Pages

Subscribe:

Tuesday, December 30, 2008

ఉదాహరణకి 97 * 99 ల లబ్దాన్ని కనుగొనాలంటే ...

మొదటగా వందకి 97 మూడు అంకెల తేడాలో వుంది.,అలాగే 99 ఓకే అంకె తేడాలో వుంది .

ఇప్పుడు మూడు ఒకటి లను గుణించగా లబ్దాన్ని (౦౩) మొత్తము లబ్దములో కుడివైపున వేసుకోవాలి

ఇప్పుడు 97 నుంచి 1 ని తీసి వేసినా (96) ,99 నుంచి 3 తీసి వేసినా 96 వస్తుంది ,ఇప్పుడు 96 ని మొత్తం లబ్దములో ఎడమ వైపున చేర్చండి ,అప్పుడు మొత్తం లబ్దము 9603 వస్తుంది ఇదే చివరిగా వచ్చే లబ్దము .





మరింత క్లుప్తంగా ఈ వీడియో చూడగలరు






THANK U FOR VISITING ARADHANA



తెలుగు సిని వుద్యానవనంలో వాడిపోనీ మల్లెపువామే



ekkadiki nee paruguఎక్కడికి నీ పరుగు : W\O వరప్రసాద్

Saturday, December 27, 2008


అది వారము తో మొదలయ్యే ప్రతి నెల లోని 13 వ తేది శుక్రవారము అవుతుంది


మగ వారి కంటే ఆడవారి రెట్టింపుగా వణుకుతారు


వెలి గుర్తుల మాదిరి గానే ప్రతి మనిషి యొక్క నాలుక పైనున్న చారల గుర్తులు కూడా వేరు వేరుగా వుంటాయి


ప్రతి ఖండములో రోమ్ అన్న పేరుతొ సిటీ కలదు



ఇంగ్లీషులో SET అన్న పదానికన్నా మరే ఇతర పదానికి ఎక్కువ అర్థాలు లేవు



విషపు మొలక తిన్న ఆవు పాల వలన అబ్రహాం లింకన్ అమ్మ చనిపోయింది



బకింగ్ హాం పాలస్ లో 600 కి పైగా గదులున్నాయి




ఆఫ్రికా ఖండములో 1000 కి పైగా భాషలు కలవు








పక్షులలో గుడ్లగూబ మాత్రమె నీలము రంగుని గుర్తించగలదు


-----------------------------------------



Wednesday, December 24, 2008

ఒక నెల క్రితం వరకు ఈటీవీ లో 9:30 గంటలకు ప్రసారమవుతున్న ఒక్కరే ప్రోగ్రాం గురించి దాదాపు అందరికి తెలిసిందే ,అందులో పాల్గొన్న గాయకుల లో పార్థ సారథి ఒకడు ,ఈటీవీ వారు ఆ ప్రోగ్రాం ని ప్రతిస్టాత్మకంగా నిర్మించారని నేననుకుంటున్నాను ఎందుకంటే అంతకు క్రితం ఈటీవీ లోనే నిర్వహించిన "సై" సింగర్స్ చాలంజ్ నుండి కొందరు గాయకులని సినే ప్రపంచానికి పరిచయం చేసింది ,ఇక తదుపరి నిర్వహించే కార్యక్రమం గురించి వేరే చెప్పాలా ....
ఈ ప్రోగ్రాములో మొత్తం 16 గాయని గాయకులు పోటిలో పాల్గొన్నారు అందులో నుంచి నలుగుర్ని ఫైనల్ కి ఎంపిక చేశారు న్యాయ నిర్ణేతలు వేటూరి గారు ,కమలాకర్ గారు ,సుమంగళి గారు ,ఆ నలుగురిలో నన్ను ఎంతగానో ఆకట్టుకున్న సింగర్ పార్థ సారథి అతని పాటల ఎంపిక విధానం కూడా చాల బాగుండేది అతడు పాడిన పాటల్లో కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు,ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను చుట్టి ఇలా తను పాడిన పాటల్లో ఇది కథ కాదు చిత్రం నుండి ఇటు అటు కాని సాంగ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ఆ పాట మీకోసం ....



చిత్రం: ఇది కథ కాదు
గానం: SP బాలు, రమోల,
రచన: ఆత్రేయ
సంగీతం: విశ్వనాధన్

ఇటు అటు కాని హౄదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు ఇటు అటు కాని
అటు ఇటు తానొక ఆటబొమ్మని
తెలిసే ఎందుకు వలచేవు అటు ఇటు తానొక
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
గడ్డిపోచా? నేనా? హి హి హి హి
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు
హౄదయం ఎందుకు ఉండకూడదు
ఉందని ఎందుకు ఒప్పుకోరాదు
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు
ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
నీ మొహమురా హి హి హి హి హి
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
తీగకు పందిరి కావలెగానీ
తెలుసా నువ్వే పందిరని
తీగకు పందిరి కావలెగానీ
తెలుసా నువ్వే పందిరని
నీటిని చూసి దాహము వేస్తే
తేనె కోసం తేటి వస్తే
పాపం గీపం అనడం ఛాదస్తం

No it’s bad
But I am mad
మోడు కూడా చిగురించాలని
మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
హ హ హ హ
What పక పక పిక పిక
చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
Boss…Love has no reason…not even reason Shut up..
చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఉదయంకోసం పడమర తిరిగిఎదురుతెన్నులు కాచేవు
ఎండా వాన కలిసొస్తాయి
వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి
It is highly idiotic…No boss…It is fully romantic
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున ఉన్నది చెప్పీ నవ్వమ్మా
మనసున ఉన్నది చెప్పీ నవ్వమ్మా
ఇటు అటు కాని హౄదయంతోటిఎందుకురా
ఈ తొందర నీకు ఇటు అటు కాని


singer parthasarathi


చాలా రోజుల పాటు తమ స్వరంతో తెలుగు టీవీ ప్రేక్షకులకు గానామృతాన్ని పంచిన గాయని గాయకులూ ఇప్పుడు సిని వినిలాకశంలో విహరిస్తున్నారు ....

ఈ టపా ద్వారా మరచిన వారి జ్ఞాపకాలని ఒక్కసారి గుర్తుకు తెచుకుందామని .....

మీ
ఆరాధన



THANK YOU FOR VISITIN ARADHANA

తెలుగు సిని వుద్యానవనంలో వాడిపోనీ మల్లెపువామే

ekkadiki nee paruguఎక్కడికి నీ పరుగు : W\O వరప్రసాద్

Tuesday, December 23, 2008

కోకో కోల మొదట ఆకుపచ్చని రంగులో వుండేదట


అన్ని ఖండాల యొక్క పేర్లు మొదలుపెట్టిన అక్షరము తోనే ముగుస్తాయి EX - Asia,Europe


ప్రపంచములో సాధారణముగా ఎక్కువమందికి వుండే పేరు మహమూద్



ఎలుకలు వాంతి చేసుకోలేవు



అస్త్రిచ్ పక్షి యొక్క కన్ను దాని మెదడు పరిమాణము కంటే పెద్దది





మొసలి పళ్ళలో జీవితకాల పెరుగుదల వుంటుంది






assasination మరియు bump పదాలను కనిపెట్టింది shakesphere



మనకు మనము శ్వాస మానివేసి ఆత్మహత్య చేసుకోలేము


మనిషి కండరాలలో ముక్కు అత్యంత గట్టి కండరము



పేక ముక్కల్లోని king ముక్కలపైన ఒక్కో రాజు ప్రతిమని ముద్రించారు



"Spades" - King David;

"Clubs" - Alexander the Great;

" Hearts" - Charlemagne;

"Diamonds" - Julius Caesar

నా ఈ టపాతో 5000 హిట్లు కావచునని భావిస్తున్నాను నా హిట్ 5000 వ చేసిన వారికి చేయించడానికి తోడ్పాటునిచ్చిన బ్లాగర్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు

THANK YOU FOR VISITING ARADHANA

Friday, December 19, 2008

కొంటె ప్రశ్నలు మాములుగా ప్రశ్న అనగానే దానికేదో జవాబు వుండే వుంటుంది కాని ఇలాంటి కొంటె ప్రశ్నలను విన్నపుడు జవాబు తెలిసినా ఎలా చెప్పాలో తెలియక నవ్వొస్తుంది అలాంటివే ఇక్కడ కొన్ని ...

చీకటి యొక్క వేగమెంత ?

నీటి లోపల ఏడువ గలరా ?

కాపి రైట్ సింబల్ ని ఎవరు కాపి చేయగలరు ?

ok అనగా అర్థమేమిటి ?

చేపకు దాహం ఎప్పుడు వేస్తుంది ?

నారింజ పండుకి రంగు ముందోస్తుందా లేక పండు ముందోస్తుందా ?

నీటి లోపల బెలూన్ ని ఉదగాలరా ?

బిల్డింగ్ ని బిల్ట్ అయినాకుడా బిల్డింగ్ అనే ఎందుకు పిలుస్తారు ?


భూమి సొంతమైన వారి భూమి పొరలపై ఎటువంటి హక్కుంటుంది ?


ద్వని వేగంతో సమానంగా ప్రయానిస్తున్నపుడుమనకు రేడియో సౌండ్ వినిపిస్తుందా ?


గుండ్రటి రూములో మూలాన కూర్చోగాలరా ?



thank you for visiting ARADHANA











Wednesday, December 17, 2008

ఇది అందరు ఎదుర్కొన్న సంగతే ,కొన్ని సమయాల్లో మన ఏదైనా సైట్ ని ఓపెన్ చేసినపుడు మనకు 404.Page not found అనో లేకపోతే వేరే ఏదైనా ఇతర ఎర్రర్స్ వస్తుంటాయి ,ఇంతకీ ఈ 404 అనేది ఏమిటంటే అదొక ఎర్రర్ కోడ్ ఇలాంటివి ఇంకా అనేక రకాల ఎర్రొర్ కోడ్స్ వున్నాయి వాటిల్లో కొన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ...

Bad request 400
The request could not be understood by the server due to bad syntax. You should not repeat the request without modifications.

Unauthorized 401
The creators of a Web page may want only certain people have access to that page. You should only retry the request if you know that you have authorization.

PaymentRequired 402
This message gives a specification of charging schemes which are acceptable. You may retry the request with a suitable ChargeTo header.

Forbidden 403
The request is for something forbidden. Authorization will not help. This status code is commonly used when the server does not wish to reveal exactly why the request has been refused, or when no other response is applicable. (The file needs to be set with "read permissions" for all users.)

Not found 404
The server has not found anything matching what you requested. Make sure that the Web address (URL) that you typed in exactly matches the address you were given. Check that the capitalization matches, spelling, and punctuation, like dots (.) and slashes (/), are correctly placed. Be sure you are using the forward slash (/) and not the backward slash (\).

405 Method Not Allowed
The method specified in the Request-Line is not allowed for the resource identified by the request. The response must include an Allow header containing a list of valid methods for the requested resource.

406 Not Acceptable
The resource identified by the request is only capable of generating response entities which have content characteristics not acceptable according to the accept headers sent in the request.

407 Proxy Authentication
RequiredThis code is similar to 401 (Unauthorized), but indicates that you must first authenticate yourself with the proxy. The proxy must return a Proxy-Authenticate header field (section 14.33) containing a challenge applicable to the proxy for the requested resource. You may repeat the request with a suitable Proxy-Authorization header field (section 14.34). HTTP access authentication is explained in section 11.

408 Request Timeout
The client did not produce a request within the time that the server was prepared to wait. You may repeat the request without modifications at any later time.

409 Conflict
The request could not be completed due to a conflict with the current state of the resource. This code is only allowed in situations where it is expected that the user might be able to resolve the conflict and resubmit the request.

410 Gone
The 410 response is primarily intended to assist the task of web maintenance by notifying the recipient that the resource is intentionally unavailable and that the server owners want remote links to that resource be removed.

411 Length
The server refuses to accept the request without a defined Content- Length. The client may repeat the request if it adds a valid Content-Length header field containing the length of the message-body in the request message.

412 Precondition Failed
The precondition given in one or more of the request-header fields evaluated to false when it was tested on the server. This response code allows the client to place preconditions on the current resource metainformation (header field data) and thus prevent the requested method from being applied to a resource other than the one intended.

413 Request Entity Too Large
The server is refusing to process a request because the request entity is larger than the server is willing or able to process. The server may close the connection to prevent the client from continuing the request.

414 Request-URI Too Long
The server is refusing to service the request because the Request-URI is longer than the server is willing to interpret.

415 Unsupported Media Type
The server is refusing to service the request because the entity of the request is in a format not supported by the requested resource for the requested method.

Internal Error 500
The server encountered an unexpected condition which prevented it from fulfilling the request. Your request could not be processed due to an internal server error.

Not implemented 501
The server does not support the functionality required to fulfill the request. This is the appropriate response when the server does not recognize the request method and is not capable of supporting it for any resource.

502 Bad Gateway
The server, while acting as a gateway or proxy, received an invalid response from the upstream server it accessed in attempting to fulfill the request.

503 Service Unavailable
The server is currently unable to handle the request due to a temporary overloading or maintenance of the server. The implication is that this is a temporary condition which will be alleviated after some delay. If known, the length of the delay may be indicated in a Retry-After header. If no Retry-After is given, you should handle the response as it would for a 500 response.

504 Gateway Timeout
The server, while acting as a gateway or proxy, did not receive a timely response from the upstream server it accessed in attempting to complete the request.

505 HTTP Version Not Supported
The server does not support, or refuses to support, the HTTP protocol version that was used in the request message. The response should contain an entity describing why that version is not supported and what other protocols are supported by that server.

thank you for visiting ARADHANA

Monday, December 15, 2008

తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల

ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో హ హ

ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో

తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల

చరణం1

వికటకవి నేను వినండి ఒక కధ చెపుతాను

కాకులు దూరని కారడవి

అందులో కాలం ఎరుగని మానోకటి

ఆ అందాల మానులో ఆ అద్బుత వనంలో

చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు

ఒక గోరింక ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ

బావ రావ నన్నేలుకోవా

తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో హ హ
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల

చరణం2:

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మ

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మ

వలపు విమాన తలపుల వేగాన వచ్చాయి కానుకలమ్మ

ఊరేగు దారులు వయ్యారి భామలు వీణలు మీటిరమ్మ

సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మ

తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో హ హ
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల

చరణం3:

గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవించు వచ్చెనమ్మా

కాన్వెంటు పిల్లలు పోలిన నెమళులు గ్రీటింగ్స్ చెప్పిరమ్మ

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మ

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మ

పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్ధిల్లమనెనమ్మ

తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో హ హ
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల

చరణం4:

చేయి చేయిగ చిలుక గోరింక శయ్యకు తరలిరమ్మ

చెల్లిలికోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలెగెనమ్మ

తప్పుగ తలచిన అప్పటి గోరింక ఇప్పుడు తెలిసెనమ్మ

అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మ

thank you for visiting aradhana

Saturday, December 13, 2008

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి యువకులు నేడు ఎన్ కౌంటర్ లాగా మోకరిల్లాడు ,ఈ రోజు యాసిడ్ ఎన్ కౌంటర్ కి పట్టుబడి పోయింది ఇక ముందు అదలా(యాసిడ్) తన ప్రతిభను ఎవరి ముందు ప్రదర్శించదని మనము ఆశిద్దాం .ఈ రోజు తెల్లవారు జామున స్వాప్నిక ,ప్రనిత ల పైన యాసిడ్ దాడి చేసిన నర రూప రాక్షసుల ప్రాణాలు పోలిసుల చేతుల్లో గాల్లో కలిసిపోయాయి , పాపం పోలీసులకి కూడా కోర్టులపైన నమ్మకం పోయినట్లుంది ,ఎన్ కౌంటర్ సరైన మార్గం అనుకున్నారో ఏమో అంత పని చేసి రాష్ట్రానికీ మూగ సక్షల్ని అందచేశారు ,దీన్ని అన్ని రకాల ప్రజా కోర్టులు ముక్త కంఠంతో ఆమోదిస్తాయో లేక ఆవేదిస్తాయో వేచి చూడాలి ...
నీ మొహాన్ని ఓ చంద్రబింబం లా వుహించుకుంటూ నీకురిపించే వెన్నెలలో నా అన్వేషణ సాగిస్తాను అనుకుంటూ బయల్దేరే యువతరానికి ఆ చంద్రబింబాన్నే మార్చివేసే హక్కులేదు ,మొన్న శ్రీలక్ష్మి నిన్న అయేషా నేడు స్వప్నిక, ప్రనిత రేపు అనే పదాని ఈ ప్రాస నుంచి తీసి వేయలనుకున్నరేమో పోలిసులు సహకరించిన వారిని కూడా సంహరించారు , తను ప్రేమించిన వ్యక్తీ తనను ప్రేమించాక పోయినా తట్టుకునే శక్తి వున్న ప్రేమికులు పుట్టేతంత వరకు ఇలాంటి దాడులు ఆగక పోవచునేమే ..
తప్పు జరిగినప్పుడు అందులో ప్రత్యక్ష్యమ్గానో పరోక్ష్యం గానో ఇద్దరి పాత్ర వుంటుంది కాని ఇక్కడ ఇద్దరు శిక్షింప బడ్డారు అదెంతవరకు న్యాయమ , ఒకరికి సానుభూతి రక్షిస్తే మరొకరిని కోపం దహించి వేసింది ,కాని ఒకరుజీవితకాలం శిక్షను అనుభవిస్తూ వుండాలి మరొకరు జివితనుభావముగా అనుభవించారు, ఇలాంటి శిక్షల్ని చూసి భవిష్యత్తులో తప్పులు జరుగకుండా వుండాలని కోరుకుంటూ ...
thank you for visiting ARADHANA

Wednesday, December 10, 2008

గండికోట - రెండు కొండలనూ వరుసుకుంటూ వెళ్తున్న పెన్నా నది ఇవతలి ఒడ్డుపైనుంచీ చూస్తే ఆవలి తీరం దగ్గరగా వున్నట్లే వుంటుంది గానీ ఎంత శక్తిమంతుడైనా ఆవలి ఒడ్డుకు రాయి విసరలేడని ప్రతీతి. కొండలో పెన్న చేసిన

ఆ గండి వల్లనే దానికి “గండి కోట” అని పేరొచ్చిందట,క్లుప్తంగా గండికోట గురించి ఇక విషయానికొస్తే ...

గండికోట మన రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం . ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణికి గండికోట కొండలని పేరు . ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచమేర్పడింది.


తెలుగు వారి శౌర్య ప్రతాపాలకు, దేశాభిమానానికి, హిందూధర్మ సంరక్షణాతత్పరతకు ప్రతీక గండికోట. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలచి, విజయనగర రాజులకు విశ్వాసపాత్రులై, పలు యుద్ధములలో తురుష్కులను ఓడించి, ప్రసిద్ధి గాంచిన పెమ్మసాని నాయకులకు నెలవు గండికోట.ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ రేచర్ల నాయకుల కోట ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశము.

వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది.

కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిధిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి.
జామా మసీదు

మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.

ఇక్కడ ఉన్న ఓ కోనేటిలో నీరు ఎర్రగా వుంటాయి ఎందుకంటే ,పూర్వం యుద్ధం ముగిసిన తరువాత ఆ కత్తులన్ని ఇక్కడి కోనేతిలోనే కడిగే వారట ,అందుకే అందులో వున్న నీళ్ళకి ఆ ఎరుపురంగుంటుంది అని అంటారు ,గమ్మత్తైన విషయమేమిటంటే ఇప్పుడు రాజులు లేరు రాజ్యాలు లేవు కాని ఆ కోనేటి నీరు అలానే ఎర్రగానే వున్నాయి .
గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.
చరిత్ర
గండికోట భారత దీపకల్పములోని ఒక ప్రముఖమైన గిరిదుర్గము, దీని చరిత్ర 13వ శతాబ్దము యొక్క రెండవ అర్థభాగములో మొదలవుతుంది. గండికోట కైఫియత్ లో పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వర I చే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు శా.1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (1123 జనవరి 9) నాడు ఈ కోటను కట్టించెను అని పేర్కొనబడింది. ఐతే ఇదినిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేవు. త్రిపురాంతకము వద్ద గల శా.1212 (1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోట కు మార్చాడని భావిస్తున్నారు. ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించడానికి నియమించాడని తెలుస్తోంది.

గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాంతము)లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మసాని నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజుల సామంతులుగా పాలించారు.[1] విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనపుడు, పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు.
మీర్ జుంలా గండికోటలోని మాధవస్వామి ఆలయము ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మించాడు. దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించాడు.కోటను ఫిరంగుల తయారీకి స్థావరము చేస్తాడు.గండికోటపై సాధించిన విజయముతో మీర్ జుంలా మచిలీపట్నం నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి అయ్యాడు.ఈ సమయములోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల వర్తకుడు టావర్నియెర్ గండికోట సందర్శించాడు.
ఎలా చేరుకోవాలంటే ...
గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్నది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. జమ్మలమడుగు నుంచి బస్సు సౌకర్యం కలదు .
రంగనాథాలయం: ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1577) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు.

మాధవరాయ ఆలయం ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ.పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది. ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో(దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో) నిర్మించినట్లు చెప్పవచ్చు

మూడు శతాబ్దములు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయములు సాధించి, హిందూధర్మ రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు.
సిని ప్రస్థానంలో గండికోట
ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు, సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది అయిన గూడవల్లి రామబ్రహ్మం 1934 లో ఆంధ్ర నాటక పరిషత్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆయన కమ్మ కుల చరిత్ర అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళాడు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి 'గండికోట పతనం' అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.

గండికోట గురించిన పూర్తి చరిత్రతో మరో టపా లో కలుసుకుందాం అంతవరకు సెలవు

THANK యు FOR VISITING ARADHANA


Tuesday, December 9, 2008

మాములుగా ఒక id తో మాత్రమె యాహూ messengerlo login అవ్వటానికి అవకాసం వుంది కాని registry లో కొద్దిపాటి మార్పులు చేయడం వాళ్ళ ఒకే యాహూ messenger లో రెండు రకాల ID లతో login అవ్వచ్చు అదెలాగంటే ...



1. Go to start> run


2.Type "regedit" ( this is the Microsoft Registry Editor)


3.select the HKEY_CURRENT_USER directory in the left panel and open it by clicking on "+"


4.then select "software" directory and open it


5.then select "yahoo"


6.then "pager"directory
7.then open "test" .



ఇంత వరకు మీరు follow అయిన order ఈ విధంగా వుండాలి
"HKEY_CURRENT_USER>Software>yahoo>pager>test"ఇంత వరకు మీరు follow అయిన order ఈ విధంగా వుండాలి ఇక తరువాత right side వున్న ఖాళి ప్రదేశంలో ఎక్కడైనా right click చేసి DWORD valuename it as "plural" మరియు దాని value 1 gaanu base "decimal" గాను చేయగలరు.

Thats it, your Yahoo - multi messenger is now ready!



thanks for visiting ARADHANA

Thursday, December 4, 2008

ఘంటసాల - ఆ పేరు వింటేనే తెలుగు వాడి గుండెల ఘంటలు గుడి ఘంటలు మొగినత శ్రావ్యమ్గా మోగుతాయి ,ఘంటసాల - ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండరని ఘంటా పతంగా చెప్పవచ్చు , తెలుగు వారి హృదయాలలో గాయకుడుగా, సంగీత దర్శకుడుగా చెరగని ముద్ర వేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1922లో డిసెంబర్‌ 4 గుడివాడ సమీపం లోని చౌటుపల్లి గ్రామం లో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు . భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మకేమో కానీ, ఘంటసాల గాత్రం మాత్రం తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోతుంది. ప్రజలకు ఆరాధ్యుడుగా, ఓ సంస్కృతికి చిహ్నంగా మాత్రం ఏ గాయకులూ లేరు. ప్రతి తెలుగు కుటుంబంతో పెనవేసుకొన్న గాత్రం ఘంటసాలది.
ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. ఆరేళ్ళపాటు గురువు పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ సాగింది. శాస్త్రిగారు సంగీతరావుగారి తండ్రి. తన తండ్రిని గురించిన విశేషాలు సంగీతరావు గారి వ్యాసాల్లో కనబడతాయి. అవి చదివితే గాయకుడుగా, సంగీత దర్శకుడుగా ఘంటసాలకు మార్గం చూపినది శాస్త్రిగారే ననిపిస్తుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు. శాస్త్రిగారి నుంచి ఘంటసాలకు శృతిశుద్ధి, నాదశుద్ధి, గమకశుద్ధి, తాళగత, స్వరగత లయశుద్ధి అలవడ్డాయి. పాటల్లో సాహిత్యం ముఖ్యమనే అవగాహన కలిగింది.
ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. విజయనగరం చేరిన ఘంటసాల వారాలు చేసుకుంటూ సంగీత కళాశాలలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్న సమయం లో పట్రాయని సీతారామశాస్త్రి గారు ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితముగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. వారాలు చేసుకుంటూ, మధుకరం(భిక్షాటన) చేసుకుంటూ సంగీత సాధన చేసి ద్వారం వెంకట స్వామి నాయుడి గారి చేతుల మీదుగా సంగీత పట్టా పుచుకున్నారు. సంగీత కళాశాల పట్టం పొంది విజయనగరం విడిచిపెట్టే తరుణంలో ఘంటసాల గారి కచేరి ఏర్పాటు కావడం, ఆదిభట్ల నారాయణ దాసుగారు తంబూరా బహూకరించడం ఘంటసాల జీవితం లో ఒక పర్వదినం. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు.


1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తానే తన పెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాలవారు ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి, కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాలవారు ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.ముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండు రూపాయలు చెల్లించి అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశలకోసం వెతికి రాత్రి ఆ పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల వారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు.
1951లో పాతాళభైరవి ,1953లో వచ్చిన దేవదాసు 1955లో విడుదలయిన అనార్కలి ,1955లో విడుదలయిన అనార్కలి ,1957లో విడుదలయిన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి.1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేష శైలవాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకుని అర్ధ శతాబ్దం పాటు తన పాటలతో ఆంధ్రుల మనసులని పరవసింపచేసారు .
ముద్దబంతి పూవులో...
నీవేనా నను పిలచినది...
శివశంకరి... శివానందలహరి...
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై...
దేవదేవ ధవళాచల...
ఘనాఘన సుందరా...
కుడిఎడమైతే...
జేబులో బొమ్మ...
తెలుగువీర లేవరా...
రాజశేఖరా నీపై...
కనుపాప కరువైన...
పాడాలని పాడేసిన పాటలు కావివి. ఒక్కో పాట ఆణిముత్యమనటంలో నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. సినిమా చూసినా చూడకపోయినా, ఆయన పాటలు వింటే చాలు, సినిమా చూసినట్లే అంటే అతిశయోక్తి కాదు. కవి వ్రాసిన కవిత్వాన్ని గొంతుతో చిత్రంగా ఆవిష్కరించగలిగిన నేర్పరి. అందుకే ఆయన, ఆయన గాత్రం అజరామరం.
ఘంటసాలగారి ఆరోగ్యం ఎప్పుడూ అంతంతమాత్రమే. పెద్ద రికార్డింగ్ ఏదైనా జరిగితే ఆ మర్నాడు ఆయన విశ్రాంతి తీసుకోక తప్పేదికాదని సావిత్రిగారు ఏదో సందర్భంలో చెప్పారు. ఎటొచ్చీ ఆయన ఇంకొన్నేళ్ళు జీవించినా తమిళంలో టి.ఎం. సౌందరరాజన్ లాగే రిటైర్ కావలసి వచ్చేదేమో. వయసుతో మారిపోయే గాత్రపటిమ కన్నా ఘంటసాలకు మొదటినుంచీ ఉండిన సంగీత సంస్కారమే గొప్పదని నేననుకుంటూ ఉంటాను.త్రిపురనేని మహారథి ఒక సంగతి చెప్పారు. రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన ఒక రికార్డింగుకు ఘంటసాల వెళ్ళి తయారుగా కూర్చున్నప్పటికీ రాజేశ్వరరావుగారు ఎంతకీ తన గదినుంచి బైటకు రాలేదట. ఘంటసాలగారు విసుక్కుంటూ ‘నేనింతమందికి పాడానుగాని రాజేశ్వర్రావుగారిలా ఇలా హింసపెట్టేవాళ్ళని ఎక్కడా చూళ్ళేదు’ అన్నాడట. దానికి మహారథి ‘దానికేముందండీ, పాడనని చెప్పి వెళ్ళిపోవచ్చుగా?’ అన్నాడట. వెంటనే ఘంటసాల ‘అమ్మమ్మమ్మ, ఎంతమాట? రాజేశ్వర్రావు రికార్డింగు మానుకోవడమా? అలా ఎన్నటికీ చెయ్యను’ అన్నారట. అది ఆయన వినయానికీ, సంస్కారానికీ కూడా మంచి ఉదాహరణ.

చలచిత్ర నేపథ్య సంగీత స్వరహేల
గంధర్వ మణిమాల ఘంటసాల
సంగీత సాహిత్య సరసార్ధ భావాల
గాత్ర మాధుర్యాల ఘంటసాల
పద్యాల గేయాల వచనాల శ్లోకాల
గమకాల గళలీల ఘంటసాల
బహువిధ భాషల పదివేల పాటల
గాన వార్నిధిలోల ఘంటసాల
కమ్ర కమనీయ రాగాల ఘంటసాల
గళవిపంచికా శృతిలోల ఘంటసాల
గాంగనిర్ఘర స్వరలీల ఘంటసాల
గాయకుల పాఠశాల మా ఘంటసాల।
1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండేనొప్పి రావటం తో కొంత కాలం విశ్రాంతి తీసుకుంటున్న సమయం లో భగవద్గీత చేయాలన్న ఆలోచన రావటం వెంటనే దాన్ని అమలుపరచడం జరిగాయి. ఈనాటికీ ఘంటసాల వారి భగవద్గీత ఒక ఆణిముత్యం. 1974 ఫిబ్రవరి 11న ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అర్ధశతాబ్దం పాటు మనలని తన గాన మాధుర్యం తో అలరించిన ఆ గొంతు మూగబోయింది. ఘంటసాల గారు మన అందరి హృదయాలలోనూ ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వారు అమరులు….వారు అమరులు….వారు అమరులు.
స్వరాల రారాజు

ఇందుమూలముగా మన బ్లాగ్గేర్లకు వో విషయం తెలియచేయాలి,ఈ టపా నా ఒక్క కృషితో రాసింది ఎంతమాత్రము కాదు ,ఇందులోని చాల అంశాలు ఇతర బ్లాగులు ,సైట్లు ,మరియు wikipidea నుంచి సేకరించడం జరిగినది ,అందుకు దయచేసి నన్ను క్షమించగలరు ,ఈ రోజు ఘంటసాల గారి జన్మదినం కాని జల్లెడ లో,కాని కూడలిలో గాని ఈయన గురించిన టపా లేదు ఇంతవరకు వేచి వుండిఇప్పుడు ఈ సాహసానికి ఓడిగాట్టాను ,క్షమించగలరు ....
THANKS TO VISIT ARADHANA

Monday, December 1, 2008

ముంబై దారుణానికి మూగ సాక్ష్యాలు :
నేడు మన సైన్యం గెలిచింది కాని పోరాట వేదిక మౌనం వహిస్తూ చరిత్రలో నిలిచిపోతూ తను అనుభవించిన ఆర్తనాద సంగీతాన్నీ , కోల్పోయిన అందాన్ని చూసుకుని ఓ సగటు భారతీయుడి ముందు మూగ సాక్ష్యంగా నిలిచి పోయి దేశం కోసం పోరాడుతూంది ....

కాల్పులు జరపడానికి సిద్ధంగా వున్న ఓ వుగ్రవాద వుద్యోగి
----------------------------------------------------------------


భయపడి దాక్కుంటున్న స్థానికులు
------------------------------------------------------

దూరాన్ని దగ్గర గా చూపించే మీడీయా లో ...
-------------------------------------------

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
---------------------------------------------
నన్ను చుట్టి చీకటున్నా నేను కాలిపోతున్నా --తాజ్
----------------------------------------------
ఎదురుచూపులతో ఓ భాదితుడు
----------------------------------------

మంటల్లో తాజ్ పైభాగం
------------------------------

..."ఇకపై ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుంటూ...బాధాతప్త హ్రుదయంతో ముంబై భాదితులకు నా సంతాపం"......


thank u for visiting aradhana