Monday, February 23, 2009
ఈశ్వరుని అనుగ్రహానికి నాంది మహాశివరాత్రి
ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా సంవత్సరంలో పదకొండు మాస శివరాత్రులు వస్తే ఆ పదకొండింటి కంటే గొప్పదైన ఈ శివరాత్రి - అంటే -మాఘ మాస శివరాత్రి ' మహా శివరాత్రి (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) అవుతోంది .'మహా' అని ఎక్కడ అనిపించినా కొన్ని అలాంటి వాటికంటే గొప్పదని భావం . శివ పార్వతులిరువురికి కలిపి 'శివులు' అని పేరు ( శివ శ్చ శివా చ సివౌ ).ఆ ఇద్దరికీ సంభందించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం . అందుకే శివరాత్రి నాడు అయ్యకి - అమ్మకి కుడా వుత్సవం సాగుతుంది .శివ - మంగళకరమైన ,రాత్రి - రాత్రి ఏదో అది శివరాత్రి అనేది మూడో అర్థం .
ప్రాణికోటి యావత్తు నిద్రపోతూందే కాలం రాత్రి ,నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం.ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు .తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే మొదలవుతుంది.చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. చలి ,మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని కప్పుకుని వుండగా - పిశాచ ,భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన శంకరుడు,నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే.....
ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.
చివరగా ఈ మహాశివరాత్రి సందర్బముకు మీకు మీ కుటుంభ సభ్యులకు మీ మిత్రులకు ,మన బ్లాగరుల కుటుంబ శ్రేయోభిలాషులకు మరొక్కసారి మహా శివరాత్రి శుభాకాంక్షలు , అంతేగాక అందరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ పరమశివుని కోరుకుంటూ.......... సెలవు
మీ ఆరాధన

Labels: పర్వదినాలు
3 Comments:
-
- చిలమకూరు విజయమోహన్ said...
February 23, 2009 at 4:00 AMమీకుటుంబానిక్కూడా మా మహాశివరాత్రి శుభాకాంక్షలు.- mmkodihalli said...
February 23, 2009 at 8:18 AMమీకు,మీ కుటుంబానికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.- పరిమళం said...
February 23, 2009 at 10:50 AMమహా శివరాత్రి పర్వదిన విశేషాన్ని మాకు తెలియపరిచినందుకు ధన్యవాదాలు .మీకు,మీ కుటుంబానికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
Subscribe to:
Post Comments (Atom)