Pages

Subscribe:

Wednesday, October 15, 2008

మేఘం మీద నిలబడాలని వుందా..అవును నే రాసింది నిజమే , మీరు మేఘం పైన నిలబడాలని వుంటే ఖచ్చితంగా అది అసాద్యం కానిదే అవుతుంది .... మన పాత సినిమాలలో దేవతలు దివి నుండి భువికి దిగినట్లుగా,మనమూ మేఘాల మద్య నుండి కిందికి దిగి రావచ్చు,అక్కడికి వెళ్లి చూస్తే మనం ప్రపంచాన్నే జయించి నట్లుంటుంది , ఆశల కోటల్ని అధిగమించి తదుపరి నింగి కోసమే వేట అన్నట్లుగా వుంటుంది , ఎలాగు సీత కాలం వచ్చేస్తోంది గజ గజ వణికే చలిలోనే మేఘాల్ని మదించడానికి బయలు దేరాలంటే ఆ కదనరంగానికి చేరుకోవలసిందే .....
మనం అక్కడున్నంత సేపు అదొక సినిమా సెట్ లా వుంటుంది కాని ప్రకృతి మనల్ని మత్న్త్ర ముగ్దుల్ని చేయడానికి వేసిన ఓ నెట్ .......ఆలస్య మెందుకు ప్రకృతి ఒడిలోకి జారుకుందామా ......

నేను సైతం ఆకాశ వీధిలో హాయిగా

ఎంత బావుందో ...


ఇక ఆకాశమే తరువాయి ....


భానుదయం


నాకు సముద్రుడికి తేడ ఏంటి








దివినుండి భువిపైకి దిగివచ్చిన ఓ మేఘమా



కలవార గిరి నుండి ప్రత్యక్ష ప్రసారం కాదు కాదు పకృతి ప్రసాదం


మేఘాలు ఆకాశంలో చెట్టాపట్టాలేసుకు పరుగెత్తుతాయి అంటానికో సాక్షం
ఎక్కడుందంటే ...
కర్ణాటక రాజధాని బెంగళురు కు సరిగ్గా 53 కి.మీ. దూరంలో ఉన్న "కలవార హళ్లి" కి వెళ్ళాల్సిందే ....ఈ పల్లెని అదేనండి కన్నడలో హళ్లి ని "స్కందగిరి" అని కుడా అంటారు ...
ఎలా చేరు కోవాలంటే ...
బెంగుళూరు నుండి చిక్ బల్లాపూర్ మీదుగా కలవర గ్రామాన్ని చేరి ఓంకార జ్యోతి ఆశ్రమ / పాపాగ్ని మఠం గుండా వెళితే అక్కడొక శివాలయం వుంటుంది అక్కడ మన vehicles పార్క్ చేసి నడక కొనసాగించాల్సిందే...
హ్యాపీ జర్నీ