Pages

Subscribe:

Thursday, July 24, 2008

చాలా ఏళ్ళ క్రితం కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర స్వామీజి అంధ్రదేశాన్ని పర్యటిస్తూ చందోలు గ్రామానికి వెళ్ళారుట. ఇక్కడ ఆపండి అంటూ అక్కడో చిన్న ఇంట్లోకి అనుకోకుండా వెళ్ళేసరికి అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారు. 'అమ్మ చెప్పింది ' అంటూ ఆ ఇంట్లోకి వెళ్ళారు, అది సాహితీ ప్రపంచలో వారికి, ఆ ప్రాంతంలో వారికి పరిచితమైన నిరాడంబర సాధకులు, కవి కీ.శే. ఛందోలు శాస్త్రి గారి ఇల్లు. బహుశా అప్పటికీ ప్రపంచానికి ఆయన ఏమిటో పూర్తిగా అర్ధంకాలేదుట. ఏదో పంతులుగారు అనుకుంటారు కదా! కొన్నేళ్ళకి ప్రముఖ వార్తా పత్రిక మధ్య పేజీలో పెద్ద రెండుపేజీల ఫొటో ఇంకా సంచలన వార్త ప్రచురితమైంది. విదేశాలలో విన్నా, అలాంటి వార్త తెలుగుదేశంలో మొదటిదేమో! ఆ వార్త ప్రకారం, ఛందోలు శాస్త్రిగారు దివంగతులైనప్పుడు వారికి మిత్రులైన కొందరు సాహితీవేత్తలు, ఊరి వారు స్మశానానికి వెళ్ళారుట. అక్కడ దహన సంస్కారాలు జరుగుతుండగా ఒక తెల్లని స్త్రీ మూర్తి ఆయన తలవద్ద కొద్ది నిమిషాలు అందరికీ దర్శనమిచ్చి అదృశ్యమయ్యిందిట. అందరు ఆశ్చర్యపోయారు, అంతలో అక్కడే వున్న ఫొటోగ్రాఫర్ కూడా వెంటనే ఫొటో తీసాడు. ఈ ఫొటోలో ఎడమచేతి వైపు తెల్లని పారదర్శకమైన స్త్రీమూర్తిని చూడొచ్చు.

అయితే ఈమె ఎవరు? అన్న చర్చ ఆంధ్రమంత్ర రంగాలలో చర్చనీయాంశంగా ఉండి పోయింది. ఇన్నాళ్ళు ఆయన ఉపాసించిన దేవి ఆయనలోనే వుందని, ఆమె ఆయన మరణించాక బయటకు వచ్చిందని కొందరు, ఆ దేవతామూర్తి దేవతాలోకాలనుండి ఆయనను తీసుకెళ్ళడానికి వచ్చిందని కొందరు అన్నారు. మంచి విషయం ఏమిటంటే ఇది జరిగిన తర్వాత, ఇది మాగొప్పతనం అంటూ ఆయన వైపునించి ఎవరూముందుకు రాలేదు, ప్రచారాలూ చేసుకోలేదు. ఇప్పటికీ ఈ చిత్రం ఒక చిత్రం.

0 Comments:

Post a Comment