Pages

Subscribe:

Wednesday, July 23, 2008

కవిత్వం రాయడానికి..

ఉదయిస్తున్న భానుడు
సింధూరపు మేఘాలు
సుదూరపు కొండలు
పిల్ల తెమ్మరలు
నది ప్రవాహం
రంగనాధుడి గాలి గోపురం
ఇంకెం కావాలి కవి కావడానికి
రమణీయమైన కవిత్వం రాయడానికి..

అలవై..

అలవై..

నిన్న
నీవు
నాతొ
నిద్దురలొ కలవై
మెలుకువలొ ధ్యానమై
ఎగసి పడుతూనే ఉన్నావు
నా ఆలొచనల అనంత సాగరం లొ
అలవై..

తీపిగుర్తులు..

గడచిన జీవితపు
మధుర క్షణాలని
కళ్ళ ముందు చూపే
జ్ఞాపకాల గడపల
పచ్చని తొరణాలు
తీపిగుర్తులు...