Pages

Subscribe:

Tuesday, February 17, 2009

అవును మన పాత పాడు బంగ్లా సినిమాలో కనిపించింది ,కర్నూలు జిల్లా బనగాన పల్లె సమీపంలో వున్న యాగంటి గొప్ప శైవ క్షేత్రము , ఇక్కడి గుహలు చాలా ప్రసిద్ది ,ఈ క్షేత్రము చేరుకునే దారిలోనే పాత పాడు గ్రామములో ఈ బంగ్లా కనిపిస్తుంది, నవాబుల మజిలి కి చక్కని సాక్షిగా కొండపై మనకు దర్శనమిస్తుంది ,ఎన్నో సార్లు ఆ దారి గుండా ప్రయాణించిన నాకు ,ఈ బంగ్లా గురించి ఆశించిన మేర ఆదరణ లభించలేదని తెలిసింది ,



కాని ఇన్ని రోజులకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో గద్వాల్ సంస్తానముగా వెలిగింది ,అలనాడు బనగాన పల్లె నవాబు తన రాసలీల కోసం తన వుంపుడు గత్తె కోసము నిర్మించిన ఈ మహల్ నేడు సినిమాలో సంస్తానముగా కనిపించించింది .


ఈ మహల్ ని సినిమాలో చూపించినదుకు ధన్యవాదములు,ఫ్రెండ్స్ మీరెప్పుడైనా యాగంటికి వెళ్ళినప్పుడు ఈ మహల్ ను చూడటం మరచిపోకండి ,మన తాతల నాటి క్షేత్రాలని గ్రాఫిక్స్ లో చూసుకునే స్థితికి చేరుకోకుండా వుందాం .
పైకి ఇంత అందంగా కనిపించే ఈ మహల్ లో పైకప్పు శితిలావస్తలో వుండటం విశేషం............
thank you for visiting aradhana

2 Comments:

  1. పరిమళం said...
    nice!
    Anonymous said...
    "మన తాతల నాటి క్షేత్రాలని గ్రాఫిక్స్ లో చూసుకునే స్థితికి చేరుకోకుండా వుందాం".
    You said Right.
    Good post.

Post a Comment