Pages

Subscribe:

Tuesday, November 11, 2008

చేనేత కార్మికా...

కడగండ్ల వడగండ్ల కన్నీటి ధారలతో తడిపి
ఏకులోడికి దారం తీసి ...
నరనరాల్ని కూడదీసి
నాలుకపై తేమతో అతికి తీసి ...
పేగు పేగున సాన భీకి పేగుపోను గంటేసితీసి...
రక్తాన్ని రంగరించి రకరకాల రంగులద్ది
కాళ్ళే పడుగుగా చేతులే పెకగా
మెదడుకు పదను పెట్టిచెమటే గంజిగా తట్టి ...
కండలు కరిగించి రాట్నం తో కండె బొట్లుగా చుట్టి తీసి ...
గుండె చప్పుళ్ళతో మొగ్గంపై వాటేసి ...
తుక్కు పోగుల్ని చేర్చి కూర్చి సరికొత్త రూపురేఖలతో ...
వస్త్రాన్ని కళాత్మకంగా నేసి వన్య చిన్యలతో తయారు చేసి
ఎందరెందరికో ప్రాణం కన్నా
ప్రాణం కన్నా మిన్న అయిన మాణం కాపాడు
కష్టించి పనిచేయు ఓ చేనేత చైతన్య కార్మికా,
నీకా ఆకలి చావు ?నీ వెతల దీర్చుదాతే ఈ భువిపై కొరతా ?
పాచి బాలింత సంక బిడ్డనేత్తి చదువు సంధ్యల పక్క నెట్టి...
చేయి చేయి జత కలిపిఅందినంత అప్పనప్ప చేసి ....
గిట్టుబాటు ధరె దక్కక పట్టెడు మెతుకులైనా చిక్కక చక్ర వడ్డీలతో
నడ్డి విరిగి బ్రతుకు నీడ్చు ఓ బడుగు జీవుడా ....
నీ నుదిటిపై ఆ విధాత వ్రాసిన నీ అరగుంత శ్వాస వీడింnanత సంపూర్ణ సంత ...........

thanks to visit aradhana