Pages

Subscribe:

Sunday, July 20, 2008


మాతృదేవోభవ
తారాగణం :మాధవి,నాజర్,తనికెళ్ళ భరణిగాత్రం :కీరవాణి
సాహిత్యం :వేటూరి
సంగీతం :కీరవాణి
నిర్మాత :కె.ఎస్.రామారావు
దర్శకత్వం :కె.అజెయ్ కుమార్i
viడుదల :1993

పల్లవి:

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే , తొటమాలి నీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే , లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా ,కలికి మాచిలక పాడకు నిన్నటి నీ రాగం
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే , తొటమాలినీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లోకమెన్నడో చీకటాయెలే

చరణం1:

చెదిరింది నీ గూడు గాలిగా చిలకగోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా ఆ ఆ ఆఅ
తనవాడు తారల్లో చేరగా మనసుమాంగల్యాలు జారగ
సిందూరవర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతివై
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే

చరణం2:

అనుబంధమంటేనె అప్పులే కరిగే
బంధాలన్ని మబ్బులేహేమంతరాగాల చేమంతులే వాడిపోయే ఆ ఆ
తనరంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలు కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే , తొటమాలి నీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే , లోకమెన్నడో చీకటాయెలే ఏ ఏ


మాతృదేవోభవ
తారాగణం :మాధవి,నాజర్,తనికెళ్ళభరణి
గాత్రం :చిత్ర
సాహిత్యం :వేటూరి
సంగీతం :కీరవాణి
నిర్మాత :కె.ఎస్.రామారావు
దర్శకత్వం :కె.అజెయ్ కుమార
viడుదల :1993

పల్లవి:

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
మమతలన్ని మౌనగానం వాంఛలన్ని వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
మాతృ దేవొ భవ.. పితృ దేవొ భవ.. ఆచార్య దేవొ భవ

చరణం1:

ఏడుకొండలకైనా బండతానొక్కటే ఎడు జన్మల తీపి ఈ బంధమే
ఏడుకొండలకైనా బండతానొక్కటే ఎడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలొ నలక లో వెలుగు నేకనక నేను నేననుకుంటె ఎద చీకటె హరీ హరీ హరీ
రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏనాటికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి

చరణం2:

నీరు కన్నీరాయె ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగమారె నాగుండెలో ఆ ఆ ఆ
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగమారె నాగుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబందాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
రెప్పనై వున్నాను నీకంటికి పాపనై వస్తాను నీఇంటికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికిగాలినై పోయాను గగనానికి.......

0 Comments:

Post a Comment