Pages

Subscribe:

Sunday, July 20, 2008

స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా
కడదాక జీవితాన నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిది..నీ శ్వాసగా నిలిచేటిది ఈ
స్నేహమొకటేనురా....

తులతూగే సంపదలున్నా స్నేహానికి సరికావన్నా
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిరారన్నా
మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని సంపద రా
ఆ స్నేహమే నీ ఆస్థి రా నీ గౌరవం నిలిపేనురా సందేహమే
లేదురా

స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా

త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం
ప్రాణనికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది స్నేహము రా
ధ్రువ తారగా స్థిరమైనది ఈ జగతిలొ విలువైనది ఈ
స్నేహమొకటేనురా...

స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా.

Powered by eSnips.com

చిత్రం : 20 వ శతాబ్దం




పల్లవి:

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎద వీణపై మన కధ మీటగా
నీ ఎద వీణపై మన కధ మీటగా
అనురాగాల రాగావిరానా నూరేళ్ళ బంధాన్ని కానా
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం

చరణం1:

వేదంలో స్వరంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా
స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై
గతజన్మ బంధాలు నేడు జతగూడి రావాలి తోడు
గగనాల పందిళ్లలోనా సగభాగమవుతాను నీకు
ఇక సుముహూర్త మంత్రాలలోనా శృతి చేయి అనురాగ వీణ

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

చరణం2:

ఈనాడే ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే
లోకాలే జయించే మనస్సే నీకొసం నిజంగా తపించే
సరసాల సమయాలలోనా మనసార పెనవేసుకోనా
అణువైన నా గుండెలోనా కడదాక నిను దాచుకోనా
ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా పరువాలు పండించుకోనా

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎద వీణపై మన కధ మీటగా
నీ ఎద వీణపై మన కధ మీటగా
అనురాగాల రాగావిరానా నూరేళ్ళ బంధాన్ని కానా
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం


మాతృదేవోభవ
తారాగణం :మాధవి,నాజర్,తనికెళ్ళ భరణిగాత్రం :కీరవాణి
సాహిత్యం :వేటూరి
సంగీతం :కీరవాణి
నిర్మాత :కె.ఎస్.రామారావు
దర్శకత్వం :కె.అజెయ్ కుమార్i
viడుదల :1993

పల్లవి:

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే , తొటమాలి నీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే , లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా ,కలికి మాచిలక పాడకు నిన్నటి నీ రాగం
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే , తొటమాలినీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లోకమెన్నడో చీకటాయెలే

చరణం1:

చెదిరింది నీ గూడు గాలిగా చిలకగోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా ఆ ఆ ఆఅ
తనవాడు తారల్లో చేరగా మనసుమాంగల్యాలు జారగ
సిందూరవర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతివై
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే

చరణం2:

అనుబంధమంటేనె అప్పులే కరిగే
బంధాలన్ని మబ్బులేహేమంతరాగాల చేమంతులే వాడిపోయే ఆ ఆ
తనరంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలు కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే , తొటమాలి నీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే , లోకమెన్నడో చీకటాయెలే ఏ ఏ


మాతృదేవోభవ
తారాగణం :మాధవి,నాజర్,తనికెళ్ళభరణి
గాత్రం :చిత్ర
సాహిత్యం :వేటూరి
సంగీతం :కీరవాణి
నిర్మాత :కె.ఎస్.రామారావు
దర్శకత్వం :కె.అజెయ్ కుమార
viడుదల :1993

పల్లవి:

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
మమతలన్ని మౌనగానం వాంఛలన్ని వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
మాతృ దేవొ భవ.. పితృ దేవొ భవ.. ఆచార్య దేవొ భవ

చరణం1:

ఏడుకొండలకైనా బండతానొక్కటే ఎడు జన్మల తీపి ఈ బంధమే
ఏడుకొండలకైనా బండతానొక్కటే ఎడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలొ నలక లో వెలుగు నేకనక నేను నేననుకుంటె ఎద చీకటె హరీ హరీ హరీ
రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏనాటికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి

చరణం2:

నీరు కన్నీరాయె ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగమారె నాగుండెలో ఆ ఆ ఆ
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగమారె నాగుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబందాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
రెప్పనై వున్నాను నీకంటికి పాపనై వస్తాను నీఇంటికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికిగాలినై పోయాను గగనానికి.......