Pages

Subscribe:

Tuesday, July 22, 2008

సిల్లీ పాయింట్‌

పేకముక్కల్లో కళావర్‌ రాజు, ఇస్పేట్‌ రాజు చేతుల్లో కత్తి కిందకి దించి ఉంటుంది. ఆఠీన్‌ రాజు చేతులు రెండూ కోటును పట్టుకున్నట్టుగా ఉంటాయి కానీ మెడ వెనగ్గా ఒక కత్తి కన్పిస్తుంటుంది. డైమండ్‌ రాజు చేతిలో గొడ్డలి ఉంటుంది.

* ఆనియన్‌(ఉల్లిపాయ) అనేది లాటిన్‌ పదం. ఆ పదానికి అర్థం... 'పెద్దముత్యం' అని.
* మానవశరీరంలో ఇతరభాగాలపై ఉన్న వెంట్రుకల కన్నా గడ్డం మీది వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి.
* గుర్రాలూ, ఎలుకలూ వాంతి చేసుకోవు.
* మనిషి కాళ్లల్లో 2,50,000 చెమటగ్రంథులు ఉంటాయి.
* ఒక అధ్యయనం ప్రకారం సెలబ్రిటీలతో శృంగారమే అంతర్జాతీయంగా అత్యధికులు కనే కల.
* ఒక గంటసేపు టైపింగ్‌ చేస్తే 110 క్యాలరీలు ఖర్చవుతాయి.




కథల్లోనూ యానిమేషన్‌ చిత్రాల్లోనూ ఉండే కల్పిత పాత్రల మీద వోజుతో ఆయా క్యారెక్టర్ల దుస్తులను ధరించడాన్ని 'కాస్‌ప్లే' అంటారు. దీనికి ఆద్యులు జపనీయులు. కాస్‌ప్లే అంటే కాస్ట్యూమ్‌ప్లే అని అర్థం. ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్లు కాస్‌ప్లే కిందకు రావు.
* శరీరంలో మరే ఇతర భాగంకన్నా నాలుకపైనే అత్యంత సున్నితమైన నరాలుంటాయి.
*అమెరికా తర్వాత సరికొత్త సాఫ్ట్‌వేర్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఐర్లాండ్‌.
*పదిహేడో శతాబ్దం తొలినాళ్లలో థర్మామీటర్‌లో పాదరసానికి బదులు బ్రాందీని పోసేవారట.


హ్యారీపోటర్‌ సిరీస్‌ పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ మంది చదివినట్టు ఒక సర్వేలో తేలింది.
* స్విమ్‌సూట్లన్నీ బికినీలు కావు. రెండుముక్కలు(టూపీసెస్‌) ఉంటేనే దాన్ని బికినీ అనాలి. త్రీపీసెస్‌ ఉంటే అది 'ట్రికినీ'. పై నుంచి కిందదాకా ఒకటే ఉంటే అది 'వోనోకినీ'.
* ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు సగటున ఆరుసార్లు మూత్రవిసర్జన చేస్తాడు.
* ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య కేసులు మహిళల్లో కన్నా పురుషుల్లో మూడింతలు ఎక్కువ. కానీ... ఆత్మహత్యా ప్రయత్నాలు పురుషుల్లో కన్నా మహిళల్లో మూడురెట్లు అధికం.
* ఒక పూర్తి సీడీలో దాచి ఉంచిన సమాచారాన్ని దారం రూపంలోకి మార్చగలిగితే అది మూడున్నరమైళ్ల పొడవుంటుంది.
* వైట్‌ హౌస్‌లో 59 సీట్ల మినీ థియేటర్‌ ఉంది.


*మీసమున్న ఆఖరి అమెరికన్‌ అధ్యక్షుడు టాఫ్ట్‌.

0 Comments:

Post a Comment