Pages

Subscribe:

Sunday, November 30, 2008

తెలుగు జాతి గర్వించదగ్గ కొద్ది మంది దర్శకులలో ఒకరైన కె. విశ్వనాథ్‌ సినిమాల నుండి జాలువారిన పాటల కదంబాన్ని ఆలపిస్తున్న ఈ చిన్నారుల గాన పారవశ్యానికి చూస్తె కోకిలలు సైతం అసుయపదగాలవేమో ...
క్షీర సముద్రాలున్నా హృదయానికెందుకో దాహంగానే ఉంటుందితన సప్త వర్ణాలతో భువిని అలంకరించాలని ఇంద్రధనుస్సు వ్రిదా ప్రయత్నం చేస్తుందినింగిని తాకలేనని తెలిసినా
కడలి కెరటం ఉంటుందినశిస్తానని తెలిసినా పిచ్చి పురుగు దీపం వైపే పరుగులు తీస్తుంది

గాన కోకిలలు

కోకిల గానంతో పరవశించిన విశ్వనాథుడి కదంబం


నేను సంగీతాన్ని అనుభవించగలవాడనే తప్ప శాస్త్రీయంగా తెలిసిన వాడను కాదు.రాగాల మాధుర్యాన్ని అనుభవించగలను తప్ప రాగాలు తెలియదు నాకు.స్వరాల తీయదనం గుర్తించగలను తప్ప స్వరూపం గ్రహించలేను.కానీ వారి గానం ప్రత్యక్షంగా వింటూంటే నా ఏదో తెలియని భావన కలుగుతుంది అన్నా అతిశయోక్తి కాదేమో ...

1.ఝుమ్మంది నాదం సైయ్యంది

పాదంతనువూగింది ఈ వేళచెలరేగింది ఒక

రాసలీలాఝుమ్మంది నాదం సైయ్యంది

పాదంతనువూగింది ఈ వేళాచెలరేగింది ఒక రాసలీల ....(ఝుమ్మంది నాదం)

౨---ఏ కులము నీదంటే గోకులము నవ్వింది,

మాధవడు, యాదవుడు మా కులమే లెమ్మంది...(సప్తపది )

4.ఆనతి నీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా సన్నిధి చేరగా హరా...
(స్వాతి కిరణం )

౫--కొత్తగా రెక్కలొచ్చిన..(స్వర్ణ కమలం ) sugandini
౬.వె వేల గోపెమ్మల మువ్వగోపలుడే నేయా ముద్దు గోవిందుదే
అహా అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల వేణువులూడదే మది వెన్నులు దోచాడే
(సాగర సంగమం )
చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తెలిశాక వచ్చేను నావంక
చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తెలిశాక గడిచాక ఇన్నాళ్ళకు కలిశాకఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక
ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక
ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక యేగసేను నింగి దాక
౬--జొలాజొలమ్మ జేజెల జోల జేజెల జోల
నీలాల కన్నులకు నిత్య మల్లె పూల జోల నిత్యామల్లె పూల
జోల ల్లొలాలళళలల హాయి పరుగు ల్ల్లోల్ళ్లాలాళ్లలల హాయి హాయే
(sutra darulu)

ఈ విధంగా విరిసినదీ వసంత కోకిలల గానం విశ్వనాథుని పల్లవిగా


thank u for visiting aradhana

ekkadiki nee parugu

ఆమె సంతకం చేసేటప్పుడు సావి౩ అని రాసేదట

Wednesday, November 26, 2008

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ దశలో వుంది అందులోని కొన్ని సన్నివేశాలు అనుకోకుండా కొన్ని నెట్లో దర్శనమిచాయి వాటిని మీ ముందుకు తెచే ప్రయత్నమే ....ఈ సినిమా కి ధీరుడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లుగా సిని వర్గాల భోగట్టా ...ఇక్కడ లభించిన సన్నివేశంలో రామ్ చరణ్ తేజ మీద ఓకే పోరాట సన్నివేశం అని కనిపిస్తుంది .....


మంచి హాలివుడ్ సినిమా తరహాలో నిర్ముస్తున్నట్లున్న ఈ సినిమా ఎ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచిచూడాల్సిందే ...


పూర్తిగా మంచు ఎడారిలో చిత్రీకరించిన ఈ సన్నివేశం చాల ఆసక్తి దాయకంగా వుంటుంది ,కాని ఇది ఇంకా ఎడిటింగ్ కార్యక్రమాలకు నోచుకోలేదు కనుక మూకీ సినిమా గా నే మనం చూసి తరించాలి



ధీరుడు



tariler 1 ని ఇక్కడ download చేసుకోగలరు


tariler 2 ని ఇక్కడ download చేసుకోగలరు


Thank you for visiting ARADHANA

Tuesday, November 25, 2008

FILM NAME : W\O వరప్రసాద్ 
నటి  నటులు   : వినీత్ అవని 
సంగీతం : కీరవాణి 
దర్శకత్వం : వంశీ 
నిర్మాత : వర్మ  CORPORATIONS

నేస్తమా!
ఎక్కడికి నీ పరుగు,ఎందుకని నీ ఉరుకు,నీకోసం నేనుండగా నీ మనసుకు అలజడి ఏంటలా?? .....నీ అలసట అంతా తీర్చగా నా ఒడిలొ లాలిస్తా కదా...

తీరని కల వి చెలి!

ఎక్కదికొ నా మజిలి?

జాడను చూపిన దేవరి,నువ్వు పాడిన తీయ్యని
జావళి.

వెలిగించావే కోమలి, నా చూపులలొ
దీపవళి.

గుండెల లొ నీ రూపం,వెళ్లదులె నన్ను
విడిచి.

తేరిచే ఉంచా వాకిలి,దయచెయ్యాలని నా
జాబిలి.

ముగ్గులు వేసిన ముంగిలి, అందిస్తున్నది
ప్రేమాంజలి.

నీ గుండెల్లొ చూడమ్మా, నేను లెనా ప్రతి మూలా???

నీ ఉపిరిలొ వెదుకమ్మా,నేను చేరా ఎనడో!!!

మనస్సు ఇచ్చావు నాకే కదా, అది వదిలేసి పొతే ఎలా???

ఎక్కడున్న చెలి నీ ఎద,నిన్ను నా వైపు నడిపించదా!!!

వెళ్లే దారులన్నీ నన్ను చెరే వేళలొ...కన్ను మూసుకుంటె కనిపించనా!నీ ఎద లోని పాటై వినిపించనా!!!నేస్తమా ఓ ప్రియ నేస్తమా...

ప్రతీ క్షణం నీ కోసమే వేచి ఉంది చెలి...నీ ప్రేమకై,నా ప్రాణం..."


Sunday, November 23, 2008

నేడు రాష్ట్రము మొత్తము సిరిసిల్ల ఆత్మహత్యల గురించే చర్చిస్తోంది.మన దేశంలో వ్యవసాయము తరువాత అంతటి ప్రాదాన్యాన్ని కలిగిన రంగం చేనేత రంగమే , మరి ఎందుకో ఆ హస్తకలకు ఆస్తి కల లేదు,విధానాల లోపమా ,ఆచరణ లోపమా ....



మన రాష్ట్రంలో చేనేతల గురించి మాట్లాడగానే మొదటగా స్ఫురించే పదం సిరిసిల్ల నే మరి ఆ సిరిసిల్ నేడెందుకు వురిసిల్ల గా మారుతోంది ,మహాత్ముదన్నట్లుగా యాంత్రీకరణం హస్త కలల్ని అణచి వేస్తోందా , మర మగ్గాల మారణ హోమంలో చే మగ్గం అసువులు బాస్తోందా , మర మగ్గాలని కూడా మన మగ్గాలుగా మర్చి మంచి వుత్పట్టులను అందించలేమా .... ఖచ్చితంగా అందించగలము .



నేడు సిరిసిల్ల కాకుండా వేరే వూరిలో వున్న నేతన్నల అత్మఘోశాలు ఎందుకు తక్కువగా వినిపిస్తున్నాయి , అక్కడ నేతన్నకు సరిన ఆదయ వనరులు సమగ్రంగా వున్నాయా ,ఎందుకీ వ్యత్యాసము అని ఒకసారి పరికిస్తే ...







౧. సిరిసిల్ల దాదాపుగా తెల్ల వస్త్రాల తయారీలో నిమగ్నమయి వుంది .

౨. దళారి వ్యవస్థ సిరిసిల్ల లో రాజ్యమేలుతోంది .


౩. పోటి ప్రపంచానికి తగిన ప్రత్యేకతలను,మార్పులను అనుకరించడం.



పై కారనాలన్నింటికి ఒకే ఒక సాక్షం అందించగాలిగాలననే ఓ సదుద్దేశ్యంతో ఓ వుదాహరణ ...
నేడు రాష్ట్రము మొత్తం కడప జిల్లా లోని అబివ్రుద్దిని తొంగి చూస్తోంది ,అలంటి కడప జిల్లా లోని జమ్మలమడుగు ప్రాంతం హస్త కళలకు ప్రసిద్ది ,అక్కడ వుండే ఓ చిన్న గ్రామమే వేపరాల , జనాభా సుమారుగా ,ఆర్థిక వ్యవస్థ అంతకంటే పటిస్టమే,....


అక్కడ ఎలా(ఏమి) జరుగుతోందంటే ....


సాధారణ చే మగ్గాల పైన నేయవలసిన రక రకాల వుత్పట్టులను మర మగ్గాల సమయమ్తో నేస్తున్నారు ,ఇక్కడ మగ్గాలు కూడా సిరిసిల్ల లోని మగ్గాలకు సంభందించినవే , కాని మార్కెట్లో దాని ప్రాశస్త్యం చే మగ్గాల నుండి వచ్చినట్లుగా వుంటుంది ,మార్కెట్ లో ఒక వస్త్రం విలువ :500 నుంచి 700 దాకా ఉంటుంది ,చే మగ్గం పై ఆ నేతని రోజుకి ఒక వస్త్రాన్ని నేయగలరు ,అందుకు ఒక నేతన్నకి ఒక రోజుకు లభించే వేతనం : 100 రూపాయలు ,కాని ఇక్కడ అదే రకమైన వస్త్రాన్ని మర మగ్గాల సాయం తో రోజుకు నాలుగు లేదా అయిదు నేయ గలుగుతున్నారు ,అందుకు అతనికి లభించే వేతనం :400 , ఎంత వ్యత్యాసమో మీకే తెలుస్తూంది పేరుకు చేనేత కాని మరనేత ,ఇది తప్పు అని అనటం లేదు ,ఎలాగు అలవాటు పడ్డాం కనుక అనుకరించాలని నేననుకుంటున్నా .....



చీర కట్టుకునే ప్రతి వాళ్లకి తెలియదు కదా నేసిన మగ్గం గురుంచి,....


ఇక పొతే దళారీ వ్యవస్థ ,దళారీలు లేని రంగం వుండదేమో బహూశా , ఇక్కడ కూడా ఇది వున్న ఎక్కువ భాగం మంది ఆదాయాన్ని కూడా కూలి లాగానే భావిస్తున్నారు , ఎందుకంటే ఇక్కడ ప్రతి వొక్క కూలి ఒక దళారియే,అంటే ఇది కులిల ప్రజా స్వామ్యము ,...
మారుతున్న కాలానికి కాదు మారుతున్న నడవడికకు అనుగుణంగా ఇక్కడి నేతన్నలు తమ తమ వుత్పత్తులలో రకరకాల ప్రత్యేకతలను వల్లిస్తున్నారు ,అదెలాగంటే మొన్నటి దాక వున్న నెంబరు(పోగు లావును బట్టి నెంబరును నిర్ణయిస్తారు)స్థానంలో నేటి నెంబరు గల చీరలు రాజ్యమేలుతున్నాయి ,తరువాత పట్టు పరిశ్రమలో కుడా రాజ్యమేలడానికి వేపరాల సన్నద్దమవుతోందని అక్కడి వారిని చూస్తేనే తెలుస్తూంది ....


బుట్టాలు గడిలతో కూడిన చీరలు (black & white లో కుడా బాగున్నాయి కదూ )


అనుకరించే జారి అంచు వస్త్రాలు పై వాటి కంటే చాలా బాగున్నాయి కదూ ...


ఈ వ్యాసం ఎందుకు రాసానంటే ఇక్కడ తయారయ్యే ఇలాంటి వుత్పత్తులనె సిరిసిల్ల ప్రజలు అభినందించి అనుకరిస్తారని , సిరిసిల్ల సిరి నిల్లు గా మారగలదని ఆశాభావం వ్యక్తం చెస్తూ....


తప్పులుంటే క్షమించండి ,సలహాలు తెయచేయగలరు ...


ఇట్లు
ఆరాధన


Saturday, November 22, 2008

సావిత్రి గతంలోకి ఒకసారి .....

సావిత్రి , తెలుగు సిని వుద్యానవనంలో వాడి పోనీ మల్లెపువామే,ఇప్పుడొస్తున్న ఎంతో మంది ఎకలవ్యుడు లాంటి నటిమనులకు ద్రోనాచార్యుల వంటి గురువామే ,తెలుగు సిని వనంలో ఎప్పుడు పరిమళాలు వెదజల్లు తుండే మల్లెపువ్వు భౌతికంగా మన మద్య లేక పోయినా అజరామరంగా మన మసుల్లో సుస్థిర స్తానాన్ని సంపందించుకుని వెళ్లి పోయింది ,
వెండితెర వేల్పు
------------------
ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలతో తెలుగు సినిమాలలో అరంగేట్రం చేసింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళబైరవి లో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానిఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ మిస్సమ్మ సినిమాలో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది.


దేవదాసు“ సావిత్రి ని చూస్తే నిజంగా పార్వతి ఇలానే ఉండి ఉంటుంది ఏమో అనిపించింది. ఎప్పటి మాయాబజార్, ఎప్పటి మిస్సమ్మ, ఎప్పటి దేవదాసు? అవి వచ్చి యాభై ఏళ్ళు డాతింది. ఇంకా మనం చూసి ఆనందిస్తున్నామంటే, ఈ తరం లో కూడా సావిత్రికి అభిమానులున్నారంటే అంతకంటే సాక్ష్యం ఏమి కావాలి సావిత్రి గొప్పదనానికి?

నటీమణులెందరున్నా మహానటి అంటే సావిత్రే!

ఆమె సంతకం చేసేటప్పుడు సావి౩ అని రాసేదట.

కాని ఓ అభిమాని autograph అడిగితె ఇలా savitri ganeshan అని చేసి
ఇచ్చిందట
-----------------------------------------------------------------------------------------
ఒకసారి సావిత్రి గారు ,భర్త జెమిని గణేశన్ గారు మరియు వారి కూతురు కొడుకు -చాముండేశ్వరి ,సతీష్ లు తమిళనాడు లోని రామేశ్వరం ,కన్యాకుమారి ఆలయాలకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా తుఫానులో చిక్కుకుని పోయారట ,అప్పుడు పత్రికలంతా సావిత్రి గారి కుటుంబం కూడా తుఫానులో కొట్టుకు పోయిందని సావిత్రి గారు ఇక లేరని రాశాయట,కాని అదృష్ట వశాత్తు వారు ఓకే ద్వీపం లో చిక్కి తరువాత మన సైన్యం హెలికాఫ్టర్ల చేత బయట పడ్డారట.
సావిత్రి గారికి వర్షమంటే చాల ఇష్టమట ఎప్పుడైనా షూటింగ్ స్పాట్ లో వర్షం పడితో వర్షంలో తడిచి గంతెయకుండా వుండలేక పోయేదట ,ఇంకా సావిత్రిగారికి మల్లెపూవులంటే చాలా చాలా ఇష్టమట ఎప్పుడు గంపెడు పూలతో తన తలను అలంకరించుకునేదట,ఒకసారి సావిత్రి కూతురు చాముండేశ్వరి గారు తన తలలో కూడా ఇలా సావిత్రిగారిలా పూలు అలంకరించుకుని వుండగా వారి భర్త నిన్ను ఈ వేషంలో చూస్తె మేకలు వేంబడిస్తాయి,అని సరదాగా అనేవారట ,మాములుగా సినిమాలలో ఏడుపు సన్నివేశాలు వచినపుడు నటినటులు గ్లిసరిన్ మీద ఆధారపడటం అందరికి తెలిసిందే ,కాని సావిత్రి గారు చాలా తక్కువ భాగంలో గ్లిసరిన్ మీద ఆధారపడి ,సన్నివేశానికి తగినంత కన్నీటి చుక్కలు రాల్చి చాలా మంది దర్శకుల మన్ననలు పొడి భావి కథానాయికలకు దార్శనికంగా వుండేదట.

దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలలు కురిపించి,అభినయంలో తనకు సాటి మరొకరు లేరని అశేష ప్రజల హృదయాలలో అభినేత్రిగా నిలిచిపోయారు మహానటి సావిత్రి.ఆ నటకోవిదురాలు దాన ధర్మాలు చేయడంలో ఎముకలేని చేయి చివరకు తన జీవితాన్నే విధికి దాసోహం చేసింది ...


గుజరాత్ భాదితుల కోసం లాల్ బహదూర్ శాస్త్రి చెవి పోగుల్ని దానం చేస్తున్న చిత్రం
-----------------------------------------------------------------------------

తెలుగు సినిమా దేవతలా భావించే సావిత్రి గారికి దైవభక్తి చాల ఎక్కువ ,ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తూనే వుండేదట ,వారంలోని ప్రతి వారము ఆయా దేవుల్లన్ని ప్రార్తించేది ,ఇందులో భాగంగానే అనేక ఆలయాలకు వెళ్ళేది .తిరుపతి వెన్న్కన్న స్వామి సన్నిదిలో కుడా పొల్లు దండాలు చేసిందట .

అప్పటి ప్రదాని ఇందిరా గాంధీ తో
--------------------------------------------------

నట చతుష్టయం (శారదా ,అంజలి దేవి ,గిరిజ ,సావిత్రి )
------------------------------------------------------------
చెల్లెలితో మహానటి

సంఘంలో ఎంత తల ఎత్తుకుని చూస్తున్న తలరాత ముందు తల దించాల్సిందే , అదే ఆమె విషయంలోను ......
1956 లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి చెడిపోయింది. ఆస్తిపాస్తులూ కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.

కొన్ని గంటల్లో చనిపోయే ముందు మహానటి
-----------------------------------------------------------

మన మన స్సుల్లో చెరగని frame
----------------------------------------------------------


ఆమె మరణం సంగతి గురించి తెలిసిన వారందరూ ఆమె పైన జాలి చూపకుండా వుండలేరేమో ,కాని ఇప్పుడు ఆమె సంతానం సినిమా సముద్రంలో ఒలలాడక పోయినా సముద్రాన్ని ఒక ప్రకృతి ప్రసాదంలా భావించి వారి జీవితాల్ని వారు గడుపుతున్నారు ,ఇప్పుడు ఆమె కుమారుడు సతీష్ అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు ,కూతురు విజయ చాముండేశ్వరి గారు కూడా మంచి స్తాయిలో వుంటూ ఆమె అందించిన ఈ విలువైన జీవితాన్ని ఆనందిస్తున్నారు .



"జీవించినంత కాలం నటించాలి తరువాత నటనా కీర్తితో జీవించాలి , అన్న భావంతో స్పూర్తి తో నటించిన ఆమె కీర్తి తో వెలుగుతోంది."


thank u for visiting ARADHANA




Tuesday, November 11, 2008

చేనేత కార్మికా...

కడగండ్ల వడగండ్ల కన్నీటి ధారలతో తడిపి
ఏకులోడికి దారం తీసి ...
నరనరాల్ని కూడదీసి
నాలుకపై తేమతో అతికి తీసి ...
పేగు పేగున సాన భీకి పేగుపోను గంటేసితీసి...
రక్తాన్ని రంగరించి రకరకాల రంగులద్ది
కాళ్ళే పడుగుగా చేతులే పెకగా
మెదడుకు పదను పెట్టిచెమటే గంజిగా తట్టి ...
కండలు కరిగించి రాట్నం తో కండె బొట్లుగా చుట్టి తీసి ...
గుండె చప్పుళ్ళతో మొగ్గంపై వాటేసి ...
తుక్కు పోగుల్ని చేర్చి కూర్చి సరికొత్త రూపురేఖలతో ...
వస్త్రాన్ని కళాత్మకంగా నేసి వన్య చిన్యలతో తయారు చేసి
ఎందరెందరికో ప్రాణం కన్నా
ప్రాణం కన్నా మిన్న అయిన మాణం కాపాడు
కష్టించి పనిచేయు ఓ చేనేత చైతన్య కార్మికా,
నీకా ఆకలి చావు ?నీ వెతల దీర్చుదాతే ఈ భువిపై కొరతా ?
పాచి బాలింత సంక బిడ్డనేత్తి చదువు సంధ్యల పక్క నెట్టి...
చేయి చేయి జత కలిపిఅందినంత అప్పనప్ప చేసి ....
గిట్టుబాటు ధరె దక్కక పట్టెడు మెతుకులైనా చిక్కక చక్ర వడ్డీలతో
నడ్డి విరిగి బ్రతుకు నీడ్చు ఓ బడుగు జీవుడా ....
నీ నుదిటిపై ఆ విధాత వ్రాసిన నీ అరగుంత శ్వాస వీడింnanత సంపూర్ణ సంత ...........

thanks to visit aradhana