Pages

Subscribe:

Thursday, December 4, 2008

ఘంటసాల - ఆ పేరు వింటేనే తెలుగు వాడి గుండెల ఘంటలు గుడి ఘంటలు మొగినత శ్రావ్యమ్గా మోగుతాయి ,ఘంటసాల - ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండరని ఘంటా పతంగా చెప్పవచ్చు , తెలుగు వారి హృదయాలలో గాయకుడుగా, సంగీత దర్శకుడుగా చెరగని ముద్ర వేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1922లో డిసెంబర్‌ 4 గుడివాడ సమీపం లోని చౌటుపల్లి గ్రామం లో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు . భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మకేమో కానీ, ఘంటసాల గాత్రం మాత్రం తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోతుంది. ప్రజలకు ఆరాధ్యుడుగా, ఓ సంస్కృతికి చిహ్నంగా మాత్రం ఏ గాయకులూ లేరు. ప్రతి తెలుగు కుటుంబంతో పెనవేసుకొన్న గాత్రం ఘంటసాలది.
ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. ఆరేళ్ళపాటు గురువు పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ సాగింది. శాస్త్రిగారు సంగీతరావుగారి తండ్రి. తన తండ్రిని గురించిన విశేషాలు సంగీతరావు గారి వ్యాసాల్లో కనబడతాయి. అవి చదివితే గాయకుడుగా, సంగీత దర్శకుడుగా ఘంటసాలకు మార్గం చూపినది శాస్త్రిగారే ననిపిస్తుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు. శాస్త్రిగారి నుంచి ఘంటసాలకు శృతిశుద్ధి, నాదశుద్ధి, గమకశుద్ధి, తాళగత, స్వరగత లయశుద్ధి అలవడ్డాయి. పాటల్లో సాహిత్యం ముఖ్యమనే అవగాహన కలిగింది.
ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. విజయనగరం చేరిన ఘంటసాల వారాలు చేసుకుంటూ సంగీత కళాశాలలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్న సమయం లో పట్రాయని సీతారామశాస్త్రి గారు ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితముగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. వారాలు చేసుకుంటూ, మధుకరం(భిక్షాటన) చేసుకుంటూ సంగీత సాధన చేసి ద్వారం వెంకట స్వామి నాయుడి గారి చేతుల మీదుగా సంగీత పట్టా పుచుకున్నారు. సంగీత కళాశాల పట్టం పొంది విజయనగరం విడిచిపెట్టే తరుణంలో ఘంటసాల గారి కచేరి ఏర్పాటు కావడం, ఆదిభట్ల నారాయణ దాసుగారు తంబూరా బహూకరించడం ఘంటసాల జీవితం లో ఒక పర్వదినం. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు.


1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తానే తన పెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాలవారు ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి, కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాలవారు ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.ముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండు రూపాయలు చెల్లించి అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశలకోసం వెతికి రాత్రి ఆ పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల వారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు.
1951లో పాతాళభైరవి ,1953లో వచ్చిన దేవదాసు 1955లో విడుదలయిన అనార్కలి ,1955లో విడుదలయిన అనార్కలి ,1957లో విడుదలయిన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి.1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేష శైలవాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకుని అర్ధ శతాబ్దం పాటు తన పాటలతో ఆంధ్రుల మనసులని పరవసింపచేసారు .
ముద్దబంతి పూవులో...
నీవేనా నను పిలచినది...
శివశంకరి... శివానందలహరి...
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై...
దేవదేవ ధవళాచల...
ఘనాఘన సుందరా...
కుడిఎడమైతే...
జేబులో బొమ్మ...
తెలుగువీర లేవరా...
రాజశేఖరా నీపై...
కనుపాప కరువైన...
పాడాలని పాడేసిన పాటలు కావివి. ఒక్కో పాట ఆణిముత్యమనటంలో నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. సినిమా చూసినా చూడకపోయినా, ఆయన పాటలు వింటే చాలు, సినిమా చూసినట్లే అంటే అతిశయోక్తి కాదు. కవి వ్రాసిన కవిత్వాన్ని గొంతుతో చిత్రంగా ఆవిష్కరించగలిగిన నేర్పరి. అందుకే ఆయన, ఆయన గాత్రం అజరామరం.
ఘంటసాలగారి ఆరోగ్యం ఎప్పుడూ అంతంతమాత్రమే. పెద్ద రికార్డింగ్ ఏదైనా జరిగితే ఆ మర్నాడు ఆయన విశ్రాంతి తీసుకోక తప్పేదికాదని సావిత్రిగారు ఏదో సందర్భంలో చెప్పారు. ఎటొచ్చీ ఆయన ఇంకొన్నేళ్ళు జీవించినా తమిళంలో టి.ఎం. సౌందరరాజన్ లాగే రిటైర్ కావలసి వచ్చేదేమో. వయసుతో మారిపోయే గాత్రపటిమ కన్నా ఘంటసాలకు మొదటినుంచీ ఉండిన సంగీత సంస్కారమే గొప్పదని నేననుకుంటూ ఉంటాను.త్రిపురనేని మహారథి ఒక సంగతి చెప్పారు. రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన ఒక రికార్డింగుకు ఘంటసాల వెళ్ళి తయారుగా కూర్చున్నప్పటికీ రాజేశ్వరరావుగారు ఎంతకీ తన గదినుంచి బైటకు రాలేదట. ఘంటసాలగారు విసుక్కుంటూ ‘నేనింతమందికి పాడానుగాని రాజేశ్వర్రావుగారిలా ఇలా హింసపెట్టేవాళ్ళని ఎక్కడా చూళ్ళేదు’ అన్నాడట. దానికి మహారథి ‘దానికేముందండీ, పాడనని చెప్పి వెళ్ళిపోవచ్చుగా?’ అన్నాడట. వెంటనే ఘంటసాల ‘అమ్మమ్మమ్మ, ఎంతమాట? రాజేశ్వర్రావు రికార్డింగు మానుకోవడమా? అలా ఎన్నటికీ చెయ్యను’ అన్నారట. అది ఆయన వినయానికీ, సంస్కారానికీ కూడా మంచి ఉదాహరణ.

చలచిత్ర నేపథ్య సంగీత స్వరహేల
గంధర్వ మణిమాల ఘంటసాల
సంగీత సాహిత్య సరసార్ధ భావాల
గాత్ర మాధుర్యాల ఘంటసాల
పద్యాల గేయాల వచనాల శ్లోకాల
గమకాల గళలీల ఘంటసాల
బహువిధ భాషల పదివేల పాటల
గాన వార్నిధిలోల ఘంటసాల
కమ్ర కమనీయ రాగాల ఘంటసాల
గళవిపంచికా శృతిలోల ఘంటసాల
గాంగనిర్ఘర స్వరలీల ఘంటసాల
గాయకుల పాఠశాల మా ఘంటసాల।
1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండేనొప్పి రావటం తో కొంత కాలం విశ్రాంతి తీసుకుంటున్న సమయం లో భగవద్గీత చేయాలన్న ఆలోచన రావటం వెంటనే దాన్ని అమలుపరచడం జరిగాయి. ఈనాటికీ ఘంటసాల వారి భగవద్గీత ఒక ఆణిముత్యం. 1974 ఫిబ్రవరి 11న ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అర్ధశతాబ్దం పాటు మనలని తన గాన మాధుర్యం తో అలరించిన ఆ గొంతు మూగబోయింది. ఘంటసాల గారు మన అందరి హృదయాలలోనూ ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వారు అమరులు….వారు అమరులు….వారు అమరులు.
స్వరాల రారాజు

ఇందుమూలముగా మన బ్లాగ్గేర్లకు వో విషయం తెలియచేయాలి,ఈ టపా నా ఒక్క కృషితో రాసింది ఎంతమాత్రము కాదు ,ఇందులోని చాల అంశాలు ఇతర బ్లాగులు ,సైట్లు ,మరియు wikipidea నుంచి సేకరించడం జరిగినది ,అందుకు దయచేసి నన్ను క్షమించగలరు ,ఈ రోజు ఘంటసాల గారి జన్మదినం కాని జల్లెడ లో,కాని కూడలిలో గాని ఈయన గురించిన టపా లేదు ఇంతవరకు వేచి వుండిఇప్పుడు ఈ సాహసానికి ఓడిగాట్టాను ,క్షమించగలరు ....
THANKS TO VISIT ARADHANA

0 Comments:

Post a Comment