Pages

Subscribe:

Monday, July 21, 2008

సినిమాల కథ

ఈ పదిహేను రోజులూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా క్లాసులు తప్ప తక్కిన సమయమంతా ఖాళీనే అఫీషియల్ గా. సో, ఈ IISc క్యాంపస్ ని అన్వేషిస్తూ, ఫొటోలు తీస్తూ, చక్కని చిక్కని కాఫీ ని అప్పుడప్పుడూ సేవిస్తూ, కంప్యూటర్ లో ఇలా రకరకాల టపాలు రాస్తూ సమయం గడిపాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చూశాను. కొత్తవి కావు. జనరంజక సినిమాల జాబితాలో ఉన్న సినిమాలు కొన్ని. మనం స్నేహితులతోనో,సన్నిహితులతోనో మాట్లాడేసమయం లో - “ఆ సినిమా లో ఆ పాత్ర లాగా..” అనుకుంటూ తరుచూ ఉదహరించే సినిమాల లో కొన్నింటిని గురించిన మ్యూజింగ్సే ఈ టపా. ఏమైనా నా ఉద్దేశ్యం ఈ సినిమాలను సమీక్షించడం కాదు. కొన్ని రోజుల తేడా లో చూసిన ఈ సినిమాల మీద ఆ క్షణం లో కలిగిన అభిప్రాయాలు. అంతే. బ్లాగన్నాక అప్పుడప్పుడూ ఇలాంటి టపాలు కూడా రాయాల. లేకుంటే బ్లాగుకి, ఇంకోదానికి తేడా ఏటుంటది?

మొదటగా ఏప్రిల్ ఒకటి విడుదల. రాజేంద్ర ప్రసాద్,శోభన హీరో హీరోయిన్లు. వంశీ దర్శకుడు. ఇళయరాజా సంగీతం. మంచి టైమ్ పాస్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా కి ఆధారం “హరిశ్చంద్రుడు అబద్దమాడితే” అన్న నవల. ఇక కథాంశమా - అందరికీ తెలిసే ఉంటుంది. సరదా, సీరియస్ నెస్ .. రెండూ ఉన్నాయి ఈ సినిమాలో. ఎక్కడా బోరు అనిపించలేదు. సంగీతం కూడా బాగుంది. కథ లో వెరైటీ ఉంది. రాజేంద్రప్రసాద్ ఉన్నాడు కనుక సినిమా కి మినిమమ్ గ్యారంటీ అన్న అభిప్రాయం మళ్ళీ కలిగించింది. నేను ఈ సినిమా వచ్చినప్పుడు బాగా చిన్నదాన్ని. కాబట్టి అప్పుడు ఇది ఎలా ఆడిందో గుర్తు లేదు. కానీ, ఇప్పటికీ నచ్చుతూనే ఉంది కనుక ఇది కాలం లో కలిసిపోయే సినిమా కాదు. నిలిచే సినిమా నే అని అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ లేకుంటే మాత్రం ఇలా చెప్పగలిగే దాన్ని కాదు. ఆ టైమింగ్ ఇంకోళ్ళకి రాదు. ఎల్.బీ.శ్రీరాం మాటలు సినిమాకి హైలైట్.

రెండోది - చెట్టు కింద ప్లీడరు. ఊరికి బయలుదేరే ముందు దొరికిన ఏడెనిమిది తెలుగు సినిమాలూ ల్యాప్టాప్ లోకి ఎక్కించేసా. అప్పుడు గమనించలేదు కానీ, చూట్టం మొదలెట్టాక గమనించాను - రాజేంద్ర ప్రసాద్ సినిమాలే ఎక్కువ ఉన్నాయని. ఇది కూడా మంచి టైమ్ పాస్ సినిమా. కథాంశం లో వెరైటీ ఉంది. మళ్ళీ ఇది వంశీ-ఇళయరాజా కాంబినేషన్. ఎటొచ్చీ నాదో అనుమానం. ఇదే ఇళయరాజా వంశీ కి చేస్తే ఒకలా ఉంటాయి పాటలు. వేరే ఎవరికి చేసినా ఇంకోలా అనిపిస్తాయి. అంటే రెండూ బాగుంటాయి కానీ, ఏదో తేడా పాటల్లో. వీళ్ళిద్దరి మధ్య అదో కెమిస్ట్ర్రీ ఏమో మరి. దీనిలో కూడా సంభాషణలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ డైలాగులు. విని, వెనక్కి వెళ్ళి మళ్ళీ విని మరీ నవ్వుకున్నాను చాలా చోట్ల. రాసినది - తనికెళ్ళ భరణి. కిన్నెర ఇదొక్క చోటే అనుకుంటా కాస్త కామెడీ పాత్ర వేసినది. బాగుంది ఆమెకి ఆ పాత్ర. వీళ్ళిద్దరికి, మహంకాళి కేసు కీ మధ్య జరిగిన కథ భలే నవ్వు పుట్టించింది. ఆ మధ్య ఈ బ్లాగులో చదివిన టపా లోని “నీరుగారి పారిపోకు..” పాట మొదటిసారి ఇప్పుడు విన్నా. అప్పట్నుంచి విందాం అనుకుంటూ. బాగుంది. ముందే చెప్పినట్లు, పాటలు బాగున్నాయి. ఇందాక చెప్పినట్లు, ఇళయరాజా ది ఒక శైలి అయితే, వంశీ కి చేస్తే ఆ ఇళయరాజా ది మరో కొత్త స్టయిల్ అనిపిస్తుంది.

మూడోది - పడమటి సంధ్యా రాగం. ప్రవాసాంధ్రులు నిర్మించిన జంధ్యాల సినిమా. సంగీతం - ఎస్.పి.బాలసుబ్రమణ్యం. మాటలు రాసింది కూడా జంధ్యాలే అనుకుంటా - సినిమా మొదట్లో - “కథా రచన లో సహకరించిన ఆదివిష్ణు కి ధన్యవాదాలు” అని రాసారు కనుక ఇద్దరు కలిసి రాసి ఉంటారు. ఈ సినిమా బానే ఉంది చూట్టానికి. నేనెప్పుడు పూర్తిగా చూడలేదు. ఇదే మొదటి సారి. ఈ దెబ్బ కి ఇదేదో బ్రహ్మాండమైన సినిమా అన్న భ్రమ లు పోయాయి. కథ పరంగా నాకు చాలా చోట్ల - “ఏమిటీ కథ?” అనిపించింది. కానీ, డైలాగులు మాత్రం - అద్భుతం. పడీపడీ నవ్వుకున్నాను చాలా చోట్ల. అయిస్క్ర్రీం పార్లర్ అతని డైలాగులు, సంధ్య తండ్రి పాత్ర డైలాగులు - అన్నింటి కంటే నచ్చాయి. అతిధి నటుడు సుత్తివేలు వ్యాఖ్యానం కూడా. బాగా నవ్వుకున్న డైలాగు - సంధ్య తండ్రి “వ్యాపారం బాగా సాగుతోందా?” అని అడిగితే - బకాసురుడి వారసుడి లాంటి కొడుకును చూపుతూ అయిస్క్ర్రీమ్ షాపు ఓనర్ - “వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజు చూసారు కదా. అంచేత మేము అయిస్ క్రీములు అమ్మడం కంటే - స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తూ ఉంటామన్నమాట. అదీ మా వ్యాపారం.” అంటాడు. బ్యాక్ గ్రౌండైనా, ఫోర్ గ్రౌండైనా రెంటిలోనూ సంగీతం బాగుంది.

తరువాతిది - మురారి. ఈ సినిమా ని కామెడీ అనలేము. కానీ, సరదా గానే ఉంటుంది సగం దాకా. అయితే, నాకు ఇందులో పెద్దగా ఏమీ నచ్చలేదు మహేశ్ బాబు నటన. మరీ చిన్నపిల్లాడిలా ఉన్నాడు. గొంతు కూడా అంతే. లక్ష్మి నటన కొన్ని చోట్ల ఎంత సహజంగా అనిపించిందో కొన్ని చోట్ల అంత ఓవర్ యాక్షన్ లా అనిపించింది. సోనాలి బెంద్రే మాత్రం బాగుంది. ఆ పాత్ర ఆమెకి చక్కగా కుదిరింది. ఎస్.పి.శైలజ గొంతుక హీరోయిన్ కి బాగా సరిపోయింది. కథ నాకంత నచ్చకపోయినా కూడా, నటుల ప్రదర్శన కారణంగా ఇది ఒక ఎంటర్ టైనర్ అనే అనిపించింది. వీళ్ళ అందరి కాంబినేషన్ బాగా కుదిరింది. పాటలు బాగున్నాయి. ఇంతకీ సంగీతం ఎవరో తెలీదు.

నువ్వు నాకు నచ్చావ్: దీని గురించి ఎంతని చెప్పను? ఈ కొన్నాళ్ళలోనే రెండు మూడు సార్లు చూసాను. అందులో ఓ సారి మూకీ లో చూసాను. ఎప్పుడూ బోరు కొట్టలేదు. మంచి సినిమా. త్రివిక్రం సంభాషణలు - నవ్వాగదు ఆ డైలాగులకి. ఒకరు ఇద్దరని కాదు మొత్తం అందరూ సూపర్బ్ ప్రదర్శన. వెంకటేష్ మీద నాకేం ప్రత్యేకాభిమానం లేదు కానీ, భలే చేస్తాడు ఈ తరహా సినిమాలు. మొత్తం కామెడీ కామెడీ. ప్రకాష్ రాజ్ కవిత సీను, బ్రహ్మానందం కారులో వెంకటేష్ తదితరులతో సంభాషించే సీను నాకు అన్నింటికంటే నచ్చినవి. ఈ సినిమా ని ఓ యాభై ఏళ్ళైనా జనం చూస్తారేమో అని నాకు అనిపిస్తుంది. సునీల్ ఈ సినిమా లో “గోల” లేకుండా మామూలుగా మాట్లాడతాడు కనుక బాగుంది. మొత్తానికి ఇది ఈ తరపు క్లాసిక్ అని నా అభిప్రాయం. విజయభాస్కర్ దర్శకత్వం బాగుంది ఈ చిత్రానికి.

మల్లీశ్వరి: కొత్త సినిమా గురించి నేను చెప్పేది. పాత ది కాదు. ఇది కూడా మొత్తం కామెడీ. బోరు కొట్టదు. వెంకటేష్ కి, వాళ్ళ ఆఫీసు లో జనాలకి మధ్య సంభాషణలు, మల్లీశ్వరి వాళ్ళ ప్యాలెస్ లో బ్రహ్మానందం తో డైనింగ్ టేబుల్ వద్ద జరిగే సంభాషణా నాకు భలే నచ్చాయి. కత్రినా కైఫ్ ని మాత్రం చూడ్డం చాలా కష్టమైపోయింది. మనిషి పర్లేదు. కానీ, నవ్వుకీ, ఏడుపుకీ అదే మొహమైతే ఎలా? ఉత్తర భారద్దేశం వారు చాలా మంది వచ్చినా కూడా, కనీసం వారికి భాష తెలీకున్నా, ఎప్పుడు మొహం దిగులుగా పెట్టాలో, ఎప్పుడూ నవ్వాలో అన్నా తెలుసు. ఈవిడకి అదీ లేదు. మంచి కామెడీ ఈ సినిమా కూడా. దర్శకుడు? మాటలు?

అహనాపెళ్ళాంట: “అయితే నీకు నా ఆటోబయాగ్రఫీ చెప్పాల్సిందే..” - ఎన్ని సార్లు ఈ సీను గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నానో. కోటా శ్రీనివాస రావు, బ్రహ్మానందాల మధ్య కామెడీ ని, నూతన్ ప్రసాద్ డైలాగులని, రాజేంద్రప్రసాద్ టైమింగ్ ని.. మొత్తంగా ఈ సినిమాలోని చాలా విషయాలు ఇష్టపడ్డాను. ఒక్క పాటలు తప్ప. అవి ఎందుకు రావాలో, వచ్చినా అలా ఎందుకు రావాలో అర్థం కాలేదు. ఏమైనా మంచి టైమ్ పాస్ సినిమా.

బృందావనం: మరో మంచి సినిమా. సింగీతం శ్రీనివాసరావు రాక్స్ :). మళ్ళీ రాజేంద్రప్రసాద్ భలే చేసాడు. అంజలీదేవి వి కొన్ని సీన్లు చాలా బాగుంటాయి. ఇక రావికొండలరావు, రాధాకుమారి ల జోడీ సరేసరి! వీళ్ళు నిజజీవితం లో వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే గొడవపడతారా అన్నంత సహజంగా ఉంటాయి తెరపై వీరి తగువులు. అన్నింటి కంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది మాధవపెద్ది సురేష్ సంగీతం, బాలు, జానకి గానం. ఈ సినిమాలో పాటలు అదో తరహా హాయిని ఇస్తాయి.

నువ్వువస్తానంటే నేనువద్దంటానా: టైమ్ పాస్. కామెడీ కావాల్సినంత ఉంది. నాకు గుర్తుంది…ఈ సినిమా తరువాత సిద్ధార్థ్ కి ఫాన్ ఫాలోయింగ్ ఎలా పెరిగిందో! ఈ సినిమా లో ఫొటోగ్రఫీ చాలా బాగుంటుంది. పాటలు కూడా బాగుంటాయి. నాకు బాగా గుర్తు ఉండిపోయిన డైలాగు - తనికెళ్ళ భరణి గీత తో ఫోను లో అంటాడు - “లవ్ అనింది. నో అన్నాను. కెవ్వ్ అనింది. ఓకే అన్నాను.” అని.

తప్పక చూడవలసిన నాలుగు మంచి సినిమాలు


గత నెలా రెణ్ణెల్ల లో కొన్ని పనికిమాలినవి, కొన్ని మంచి నుంచి చాలా మంచి సినిమాలు చూడటం జరిగింది. ఆ సినిమాల్ని పరిచయం చేస్తూ ఓ నాలుగు వాక్యాలు చెబుతున్నా అంతే.

Bicycle Thieves: ఇటాలియన్ సినిమా. సత్యజిత్ రే కి సినిమాలు తీయాలి అన్న కోరికను కలిగించిన సినిమా ఇదేనని అప్పుడెప్పుడో వికీ లో చదివిననాటి నుండి దీన్ని చూడాలి అనిపిస్తూ ఉండింది. ఈ సినిమా చూస్తూ ఉంటే ఆ మధ్య “కథా? కథనమా?” అంటూ వార్త లో వచ్చిన వ్యాసం గుర్తు వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో కథ అన్నదానికంటే కథనమే కథను నడిపించింది ఏమో అనిపిస్తుంది నాకు. కథ ఏమిటంటే - ఒకతనికి కొత్త ఉద్యోగం లో సైకిల్ ఉండటం తప్పనిసరి. అలాంటిది కష్టపడి కొనుక్కున్న సైకిల్ కాస్తా మొదటిరోజే దొంగలు దొంగిలిస్తారు. మిగిలిన సినిమా అంతా ఆ సైకిల్ కోసం అతను, అతని కొడుకూ చేసే ప్రయత్నాలు, వాళ్ళ అనుభవాలు… ఇవే. నేనిలా చెప్పానంటే .. ఏముంది ఈ కథలో? అనొచ్చు విన్నవారు ఎవరైనా. నిజమే… ఏముంది? కానీ, సినిమా చూస్తున్నంత సేపూ నేను ఇంకేమీ పట్టించుకోలేదు. వాస్తవికత ఉట్ట్టిపడుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. సినిమాలో నిరుపేద హీరో, నిజజీవితం లో కూడా ఫ్యాక్టరీ వర్కరే నట. ఈ సినిమా చాలా మంచి సినిమా

Strangers on a train: నాకు ఆ మధ్య చూసిన To catch a thief, Rear Window ల ప్రభావం తో హిచ్‍కాక్ సినిమా అంటే చాలు..చూసేద్దాం అనిపిస్తుంది అలాగే దీన్ని కూడా చూసాను.ఇదొక 1951 హాలీవుడ్ సినిమా. దీని కథ కూడా కాస్త రొటీన్ కి భిన్నం. ట్రెయిన్ లో కలిసిన ఇద్దరి మధ్య సంభాషణ తో మొదలౌతుంది కథ. బ్రూనో తన తోటి ప్రయాణికుడు, టెన్నిస్ ఆటగాడు అయిన గయ్ హేన్స్ తో ఓ ఒప్పందం కుదుర్చుకుందాం అంటాడు. అతనికి అడ్డుగా ఉన్న అతని తండ్రిని గయ్, గయ్ కీ, అతని ప్రియురాలికి అడ్డుగా ఉన్న గయ్ భార్యను బ్రూనో చంపాలి అన్నది ఆ ఒప్పందం సారాంశం. గయ్ ఈ మాటల్ని పెద్దగా పట్టించుకోడు… తరువాత అతని భార్య ని నిజంగానే బ్రూనో చంపేసి అతనికి చెప్పేదాకా. అక్కడి నుండి బ్రూనో గయ్ ని వెంటాడుతూ ఉంటాడు…. మా నాన్న ని ఎప్పుడు చంపుతావు అని. కథ ఇలా సాగి చివరికి గయ్ నిర్దోషిత్వం బయట పడ్డం తో ముగుస్తుంది. అయితే, సినిమా లో బాగా మనల్ని ఆకర్షించేవి రెండు. హిచ్‍కాక్ మార్కు స్క్రీన్‍ప్లే, బ్రూనో నటన. అతని నవ్వు లో నే ఎంత క్రూరత్వం చూపాడంటే, అతని బాడీ లాంగ్వేజ్ లోనే ఎంత విలనీ చూపాడంటే - అతని కోసం ఆ సినిమా మరోసారి చూడవచ్చు. క్లైమాక్స్ సీన్ ఒక్కటి కాస్త నిరాశ కలిగించవచ్చు కానీ, మిగితా అంతా చాలా బాగుంది ఈ సినిమా.

Vertigo: నాకు సంబంధించి ఇది గత రెండు, మూడేళ్ళుగా ఎదురుచూసిన సినిమా. ఓ సారెప్పుడో మా తమ్ముడు ఈ సినిమా చూసి నాకు కథ చెప్పేసాడు. అయినప్పటికీ కూడా నాకు ఈ సినిమా చూడాలి అన్న కోరిక తగ్గలేదు. ఇది మరో విలక్షణమైన కథ. హీరో కి పైన్నుంచి కిందకి చూస్తే కళ్ళు తిరిగే జబ్బు ఉంటుంది. అదే వర్టిగో. ఈ జబ్బు వల్లే సినిమా మొదట్లో హీరో తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా ఇస్తాడు. హీరో ని అతని స్నేహితుడు తన భార్య పై నిఘా కు నియమిస్తాడు వర్తమానం లో. క్రమంగా మన హీరోగారికి ఆవిడపై ప్రేమ ఏర్పడుతుంది. ఆవిడ ఓ సంధర్బం లో ఓ భవనం పైన్నుంచి దూకేస్తుంది. తన వర్టిగో వల్ల హీరో ఆమెను కాపాడలేకపోతాడు. తరువాత కొన్ణాళ్ళకు ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ సమయం లో ఆమె లాంటి మరో మనిషి తారసపడుతుంది హీరోకి. ఇక ఆమె వెంటపడ్డం మొదలుపెడతాడు. మిగిలిన కథ నా నోటితో నేను చెప్పేసి “ఎందుకు చెప్పేసావ్?” అని అనిపించుకోను. కావాలంటే ఇక్కడ చూడండి. లేకుంటే…ఉత్తమ మార్గం - ఆ సినిమా చూడండి.

The seven Samurai: అకిరా కురొసావా జాపనీస్ సినిమా. ప్రపంచం లోని కొన్ని ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా దీనికి పేరు. యాభైలలో తీసిన బ్లాక్ అండ్ వైట్ సినిమా. నా అభిమాన నటుడు Toshiro Mifune కూడా ఉన్నాడు :) ఇది ఓ బీద పల్లె కథ. ఆ పల్లె వారు బందిపోట్ల బారి నుండి కాపాడుకోడనికి సమురాయ్ ల సాయం తీసుకోవాలని నిశ్చయించుకుంటారు. సమురాయ్ ల వేట, వాళ్ళకి తిండిపెట్తడం కోసం వీళ్ళ కష్టాలు, వీళ్ళు ఆ దోపిడీ దొంగల్ని ఎదుర్కున్న తీరు, మధ్యలో ఓ లవ్‌స్టోరీ… ఇదీ కథ. ఎటొచ్చీ, What stands out is the screenplay. కురొసావా సినిమాలు పరిచయమయ్యాక ఇప్పటి దాక నచ్చని సినిమా అంటూ ఏదీ తారసపళ్ళేదు ఆయనది. సో, Needless to say, even this was a watchable movie. మరో పాయింట్… తొషీరో మిఫునె నటన. ఇతనో అధ్భుతమైన నటుడు…. ఏ రోలైనా అలవోకగా నటించేస్తాడు…అదే…జీవించేస్తాడు. ఇతనిలా ఇంకోళ్ళు చేయలేరు అంటే బహుశా అతిసయోక్తి కాదేమో…

నిజానికైతే ప్రతి సినిమా గురించీ ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు…. ఎటొచ్చీ ఇక్కడ నాకు ప్రస్తుతం 3 సమస్యలు..
1. సమయాభావం.
2. ఏదో మందుల్లేని రోగంతో దాదాపు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న నా Internet connection.

3. ఆల్రెడీ చనిపోయి, ప్రస్తుతం ఆత్మ రూపం లో నాకు సేవలందిస్తున్నా నా RAM.

అందువల్ల, ఈ సారికి ఇలా సరిపెట్టేసుకోండి.

త్యాగయ్య ఆనంద భైరవి - రుద్రవీణ బిలహరి
ఆ టైటిల్ చూసి నేనేదో రాసేస్తున్నా అని ఊహించకండి. నాకేం సంబంధం లేదు మీ అంచనాలతో. నేను పొద్దున్నే లేచి ఏమీ తోచక - “త్యాగరాజు భక్త సుధార్ణవము-నామజప రూపక కృతులు” అన్న మరువూరు కోదండరామిరెడ్డి గారి సంకలనాన్ని తెరిచాను. పుస్తకం మొదటి కొన్ని పేజీలూ త్యాగయ్య చరిత్ర ఉంటేనూ… కాసేపు చదివాను. అక్కడ చదివిన ఓ ఆసక్తి కరమైన సంఘటననూ, ఆ సంఘటన నాకు గుర్తు తెచ్చిన ఓ సినిమా సీనునూ ఇక్కడ పంచుకోడం ఈ టపా ఉద్దేశ్యం…అంతే…మరింకేం ఖాదు. టైటిల్ చూసి కొందరు విషయమేమిటో కూడ కనిపెట్టేసి ఉండొచ్చు.

ఇంతకీ… 203 రాగాలు పాడారట త్యాగయ్య…అందులో ఆనంద భైరవి మాత్రం లేదట. ఎందుకో? అంటే… ఇదీ కథ… త్రిభువనం స్వామినాథ అయ్యరు అని కుంభకోణం లో పెద్ద విద్వాంసుడు ఉండేవాడట. ఆనందభైరవి రాగం ఆలపించడం లో ఆయన్ని మించిన వాడు లేడు అని పేరు పొందాడట. ఓసారి అతని జట్టు తిరువయ్యూరు వచ్చిందట. త్యాగయ్య అతని ప్రఖ్యాతి విని అతని ప్రదర్శన కి వచ్చాడట. అప్పుడు అతను ఆనందభైరవిలో “మధురానగరిలో…” అన్న పాట పాడగా విని పరవశుడై అందరిముందూ స్వామినాథయ్యర్ భుజం తట్టి కౌగిలించుకున్నాడట. ఇది చూసి సంతోషించాల్సిన విషయమే అయినా, అప్పుడు అతను త్యాగయ్య ని - ఇకపై ఆనందభైరవి పాడవద్దనీ, తన పేరు నిలుపమనీ అర్థించాడట!!! ఈ కారణంగా త్యాగయ్య ఎప్పుడూ ఆనందభైరవి లో పాడలేదట!

ఇదంతా చదువుతూ ఉంటే నాకు రుద్రవీణ సినిమాలో ఓ సీను గుర్తొచ్చింది…. రమేష్ అరవింద్ కి, జెమినీ గణేశన్ కూతురికి పెళ్ళి జరుగుతున్నప్పుడు పాత కోపాన్ని దృష్టిలో పెట్టుకుని అరవింద్ “బిలహరి” గణపతి శాస్త్రి గా ప్రసిద్ధి చెందిన గణపతి శాస్త్రి పాత్ర వేసిన గణేశన్ ని - ఆ బిలహరి రాగాన్ని కట్నంగా ఇవ్వమని అడుగుతాడు. అంటే, ఇంకెప్పుడూ, ఎక్కడా ఆయన ఆ రాగం పాడరాదన్నమాట. తర్వాత చిరంజీవొచ్చి “నీతోనే ఆగేనా ..” అంటూ పాడి ఆయన గౌరవం నిలబెడతాడు అనుకోండి… అది వేరే విషయం.

పై రెండూ చూసాక ఒక సందేహం వచ్చింది. ఈ సినిమా సంఘటన ఆ నిజ జీవితపు సంఘటన నుండి స్పూర్తి పొందిందా అని… అంటే…అదేమీ పెద్ద విషయం కాదు కానీ…. త్యాగయ్యకి అలా జరిగింది అన్న విషయం మాత్రం కొత్తగా ఉంది నాకు వినడానికి.

తేనె మనసుల్లో నీ ఎదుట నేను వారెదుట నీవు పాట నాకు నచ్చిన పాటల్లో ఒకటి. కొన్ని చిన్నతనంలో విన్న పాటలైనా ఎందుకో మనసుకి హత్తుకుపోతాయి. ఈ పాట అలాంటిదే. ఈ పాట సంగీతం, సాహిత్యం రెండు మంచి ముత్యాలైతే సాహిత్యం వైపు ఇంకొంచెం ఎక్కువ మొగ్గుతాను. మొదటి లైన్‌లోనే చూస్తే "నీ ఎదుట నేను వారెదుట నీవు" - నీ ఎదుట నేను అని తన విషయంలో మొదటి స్థానం చందమామకి ఇచ్చినా కాబోయే భర్త విషయం వచ్చేసరికి వారెదుట నీవు అనే అంటుంది ఆ అమ్మాయి. వారి ఎదుట నీవు అంటుంది చందమామతో. వారెదుట వీరున్నా, వీరెదుట వారున్నా, రెండూ ఒకటే అయినా భర్తకి మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాతే ఇంకెవరైనా అన్న ఆలోచన సాహిత్యంలో అంత సున్నితంగా చెప్పటం చాలా నచ్చింది నాకు. అఫ్‌కోర్స్ ఎదురుగా ఉండటం అంటే ముందు ఉండటం కదా సో చంద్రుడికే మొదటి స్థానం ఇచ్చినట్టు కదా అనచ్చు. పర్సెప్షన్

ఎప్పటి నించో ఈ పాట కోసం వెతుకుతున్నాను. మరెందుకు ఆంధ్రావిలాస్‌లో కనిపించలేదో నాకు.

సిరివెన్నె(ఎ)లా?

ये जिंदगी నడవాలంటే हस्ते हस्ते
నదిలో దిగీ ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తే
चल चकदे चकदे అంటే పడినా లేచొస్తామంతే
హకూనా మటాటా అనుకో తమాషగా తలవూపీ
వెరైటీగా శబ్దం విందాం అర్ధం కొంచెం సైడ్ కి జరిపి
అదే మనం తెలుగు లో అంటే, dont worry bee haapee
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి ...

ఆగండాగండి.. సీతారామ శాస్త్రి గారు.. ఏమిటండీ ఇది? "dont worry be happy" అనే వాక్యాన్ని తెలుగు అనుకోమంటారా (మళ్ళీ "మన" తెలుగు అని కూడా అన్నారు)? మీరు రాసింది త్రివిక్రమ్ తిరగారాశాడా లేక దేవిశ్రీ దిద్దుబాటు చేశాడా లేక మీకే అలా అనిపించిందా?? బాగుంది!! :).
.

హకూనా మటాటా అనుకో తమాషగా తలవూపీ
వెరైటీగా శబ్దం విందాం అర్ధం కొంచెం సైడ్ కి జరిపి
అదే మనం తెలుగు లో అంటే, dont worry bee haapee
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి ...

deeniki ardam naaku telee ledu.. enta prayatnichinaa :-(

avunoo.. devisri, trivikram kaakundaa meeku pawan influence kanipinchadam ledaa?? ;-)


అదేదో సరదాపాట రాసేరు శాస్త్రిగారు. పాట బాగానే వుంటుంది లెండి.. జల్సా సినిమాలోది. వినండి - బాగున్నాయి పాటలు. "అదే మనం తెలుగులో అంటే" అన్నారు కదా అని నేను దానిని కొంచెం tweak చేసి, "అదే మనం మన తెలుగు లో అంటే" అని మార్చాను అన్నమాట అభిప్రాయసౌలభ్యం కోసం :). నా పాయింటు ఏమిటంటే, ఆయన ఇంగ్లీష్ వాక్యాన్ని పట్టుకొచ్చి తెలుగు అనేసుకోమని అంటున్నారు అని. నిన్న ఎక్కడో వింటూ వుంటే తగిలింది సరదాగా బ్లాగేను. కవి నిరంకుశుడు కదా - ఆయన ఇష్టం వచ్చినట్టు వ్రాస్తాడు. నాకు ఇష్టం లేకపోతె వినకూడదు కామోసు :).

పవన్ కళ్యాన్ రెండు చేతులూ, (అప్పుడప్పుడు రెండు కాళ్ళు కూడా) కధలోను, కధనం లోను, ఇరుక్కొని పోయి వుంటాయి కాబట్టి ఈ సాహిత్యం లో పెట్టి వుండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ, చెప్పలేము.. Too much of free time వుంటే ప్రమాదం కదా.
రామ-శాంతి లు భార్యా భర్తలు. (ఇంగ్లీష్ లో) ఆవిడ పేరులో మొదటి నాలుగు అక్షరాలు, ఈయన పేరులో మొదటి నాలుగు అక్షరాలు ఒకటే అని, ఆవిడ పేరు మీద బ్లాగ్ పెట్టుకొంటే ఈయన వచ్చి చేరిపోయాడు అన్నమాట. ఈ బ్లాగ్ లో తిట్టు కామెంట్ లు ఏమైనా వస్తే "నీ వల్లే" అంటే "నీ వల్లే" అని అనుకోవడానికి వీలుగా, బ్లాగ్ లో వ్రాసిన అన్ని విషయాలకి ఇద్దరూ సమానం గా బాధ్యత వహిస్తారు. మా అబ్బాయికి ప్రస్తుతం ఎనిమిది నెలలే కాబట్టి, వాడి మీదకి తోసేయ్యడానికి లేదు :).