Pages

Subscribe:

Thursday, July 24, 2008


ఇక్కడ ఒక ప్రముఖులైన గురువులు, గుంటూరు వాస్తవ్యుల ఫొటో కూడా లభ్యమైంది. దత్తోపాసకులైన ఈ గురువులు ఒకసారి షిర్డి వెళ్ళినప్పుడు తీసిన ఫొటో గా చెప్పారు. ఇందులో చిత్రం ఏమిటంటే ఫొటో తీస్తున్నపుడు లేని ఒక కాషాయ వస్త్ర ధారి (సాయి బాబాలా వున్నారు) ఫొటోలో వచ్చారు, ఈ గురువుల వెనుక. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు సేకరించవలసి వుంది.

ఏది ఏమైనా సాధన వల్ల, మంత్రదేవతోపాసన వల్ల సిద్ధులు కలుగుతాయని, యోగసాధన వల్ల ఆరోగ్యం, శాంతి కలుగుతాయని చెపుతున్నారు. మనం తినే తిండి కంటే పీల్చే గాలి ముఖ్యమైనది. పరిశుభ్రమైన గాలి ఆరోగ్యానికి మంచిది. కాని అది ఈనాడు కరువైపోతున్నది. భోపాల్లో యూనియన్ కార్బైడ్ దుస్సంఘటన ప్రపంచం మర్చిపోలేనిది. విష వాయువుల వల్ల లక్షమందికి పైగా దెబ్బ తినడం జరిగింది, ఎంతోమంది మరణించారు కూడా. కాని అంత భయంకర మైన సంఘటన మధ్యలో ఒక కుటుంబం మాత్రం క్షేమంగా మామూలుగా వుంది, ఈ విషయం ఆనాటి హిందు పేపర్లోనూ వచ్చింది. మరి ఈ కుటుంబం ఆ విషవాయువుల బారినుండి ఎలా బయటపడింది? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు గాయత్రీ హోమం చేస్తున్నారుట!

చాలా ఏళ్ళ క్రితం కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర స్వామీజి అంధ్రదేశాన్ని పర్యటిస్తూ చందోలు గ్రామానికి వెళ్ళారుట. ఇక్కడ ఆపండి అంటూ అక్కడో చిన్న ఇంట్లోకి అనుకోకుండా వెళ్ళేసరికి అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారు. 'అమ్మ చెప్పింది ' అంటూ ఆ ఇంట్లోకి వెళ్ళారు, అది సాహితీ ప్రపంచలో వారికి, ఆ ప్రాంతంలో వారికి పరిచితమైన నిరాడంబర సాధకులు, కవి కీ.శే. ఛందోలు శాస్త్రి గారి ఇల్లు. బహుశా అప్పటికీ ప్రపంచానికి ఆయన ఏమిటో పూర్తిగా అర్ధంకాలేదుట. ఏదో పంతులుగారు అనుకుంటారు కదా! కొన్నేళ్ళకి ప్రముఖ వార్తా పత్రిక మధ్య పేజీలో పెద్ద రెండుపేజీల ఫొటో ఇంకా సంచలన వార్త ప్రచురితమైంది. విదేశాలలో విన్నా, అలాంటి వార్త తెలుగుదేశంలో మొదటిదేమో! ఆ వార్త ప్రకారం, ఛందోలు శాస్త్రిగారు దివంగతులైనప్పుడు వారికి మిత్రులైన కొందరు సాహితీవేత్తలు, ఊరి వారు స్మశానానికి వెళ్ళారుట. అక్కడ దహన సంస్కారాలు జరుగుతుండగా ఒక తెల్లని స్త్రీ మూర్తి ఆయన తలవద్ద కొద్ది నిమిషాలు అందరికీ దర్శనమిచ్చి అదృశ్యమయ్యిందిట. అందరు ఆశ్చర్యపోయారు, అంతలో అక్కడే వున్న ఫొటోగ్రాఫర్ కూడా వెంటనే ఫొటో తీసాడు. ఈ ఫొటోలో ఎడమచేతి వైపు తెల్లని పారదర్శకమైన స్త్రీమూర్తిని చూడొచ్చు.

అయితే ఈమె ఎవరు? అన్న చర్చ ఆంధ్రమంత్ర రంగాలలో చర్చనీయాంశంగా ఉండి పోయింది. ఇన్నాళ్ళు ఆయన ఉపాసించిన దేవి ఆయనలోనే వుందని, ఆమె ఆయన మరణించాక బయటకు వచ్చిందని కొందరు, ఆ దేవతామూర్తి దేవతాలోకాలనుండి ఆయనను తీసుకెళ్ళడానికి వచ్చిందని కొందరు అన్నారు. మంచి విషయం ఏమిటంటే ఇది జరిగిన తర్వాత, ఇది మాగొప్పతనం అంటూ ఆయన వైపునించి ఎవరూముందుకు రాలేదు, ప్రచారాలూ చేసుకోలేదు. ఇప్పటికీ ఈ చిత్రం ఒక చిత్రం.

ఒక తలారి కథ....

1940 లో ట్రావంకూరు మహారాజ సంస్థానంలో ఒక తలారి కథ. ఈ తలారి పదవి వంశపారంపర్యంగా వస్తుంటుంది. తలారి కుటుంబం ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటుంది. అక్కడైనా మిగతా గ్రామస్తులతో కలవకుండా ఊరికి దూరంగా ఉంటుంది. ఈ వేర్పాటుని ఇంకా నొక్కి చెప్పాలి అన్నట్టు తలారి కుటుంబం అంతా తమలో తాము మాట్లాడుకునేటప్పుడు తమిళం మాట్లాడుకుంటారు. ఉరి తీసిన తాడుని తలారికే బహుకరిస్తారు. ఆ తాడు అతని ఇంటిలో కాళికాదేవి పూజాస్థలం ముందు వేళాడుతుంటుంది. ఆ తాడుముక్కతో అమ్మవారికి దీపారాధన వెలిగించి ఆ బూడిద విభూతి పెడితే అన్ని రోగాలూ పోతాయని గ్రామస్తుల నమ్మకం.

ఇప్పటి తలారి కాళియప్పన్ వృద్ధుడైపోయాడు. పైగా అంతకు ముందు ఉరితీసిన ముద్దాయి నిర్దోషి అని నమ్మి, అతని ప్రాణం తీసిన పాపం వొడిగట్టుకున్నాను అనే పాపచింతనతో పగలూ రాత్రి అదే పనిగా తాగి కాలం గడుపుతున్నాడు. కొడుకు ముత్తు పై ఊళ్ళకి చదువుకి వెళ్ళి గాంధీ గారి సత్యాగ్రహ సూత్రాల్ని వంటబట్టించుకుని తిరిగి వచ్చాడు. రాట్నం వడుకుతుంటాడు. పెళ్ళై కాపురం చేసుకుంటున్న పెద్ద కూతురు తనకింకా ఏవో పుట్టింటి కట్నాలు దక్కలేదని దెప్పుతూంటుంది. చిన్న కూతురు అప్పుడే పెద్దమనిషైంది. ఈ విచిత్ర కుటుంబాన్ని కట్టి ఉంచే సూత్రధారిణిగా కాళియప్పన్ అర్ధాంగి మరగతం అందర్నీ కను రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది.

ఇంతలో రాజాస్థానపు ఉద్యోగి తలారిని వెదుక్కుంటూ వస్తాడు. హత్య చేసిన నేరానికి ఒక ముద్దాయికి ఉరిశిక్ష విధించారనీ, శిక్ష ఫలానీ రోజున అమలు జరుగుతుందనీ, ఆ దండన అమలు జరిపేందుకు తలారి అవసరమైన పూజాదికాలు నిర్వహించి సిద్ధంగా ఉండవలసిందని రాజాజ్ఞగా వినిపిస్తాడు. తాను వృద్ధుణ్ణైపోయాననీ, వేరెవర్నైనా ఈ పనికి చూసుకోవలసిందనీ కాళియప్పన్ ప్రార్ధిస్తాడు. తలారి పదవిలో రాజుగారి దయచేసిన వసతూన్నీ ఇన్నాళ్ళూ హాయిగా అనుభవించి ఇప్పుడు రాజధిక్కారం చేస్తావా అని గద్దిస్తాడు ఉద్యోగి. విధిలేక వల్లెయన్నాడు కాళియప్పన్. ఆ రోజు నించీ నిత్యం స్నాన జపతపాల్లో గడుపుతున్నాడు. ఆరోగ్యం క్షీణిస్తోంది. చివరికి బయల్దేరే రోజు రానే వచ్చింది. కొడుకుని సాయంగా తీసుకుని రాజధానికి వెళ్ళాడు. అక్కడ ఉరి తాడునీ, యంత్రాన్నీ పరీక్షిస్తాడు.

ఆ రాత్రి అతనికి శివరాత్రే. ముద్దాయి ఎలాగూ ఆ రాత్రి నిద్ర పోలేడు కాబట్టి తలారి కూడా జాగారం చేయ్యాలని అదొక ఆచారం. జైలర్లు అతనికి తోడు కూర్చుని, సారాయి తాగిస్తూ, నిద్ర పోకుండా ఒక కథ చెప్పటం మొదలు పెడతారు. ఒక పెల్లలో ఒక అమాయకపు పడుచు పిల్ల తన మేకని మేపుకుంటుంది. ఒక అనాథ యువకుడు పిల్లంగ్రోవి ఊదుకుంటూ అక్కడ పచ్చిక బయళ్ళలో తిరుగుతుంటాడు. ఇద్దరూ తారసపడతారు. త్వరలో అది పరస్పరం ఇష్టంగా ప్రేమగా పరిణమిస్తుంది. ఇంతలో ఆమె అక్క మొగుడు వీళ్ళని చూస్తాడు. ఆ యువకుడు అవతలికి వెళ్ళిన సమయంలో ఆ పిల్లని సోంత బావే బలాత్కరించి చంపేస్తాడు. ఆ ప్రదేశంలో అనాథ యువకుడి పిల్లంగ్రోవి విరిగిపోయి కనిపిస్తుంది. అతను దోషిగా నిరూపించబడతాడు. చనిపోయిన పిల్ల కుటుంబానికి అసలు ముద్దాయి ఎవరో తెలుసు, కానీ వారతన్ని బయట పెట్టరు. కథ ఇంతవరకూ విన్న కాళీయప్పన్ తాగిన మైకంలో "మరి ఆ అబ్బాయి ఏమయ్యాడు" అని అరుస్తాడు. కథ చెప్పిన జైలరు నవ్వుతూ "ఏమవుతాడు? వాణ్ణే నువ్వు రేపు ఉరి తియ్య బోయేది!" అంటాడు. ఇంకో నిర్దోషిని ఉరితియ్యడమనే ఊహ భరించలేక గుండె పోటు వచ్చి కాళీయప్పన్ మరణిస్తాడు.

కానీ రాజాజ్ఞ అమలు జరగాలి. సత్యాహింసలు తన దైవాలుగా నమ్మిన ముత్తు తండ్రి కాళీయప్పన్ కి వారసుడిగా తలారి పాత్ర ధరించి మొదటి ఉరి తీస్తాడు.
ఇదంతా ఇలా ఉండగా, జైలరు ఆ అమాయకపు పడుచు పిల్ల కథ చెబుతున్నప్పుడు తలారి దృష్టిలో అది తన చిన్నకూతురిలాగా, ఆ హీనమైన అకృత్యం చేసేవాడు తన అల్లుడిగా కనిపిస్తారు. ఇది (సినిమా కథలో) నిజంగా జరిగింది కాదు. కానీ ఆ ఊహ అతన్ని ముదలంటా కుదిపేసి మరణానికి దారి తీస్తుంది. ఒక విధంగా పసితనపు అమాయకత్వానికీ, కర్కశమైన న్యాయవిధానానికీ, మధ్యలో నిమిత్తమాత్రమైన అసహాయత్వానికీ ఒక త్రికోణపు సంబంధంలా అనిపిస్తుంది.