Sunday, August 9, 2009
"జీవితంలో విషాదం వుండాలి అప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది,నవ్వులోంచి విషాదం పుట్టాలి "
ఓ సినిమా విడుదలైంది ,చూసిన జనమంతా గొల్లున నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు "రేలంగోడెం చేశాడ్రా" అని చెప్పుకుని మరి మరి నవ్వుకుంటున్నారు ,అదే జనం మళ్ళి మళ్ళి ఎగబడుతున్నారు,రెండో రోజూ రేలంగి అలా ఆకర్షించాడు , ఆకట్టుకున్నాడు ,ఆనందం పంచాడు ,సినిమాల్లో బంగారం లాంటి నవ్వులు పండించిన రోజులవి ,సినిమా బాగున్నా లేకపోయినా రేలంగుంటే సరే సరి ,సినిమా హాస్యానికి రేలంగే హీరో .
ఈ రేలంగోడి వెనుక చాలా గోడుంది బాబూ!!! అని కథంతా చెప్పేవారు ,కష్టాలు చెప్పేవారు ,నాలాగా అందర్నీ కష్ట పడమని కాదు ,కష్ట పది పైకి వచ్చే
వాడికి సుఖ పడి పైకి వచ్చేవాడికి తేడా తెలుస్తూంది ,కష్టంలో వున్న మజా సుఖంలో వుండదు ,అని సూత్రాలు చెప్పేవారు రేలంగి నవ్వుతూ.....
చిన్న తనం నుండి తను నాటకాలు వేయడం, వుంటే తినడం ,లేకపోతే గాలి తినడం గాలి కూడా అయిపోతే గోళ్ళు కొరుక్కోవడం అంతే.... తండ్రి సంగీతం మాస్టరు ,హరి కథలు చెప్పేవారు ,అది "ప్రమాదించింది " ,రేలంగికి పాట మీద కి
మనసు మళ్ళింది ,గాలి పాట వచ్చింది ,అది అలా మాటలోకి దించింది.చదువు మాట దేవుడెరుగు ,పాట దేవుడిలా పరిణమించింది..
కాకినాడ యంగ్ మన్స్ హ్యాపీ క్లబ్‌లోకి దిగి పోయి పౌరాణికాల్లో పద్యాలు చదువుతూ పాటలు పాడుతూ జీవితం వెతుక్కున్నాడు ,ముందు ఆడ వేషాలు వేశాను ,తరువాతే మగ వేషం వచ్చింది ఆ వేషం ఎం చేశానో ఎం చెప్పానో ప్రేక్షకులు నవ్వారు ,
"అరె నవ్వారే!!! వహ్వారే నే
నవ్వులు పంచగలనన్నమాట " అనుకున్నారట .
సినిమాలు ఎక్కువగా బొంబాయి లో తీస్తారని అక్కడి స్టూడియో ల పేర్లు తెలుసుకుని వెంకటరామయ్య ఇంగ్లీషులో వుత్తరాలు రాసేవారట "
my name is r R.Venkataramayya I am see your picture , i am want to act , give me chance sir reply sir "
అని తన ఎత్తు బరువు వయసు రాసి పోస్ట్ చేసేవారట . "నాకు జవాబు ఎందుకు వస్తుందీ? నా ఎత్తు బరువు వున్న వాళ్ళు బొంబాయి లో లేరూ? ఏదో తెలీక ...అజ్ఞానం వుబలాటం ",అని తన ఇంగ్లీష్ ప్రజ్ఞ గురుంచి చెప్పేవారు .
బాల నాగమ్మ గొల్లభామ లలో తెలిసిన రేలంగి ఆ సినిమాల్ని చరో భుజం మీద పెట్టుకుని డొక్కు సైకిలు కొనుక్కుని ,దర్శక నిర్మాతల ఇళ్ళ చుట్టూ తిరిగే వాడు ,తిరిగి తిరిగి శోబనా చలపతి స్టూడియో కి వచ్చి ,ఓ చెట్టుకింద సైకిలు పెట్టి ,అక్కడికి వచ్చి పోయే వాల్లందిరికి సలాం కొడుతూ కాలక్షేపం చేస్తుండేవాడు
,పాత సైకిలు కాస్త "దిసాల్వ్" లో కొత్త సైకిలయ్యింది,కొత్త సైకిలు పాత కారయ్యింది ,పాతకారు పెద్దకారు అయ్యింది ,వెంకటరామయ్య రేలంగి అయ్యాడు ,చిన్నతనంలో వేళకి తినకా ,నిద్రపోకా ఎలా తిరిగానో ఏమిటో గాని ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతీసింది " అని తన మీద తనే జోక్ చేసుకునే వాడు ,.....
ఆ రోజుల్లో తిందామంటే వేరుశనక్కాయలు కుడా కొనుక్కోలేక పోయేవాన్ని ,కాని ఇప్పుడి ఇంత సంపద వున్నా తినాలంటే వేరుశనక్కాయలు కూడా అరగడం లేదు ...అని ఎప్పుడూ సైలంట్ ఎరుగని రేలంగి పైమాటగా అనేవారు...
మద్రాసులో జర్నలిస్టులంతా కలిసి ఓ సారి ఆయనకు ఘన సత్కారం ఏర్పాటు చేశారు ,సన్మానానికి వెళ్ళే ముందు సర్ మిమ్మల్ని ఏనుగు మీద తీసుకెళతాం," అన్నారు అపుడు రేలంగి మొహం అదోలా పెడితే " చాలా మంచిదండి - గజారోహణం జరుగుతుంది " అని అన్నాడో మిత్రుడు అప్పుడు మరి మావటి వాడు ఎప్పుడు ఎక్కుతూనే వుంటాడే " అని
నవ్వించారు ఆయన.......
చివరగా ఓ గున్న ఏనుగు మీద వూరేగింపు మొదలైతే " పాండి బజార్లోనుండి తీసుకెళ్ళండి ,ఆ బజార్లో మనం ఎండనకా వాననకా చెప్పులు లేకుండా తిరిగాము ఇప్పుడు ఏనుగు మీద వెళుతుంటే బజారు సంతోషిస్తుంది " అని నవ్వించారు రేలంగి .
సినిమా హాస్య నటుల్లో భారత దేశం మొత్తం మీద పద్మశ్రీ అందుకున్న మొట్ట మొదటి నటుడు రేలంగి ,సునిశితమైన హాస్యం రేలంగిది,అంటారు అయన గురించి తెలిసినవాళ్ళు ,ఆయన శైలి ఆయనదే జీవితలో విషాదం వుండాలి అప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది,నవ్వులోంచి విషాదం పుట్టాలి ,రెండూ వొకటే అనిపిస్తుంది నాకు అంటారు రేలంగి .
రేలంగి ముఖంలోనే హాస్యముంది ,క్షణంలో రేఖలు రంగులు మార్చగల ఘనాపాటి.....
గమనం ఓ నిరంతర సంగ్రామం
ఇది ఓ సుదీర్గ పయనం...
ఇది ఓ సుదీర్గ పయనం...
thank u for visiting...
visit again
by
ARADHANA
Labels: మహామహుల జీవితాలు
Subscribe to:
Posts (Atom)