Pages

Subscribe:

Thursday, August 7, 2008

పల్లవి:

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

చరణం1:నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడమనసొక్కటి కలిసున్నది ఏనాడైనా

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడమనసొక్కటి కలిసున్నది ఏనాడైనా

ఈ పువ్వులనే నీ నవ్వులుగా

ఈ చుక్కలనే నీ కన్నులుగా

నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా

ఊహల్లొ తేలీ ఉర్రూతలూగిమేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

చరణం2:నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనదినీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనదినీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా

ఉండి లేక ఉన్నది నీవే

ఉన్నా కూడా లేనిది నేనే

నా రేపటి అడియాసల రూపం నీవే దూరాన ఉన్నా

నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకైవేచాను నీ రాకకై .......

0 Comments:

Post a Comment