Pages

Subscribe:

Saturday, December 13, 2008

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి యువకులు నేడు ఎన్ కౌంటర్ లాగా మోకరిల్లాడు ,ఈ రోజు యాసిడ్ ఎన్ కౌంటర్ కి పట్టుబడి పోయింది ఇక ముందు అదలా(యాసిడ్) తన ప్రతిభను ఎవరి ముందు ప్రదర్శించదని మనము ఆశిద్దాం .ఈ రోజు తెల్లవారు జామున స్వాప్నిక ,ప్రనిత ల పైన యాసిడ్ దాడి చేసిన నర రూప రాక్షసుల ప్రాణాలు పోలిసుల చేతుల్లో గాల్లో కలిసిపోయాయి , పాపం పోలీసులకి కూడా కోర్టులపైన నమ్మకం పోయినట్లుంది ,ఎన్ కౌంటర్ సరైన మార్గం అనుకున్నారో ఏమో అంత పని చేసి రాష్ట్రానికీ మూగ సక్షల్ని అందచేశారు ,దీన్ని అన్ని రకాల ప్రజా కోర్టులు ముక్త కంఠంతో ఆమోదిస్తాయో లేక ఆవేదిస్తాయో వేచి చూడాలి ...
నీ మొహాన్ని ఓ చంద్రబింబం లా వుహించుకుంటూ నీకురిపించే వెన్నెలలో నా అన్వేషణ సాగిస్తాను అనుకుంటూ బయల్దేరే యువతరానికి ఆ చంద్రబింబాన్నే మార్చివేసే హక్కులేదు ,మొన్న శ్రీలక్ష్మి నిన్న అయేషా నేడు స్వప్నిక, ప్రనిత రేపు అనే పదాని ఈ ప్రాస నుంచి తీసి వేయలనుకున్నరేమో పోలిసులు సహకరించిన వారిని కూడా సంహరించారు , తను ప్రేమించిన వ్యక్తీ తనను ప్రేమించాక పోయినా తట్టుకునే శక్తి వున్న ప్రేమికులు పుట్టేతంత వరకు ఇలాంటి దాడులు ఆగక పోవచునేమే ..
తప్పు జరిగినప్పుడు అందులో ప్రత్యక్ష్యమ్గానో పరోక్ష్యం గానో ఇద్దరి పాత్ర వుంటుంది కాని ఇక్కడ ఇద్దరు శిక్షింప బడ్డారు అదెంతవరకు న్యాయమ , ఒకరికి సానుభూతి రక్షిస్తే మరొకరిని కోపం దహించి వేసింది ,కాని ఒకరుజీవితకాలం శిక్షను అనుభవిస్తూ వుండాలి మరొకరు జివితనుభావముగా అనుభవించారు, ఇలాంటి శిక్షల్ని చూసి భవిష్యత్తులో తప్పులు జరుగకుండా వుండాలని కోరుకుంటూ ...
thank you for visiting ARADHANA