసిట్లో వున్న ఆకసాన్ని గురించి చూడటమే అవుతుంది అతనే పాప్ చక్రవర్తి మైఖేల్ జాక్సన్.

ఆ పేరు వింటేనే ఏదో తెలియని భావన,ఎక్కడో ఆ పేరు విన్నామనే స్ఫురణ ,ఆ పేరు వింటేనే తెలియని పులకింత,ఏదో తెలియకుండా మన శరీరంలో తెలియని కదలిక ,ఇల్లాంటి తెలియని భావాలను మనకు తలియకుండానే మనకు రుచి చూపించిన ఆయన ఇక మన మద్య చిరంజీవి గా నిలిచి పోయాడు .




అతని కళా జీవితం వీది బాలల అనుకరనలోను,అభినయంలోను మారరు తీసుకొచ్చింది ,అతని వ్యక్తిగతం ఖరీదైన మనిషి యొక్క కష్టాలకు పరాకాష్టగా నిలిచి కనువిప్పు చేయగలిగింది ,"పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు " అలాగే ఖరీదైన మనిషికే కష్టాలు అని మైఖేల్ జీవితాన్ని చూసిన ఎవరికైనా తెలుస్తూంది .

మాములుగా మనకు ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అని అసహజంగా నే ఎలా అంతమో ఎవరైనా బ్రేక్ డాన్స్ వేసినపుడు అచేతనంగానే అతన్ని మైఖేల్ తో పోలుస్తాము , ఆటను మన జీవితమో అంతలా మమేఖమైపోయాడు,భౌతికముగా అతను లేకపోయినా చిరంజీవిగా మన మసుల్లో ఎప్పటికి వుంటాడు ..


ఈ లోకము కొందరి కోసము పరలోకము కొందరి కోసము ,కాని ఈ లోకంలో ఆర్జించిన ఖ్యాతితో పరలోకానికి దారి కాచి పరలోకంలో ప్రాచుర్యాన్ని పొందిన వారిని మహానుభావులు అంటారు,అలాంటి వారు మనతో లేకపోయినా పరలోకంలో మన కోసం పరితపిస్తుంటారు ... గట్టిగా కొలిస్తే గుప్పెడు కుడా వుండని గుండెలో జ్ఞాపకాలకు కొండంత స్థలం వుంటుందంటారు ,అలాంటి కొండంత స్థలంలో నీ జ్ఞాపకాల పూదోట ఎప్పుడు పచ్చగా వుంటుంది ,అంతలా నువ్వు మాతో అంత అనుబందాన్ని ఏర్పరచుకున్నావు జాక్సన్ ...

మమ్మల్నందర్నీ విస్మయ పరుస్తూ తిరిగిరాని లోకాలలో విహరిస్తున్నావు,మళ్ళి మమ్మల్ని వినోద పరచడానికి తిరిగి రావా మైఖేల్ ...

అందరు చనిపోయిన తరువాత మన పూర్వికులను కలుకుంటారు అని అంటారు ,కాని మన మైఖేల్ ని కలుసు కోవాలని ఎంతమంది అనుకుంటారో ......

అందులో మీరు వున్నారా...?????????
Thank u for visiting
by
praveenAradhana