Saturday, July 19, 2008
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కధగానే రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో.....మరుజన్మకైనా కలుసుకో
ఏనాడు ఏమవుతున్నా ,ఏ గూడు నీదవుతున్నా హయిగానే పాడుకో
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కధగానే రాసుకో
జీవితం నీకోసం స్వాగతం పలికింది
ఆశాలే వెలిగించి హారతులు ఇస్తుంది
ఆకాశమంత ఆలయం నీకోసం కట్టుకుంది
కల్యాణ తొరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది
స్నేహం పెంచుకుంటుంది,ప్రేమే పంచుకుంటుంది కాలం కరిగి పోతుంటే కలగా చెదిరి పోతుంది
మాసిపోని గాయమల్లే గుండెలోనె వుంటుంది
చిన్నారి స్నేహమా......
ఆశయం కావాలి ఆశలే తీరాలి
మనిషిలో దేవుడిని మనస్సుతో గెలవాలి
అందాల జీవితానికో అనుబంధం చూసుకో
అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో
లోకం చీకటవుతున్నా ,బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మమతే వెలుగు చూపాలి
మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కధగానే రాసుకో
మనసైతే మళ్ళి చదువుకోమరుజన్మకైనా కలుసుకో
ఏనాడు ఏమవుతున్నా ,ఏ గూడు నీదవుతున్నా హయిగానే పాడుకో
Powered by eSnips.com |
Labels: సాహిత్యం
ఈ రోజు నేను చిన్నప్పుడు చదువుకున్న బడి నుండి ఫోన్ వచ్చింది- 19th April పూర్వ విద్యార్ధుల సమ్మేళనం వుంది అని. దానికోసం ఏదైనా మంచి Program చెయ్యమని కూడా చెప్పారు. ఈ పాట కోసం వెతుకుతుంటే మీ బ్లాగ్ లో దొరికింది. సంతోషం. ఓ మంచి కార్యక్రమానికి మీ బ్లాగ్ ద్వారా కూడా సహాయం అందింది. థాంక్స్ చెప్పకుండా మీ బ్లాగ్ ని వదలడం ఇష్టం లేక కామెంట్ రాస్తున్నాను.
మరో సారి ధన్యవాదాలు.
సతీష్ కుమార్ యనమండ్ర