Pages

Subscribe:

Tuesday, July 22, 2008

orkut Friends

మన దేశం గురించి వెటకారంగా ఒక కథ చెబుతొంటారు కొందరు.ఒకసారి జపాన్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే చిన్న సూదిని తయరుచేస్తే మనవాళ్ళు దాని మీద Made in India అని రాసుకొన్నారని,ఈ మాటలో వేటకారాన్ని పక్కన పెడితే అసలు అంత చిన్న సూది మీద అని రాసారంటే మనవాళ్ళు ఇంకా సన్నని సూదిని తయారుచేసి దానితో రాసారన్నమాటే కదా.

అలాగే C-Brain వైరస్ మన వాళ్ళు కనిపెత్తకొపొయిన దాన్ని తొలగించే Red alert ను మనవాళ్ళే కనిపెట్టారని చదివినట్టు గుర్తు.

ఇంతకీ ఇదంతా ఏందుకు చెబుతున్నానంటే,సోషల్ నెట్వర్కింగ్ లో ప్రభంజనమైన ఆర్కుట్ను వెబ్ పేజ్ లోకి వెళ్ళకుండానే మన డేస్క్ టాప్ నుండి వాడుకొనేందుకు మన భారతీయుడోకరు ఒక టూల్ తయారుచేశారు కాబట్టి ,కావాలంటే కింది బొమ్మలు చూడండి.


ఈ Software పేరు scrape mate.ఇది install చేసుకొంటే,మన Desktop నుండే Orkut కి Login కావచ్చు.
మన orkut Friends listలో ఉన్న photos అన్ని పైన చూపించినట్టు మన Desktop మీదే ప్రత్యక్షమవుతాయి.
అప్పుడు మనకు కావలసిన photo మీద click చేసి scrap రాసుకోవచ్చు.
"S" అక్షరం పక్కనున్న Arrow marks తో మన friends list లోవున్న contacts అన్ని Navigate చేసుకోవచ్చు.

ఈ tool తయారుచేసిందిశ్రీనివాస్ అన్నం .ఈ software ను అతని blog నుండే download చేసుకొవచ్చు.ఇది పనిచేయాలంటే AIR తప్పనిసరి.

0 Comments:

Post a Comment