Saturday, November 22, 2008

నటీమణులెందరున్నా మహానటి అంటే సావిత్రే!

కాని ఓ అభిమాని autograph అడిగితె ఇలా savitri ganeshan అని చేసి
సావిత్రి గారికి వర్షమంటే చాల ఇష్టమట ఎప్పుడైనా షూటింగ్ స్పాట్ లో వర్షం పడితో వర్షంలో తడిచి గంతెయకుండా వుండలేక పోయేదట ,ఇంకా సావిత్రిగారికి మల్లెపూవులంటే చాలా చాలా ఇష్టమట ఎప్పుడు గంపెడు పూలతో తన తలను అలంకరించుకునేదట,ఒకసారి సావిత్రి కూతురు చాముండేశ్వరి గారు తన తలలో కూడా ఇలా సావిత్రిగారిలా పూలు అలంకరించుకుని వుండగా వారి భర్త నిన్ను ఈ వేషంలో చూస్తె మేకలు వేంబడిస్తాయి,అని సరదాగా అనేవారట ,మాములుగా సినిమాలలో ఏడుపు సన్నివేశాలు వచినపుడు నటినటులు గ్లిసరిన్ మీద ఆధారపడటం అందరికి తెలిసిందే ,కాని సావిత్రి గారు చాలా తక్కువ భాగంలో గ్లిసరిన్ మీద ఆధారపడి ,సన్నివేశానికి తగినంత కన్నీటి చుక్కలు రాల్చి చాలా మంది దర్శకుల మన్ననలు పొడి భావి కథానాయికలకు దార్శనికంగా వుండేదట.

--------------------------------------------------

సంఘంలో ఎంత తల ఎత్తుకుని చూస్తున్న తలరాత ముందు తల దించాల్సిందే , అదే ఆమె విషయంలోను ......
1956 లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి చెడిపోయింది. ఆస్తిపాస్తులూ కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.

----------------------------------------------------------
ఆమె మరణం సంగతి గురించి తెలిసిన వారందరూ ఆమె పైన జాలి చూపకుండా వుండలేరేమో ,కాని ఇప్పుడు ఆమె సంతానం సినిమా సముద్రంలో ఒలలాడక పోయినా సముద్రాన్ని ఒక ప్రకృతి ప్రసాదంలా భావించి వారి జీవితాల్ని వారు గడుపుతున్నారు ,ఇప్పుడు ఆమె కుమారుడు సతీష్ అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు ,కూతురు విజయ చాముండేశ్వరి గారు కూడా మంచి స్తాయిలో వుంటూ ఆమె అందించిన ఈ విలువైన జీవితాన్ని ఆనందిస్తున్నారు .
"జీవించినంత కాలం నటించాలి తరువాత నటనా కీర్తితో జీవించాలి , అన్న భావంతో స్పూర్తి తో నటించిన ఆమె కీర్తి తో వెలుగుతోంది."
thank u for visiting ARADHANA
Labels: మహామహుల జీవితాలు
4 Comments:
-
- krishna rao jallipalli said...
November 22, 2008 at 9:03 PMటపా చాలా బాగుంది. చాలా అరుదైన ఫోటోలు అందచేసారు.- Anonymous said...
November 23, 2008 at 12:14 AMthe photo taken in her last moments......its really shocked me. was that saavithri really ?- cbrao said...
November 23, 2008 at 1:37 PMగతంలో ఎన్నడూ చూడని అరుదైన చిత్రాలు అందించినందులకు అభినందనలు. మీ వ్యాసం మరో సారి మహా నటిని గుర్తుకు తెచ్చింది. ఆమె జీవితం ఇప్పటి నటీమణులకు ఒక కనువిప్పు కాగలదు.- Rajendra Devarapalli said...
December 3, 2008 at 5:14 PMఈ వ్యాసం గతం లో ఎక్కడో చదివాను ఎక్కడ?అది రాసిందీ మీరేనా??