Pages

Subscribe:

Sunday, May 3, 2009

"దిగి రాను దిగి రాను అంటూ విను వీధులలో విహరిస్తున్న మన తెలుగు కవితను ఈ భూలోకానికి దించి భూకంపాన్ని సృష్టించిన అపర కవీరధుడు ఆయన ",


ఇంతకాలం నన్ను తెలుగు సాహిత్యం నడిపించింది ఇప్పుడు తెలుగు సాహిత్యాన్నీ నేను నడిపిస్తాను అంటూ తన నాయకత్వం గురించి వినమ్రంగా వివరించిన మహా మనిషి శ్రీ శ్రీ .

సంప్రదాయ తెలుగు ప్రకారం ఒక వ్యక్తిని గౌరవ సూచకముగా ,గొప్పగా సంభోదిన్చుటకు మొదట వాడే శబ్దం "శ్రీ ",అలాంటి శ్రీ నే తన పేరులో రెండుసార్లు ఇముడ్చుకుని భావ కవులచే గర్వంగా ,సగౌరవంగా కిర్తించబడుతూ వారికి మార్గదర్శిగా మారిన కవిత నిఘంటువు శ్రీ శ్రీ .

"శ్రీ శ్రీ అంటే ఆకాశం ,శ్రీ శ్రీ అంటే సముద్రం" అనుకుంటూ వున్నా వారికి నేను కేవలం "అనంతం" నీ మాత్రమె అంటూ వినమ్రంగా తన అంతరంగికాన్ని అందరికి తెలిపి అందరాని శిఖరాలను చేరిన మహాకవి ఆయన.

రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగులు పడతారు అంటూ కమ్యునిజం పై విమర్శలు వున్న ఆ కాలంలో కుడా కమ్యునిజం నా వూపిరి సోషలిజం నా శ్వాస అంటూ వెలిగెత్తి చాటి ఇక్కడి గొడుగులు వర్షాన్ని నిలువరించగలవు అంటూ ఇక్కడి వారి వునికిని చాటిన వ్యక్తి శ్రీ శ్రీ.

శ్రీ శ్రీ జయంతి రోజున రాయాల్సిన ఈ వ్యాసం ఆలస్యంగా రాస్తున్నందుకు క్షమించగలరు ,ఈ నా వ్యాసం పులి చంపిన లేడి నెత్తురంతా వేడిగా వాడిగా లేక పోయినా ఆయనపై వున్న అభిమానానికి చంద్రునికో నులు పోగు వంటిది.


మరో ప్రపంచం పిలుస్తోంది అంటూ మరలి రాని లోకాలు తరలి వెళ్ళిన ఓ మహాకవి మళ్ళి మా ప్రపంచం పిలుస్తోంది దిగిరావా ...నీ మహా ప్రస్థానాన్ని కొనసాగించడానికి కదలి రావా ....


Thank u for visiting Aradhana

keep visiting

by

praveenAradhana