Sunday, August 31, 2008
ఉపన్యాసము , రాజకీయము విడదీయరాని ఓహ్ బంధము .రాజకీయ నాయకుని అమ్ముల పొదిలో ఉపన్యాసము ఓ బ్రహ్మస్రము వంటిది , కాని ఆ బ్రహ్మస్రాన్ని తెలియని వారు వుపయోగిస్తే ఎలావుంటుంది ....ఎంతసేపు కనిపించమా అని కాకుండా ఎంతమేరకు నవ్వించాము అన్నదే సర్కస్ లోని జోకర్ ప్రార్ధన లక్షం,అలాగే ఎంతసేపు మాట్లాడానా అని కాకుండా ఎంత బాగా మాట్లాడానన్నదే వుపన్యాసకుడి ఆలోచన .... కాని కొన్ని ఉపన్యాసాలు అపహాస్యాల పాలవుతుంటాయి......
సరిగ్గా అలాంటిదే ఈ మద్య మన రాష్ట్రం లోను చోటు చేసుకుంది.....
వరంగల్ జిల్లా ,పరకాల మండలంలోని ఓ పార్టీ సమావేశానికి హోం మంత్రి జానా రెడ్డి గారు హాజరయ్యారు , అక్కడ కొందరు ఉపన్యాసకులు నానా రభస చేసారు , కొందరు పద్యాలూ కొందరు ఏకంగా పాటలు పాడారు.....ఇక ఒక మహిళా ఏకంగా తన పార్టీ సిద్దంతాల్నే కాల రాస్తూ తన పార్టీ కే సంభందించిన ఓ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు , అది చూసి తరలి వచ్చిన జనం ముక్కున వేలేసుకున్నారు ........హోం మంత్రి జాణ రెడ్డి సాక్షిగా జరిగిన ఈ పేరడీ సన్నివేశంలో ఇంకా అనేక హాస్య రసాలు దాగి వున్నాయి....వాటిని అక్షర బద్దం చేయడం కంటే తిలకించడమే చాలా మంచిదని ఇక్కడ ఉంచడం జరిగింది......
పైన ఉదహరించబడిన అంశము నిజంగా జరిగినదే అయినా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎలంచి పక్షపాత వైఖరిని ప్రదర్శించడం లేదు , ఈ విషయం ఎవరిని కిన్చపరచదని, ఎవరి మనస్సులని భాద పెట్టదని భావిస్తున్నాను ....
ఒక మనవి : Now you can visit my blog as " http://www.aradhanaa.co.cc/".
Labels: హాస్యము