Pages

Subscribe:

Sunday, August 24, 2008

ఒకరికి కోపం వచ్చి తిరుగుబాటు చేస్తే దాన్ని ఉద్రేకం అంటారు ,కాని నలుగురు కలిసి తిరుగుబాటు చేస్తే దాన్ని ఉద్యమం అంటారు .సామ్యవాద ప్రయోజనాల కోసం పోరాడుతూ మాత్రు మూర్తి దాశృంఖలాల మద్య నలిగిపోతున్న పీడిత ప్రజలకు ఒక ద్రువతార కన్పించింది ,కాని ఆ ద్రువతార ఎక్కువసేపు నిలవక పోయినా కావలసినంత ఉత్తేజాన్ని తన కాంతితో నింపి వెళ్ళిపోయింది , ఆ ద్రువతారే చేగువేరా .

విప్లవాన్ని అనిచివేయలేరేమో గాని ఆపి వేయలేరన్న జగమెరిగిన సత్యాన్ని ముందుగానే గ్రహించినట్లుగా నేనుసైతం అంటూ ముందుకు నడచి నలుగురిని నడిపించిన నాయకుడాయన .విప్లవానికి అంకురం లూయిబ్లాంక్ ,అర్పణ చేసింది కారల్ మార్క్స్ అయితే , జ్యోతి వెలిగించింది మాత్రం ఖచ్చితంగా చేగువేరా నే ...

చే అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా,అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.చిన్నతనం నుంచి ఆస్థమాతో బాధపడే ఎర్నెస్తో అనే చెగెవారాలో కార్యదీక్ష, పట్టుదలతో పాటు సున్నిత మనస్థత్వం వున్నాయి. అందుకే ఇంజనీరింగ్‌ చదివి మెడిసిన్‌లో చేరాడు.1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడుడాక్టర్‌గా వెనిజులా వెళ్లి కుష్ఠురోగుల ఆస్పత్రిలో పనిచేయాలని సంకల్పించాడు.కాని అప్పటి కే అర్జెంటీనా ఇతర లాటిన్‌ ఆమెరికా దేశాల్లో రైతుల, ఇండియన్‌ తెగల ప్రజల మీద అమెరికన్‌ సామ్రాజ్యవాదులు ఎంతో కాలంగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఆ దేశాల రాజకీయ వ్యవస్థ, ఆర్థిక సంపదలను అమెరికా ప్రభుత్వం, సిఐఎ నియంత్రిస్తుంటాయి. వారి అధిపత్యాన్ని స్థానిక ప్రభుత్వాలు ఏమాత్రం వ్యతిరేకించినా వెంటనే ఆ ప్రభుత్వం పతనం కాక తప్పదు.అప్పుడు చే మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తూ ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు,హింసాత్మక విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు.

అలా విప్లవాగ్నిలో రగిలిపోతూ గెరిల్లా సేనలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రవేశించి, కమాండర్‌ స్థాయికి ఎదిగినా ఎలాంటి ప్రత్యేకతలను, ఎవరికీ లేని సౌకర్యాలను తీసుకోవడానికి నిరాకరించాడు,కాని సరిగ్గా అప్పుడే "చెరకు పంటకు, చక్కెర ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన క్యూబా మీద ఎంతోకాలంగా అమెరికా సర్వాధికారాలను చలాయిస్తుంటుంది. అనేక లాటిన్‌ అమెరికన్‌ దేశాలలో వలెనే క్యూబాలో కూడా అధ్యక్షుడు బతిస్తా అమెరికా చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తుంటాడు. ఫిడెల్‌ కాస్ట్రో అనే యువ న్యాయవాది నాయకత్వంలో కొందరు యువకులు సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. చే వారితో చేతులు కలిపాడు.క్యూబా దేశీయుడు కాకపోయినా, పరాయి దేశం లోని ప్రజల కష్టాలకు స్పందించి వారి విముక్తి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన చే దృక్పథం, సార్థరాహిత్యం ఫిడెల్‌ కాస్ట్రోను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సరిగ్గా ఈ పోరాట సమయంలోనే చేగువేరా చే గా పిలవబడ్డాడు, ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు. అలా ఆ పేరు స్థిర పడిపోయి విప్లవకారులకి చేదోడు గా నిలిచిపోయింది ,కాని ఆంగ్లంలో చే అంటే విడదీయలేని స్నేహితుడు అని అర్థం .

అలా పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు చే పరిశ్రమల మంత్రిగా,క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు.
గెరిల్లా యుద్దం గురించి వివరించే తన రచనలలో వర్థమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు.

"జీవితంలో ఏదయినా సాధించాలంటే అన్నింటిని , అందరిని వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి " అంటూపేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టిన చే 1965 లో క్యూబాలో తన అతున్నత స్థానాన్ని, హోదాని, పలుకుబడిని అన్నింటిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం వదలి కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగో లో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించాడు,ఆ సమయంలో తన లక్ష్యం గురించి తన పిల్లలకి చే రాసిన చివరి ఉత్తరం ఇది ....

ప్రియమైన హిల్లితా అలిదితా కామిలో సెలీనా ఏర్నేస్తో ....నేను మీతో లేను కాబట్టి కొన్ని సంగతులు చెప్పేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను ,ఏదో ఒకనాటికి మీకు ఇది అందినపుడు మీరు ఇవన్ని తెలుసుకుంటారు.

ప్రపంచంలో ఎక్కడ ఎవరికీ అన్యాయం జరిగినా స్పందించడం చాల అవసరం , ప్రతి విప్లవకారుడికి ఉంది తీరాల్సిన లక్షణం ఇదే ....


నా పిల్లలందరికీ వీడ్కోలు పలుకుతున్నాను , మిమ్మల్ని మల్లి కలుస్తాననే నా ఆశ ...

అలింగానాలతో చే ....

1966 చివరిలో మరలా దక్షిణ అమెరికా చేరి బొలీవియాలో గెరిల్లా యుద్ధ కార్యకలాపాలు నడుపుతున్నచేగువేరా అమెరికన్‌ గూఢచార సంస్థ సి.ఐ.ఎ. ఏజెంట్‌ రోడ్రిగ్జ్‌ ఫిలిప్స్‌ నేతృత్వంలోని బృందానికి పట్టుబడ్డాడు. ఆ రాత్రికే వారు 'చే'ను సమీపంలోని 'లా హిగువేరా' గ్రామానికి తరలించారు. అక్కడ ఉన్న ఒక స్కూలులో చే ను బందించి అధికారుల ఉత్తర్వుల కోసం వేచివున్న సైన్యం మరుసటి రోజు మద్యాహ్నం (అక్టోబరు 9) ఒంటిగంటా పదినిమిషాలకు మారియో టెరాన్‌ అనే బొలీవియన్‌ సార్జెంటు చేగువేరాను కాల్చిచంపాడు. , తన చివరిమాటగా తుపాకి ఎక్కుపెట్టినపుడు " కాల్చండి ,మీరు మనిషిని మాత్రమే చంపగలరు (విప్లవాన్ని కాదు) " అంటూ నేలకోరింది ఆ ద్రువతార.

అప్పుడక్కడ పనిచేస్తున్న స్కూల్ టీచర్ మాటల్లోనే ...

"అప్పుడు నేను నా బాధ్యతల్ని నిర్వర్తించ దానికి ఆ గ్రామానికి వెళ్ళాను ,కాని అప్పడికే స్కూల్లో చే నిర్భందించారని నాకు తెలియదు ,సరిగ్గా ఒంటిగంట ప్రాంతంలో నాకో పెద్ద శబ్దం వినిపించింది , తీర అక్కడికి వెళ్లి చూస్తె గుమ్మానికి కుడివైపున చే చేతుల్ని చాచి రక్తపుమడుగులో కొట్టు కుంటున్నాడు ."

ఇక టెరాన్‌మాటల్లో ..

విలేఖరి : చేని హత్య చేసిన వాలన్టిర్లలో మీరే మొదటగా కాల్చారని అంటున్నారు ?

టెరాన్‌ : ఇది ఖచితంగా అబద్దం అప్పుడు మము అయిదుగురు వున్నాము , కాని అపటికే చే గాయాలతో మరణానికి చేరువలో వున్నాడు ...


అనంతరం మృతదేహాన్ని హెలికాప్టర్‌లో సమీప పట్టణమైన వ్యాలీగ్రాండ్‌కు తరలించి అక్కడి ఓ ఆసుపత్రిలో విలేకరులకు ప్రదర్శించారు. అలా మూడురోజులపాటు అక్కడే ఉంచి చే రెండుచేతుల్నీ తొలగించారు(అందుకు స్పష్టమైన కారణాలేంటో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు). ఆ తర్వాత ఆయన భౌతిక కాయాన్ని గుర్తుతెలియని ప్రదేశానికి పంపారు. అక్టోబరు 15న చే మృతి గురించి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్‌క్యాస్ట్రో అధికారికంగా ప్రకటించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వ్యాలీగ్రాండ్‌ ప్రాంతంలో చేతులు లేని ఓ అస్థిపంజరం బయటపడింది. పరీక్షలు జరిపిన ఫోరెన్సిక్‌ అధికారులు అవి చే తాలూకూ ఆనవాళ్లే అని నిర్ధరించారు. చివరకు 1997 అక్టోబరు 17న శాంటాక్లారా(క్యూబా)లో సైనికలాంఛనాలతో ప్రభుత్వమే అంత్యక్రియలు జరిపింది.

"ఆగిపోయిన గడియారం కూడా రెండు సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది అంటారు ", మనము ఎంత సంతోషంలో ఉన్న కూడా మనలోని విప్లవాగ్ని ఎపుడో వొకసారి రగుల్తుంది అలాంటి సమయములో ఇలాంటి గొప్పవాణ్ణి గుర్తుకు వస్తారనే తపన తో ఈ పోస్ట్ చేస్తున్నాను ....అభిప్రాయాలూ తెలుపగలరు

చిన్న సవరణ నేను ముందు పోస్ట్ చేసిన దానిలో నన్ను మాత్రమె చంపగలరు అని రాసాను కాని నిజంగా చే చివరి మాటలు " మనిషిని మాత్రమె చంపగలరు (విప్లవాన్ని కాదు) అని " .

ఈ తప్పు తెలిపినందుకు సరస్వతి కుమార్ గారికి దన్యవాదములు ....దయచేసి మన్నిస్తారని చిన్ని ఆశ

you may visit my blog as "http://www.aradhanaa.co.cc/"

10 Comments:

  1. Anonymous said...
    ఆరాధానా బాలు గారు,
    చాలా ఓపిగ్గా రాసారు "చే" గురించి. మీ అభినందనీయం. "చే" గురించి నిజంగా మీకెంత తెలుసో, లేదో నాకు తెలీదు. కాని ఇక్కడ మీరు రాసిందాన్ని బట్టి, మీరు ఇవన్నీ నమ్ముతున్నారని అనుకుంటున్నాను. ఇండియాలో ఇదొక పెద్ద సమస్య. కమ్యూనిజం లీడర్స్ గురించి ఒకే కోణం లభిస్తుంది. ఇంకో కోణం దొరకదు. దాని వల్ల చాలా incomplete and inaccurate impressions form వున్నాయి జనాల్లో.

    నేను ఒకప్పుడు లెనిన్ ని దేవుడు, సోవియట్ యూనియన్ ని భూతల స్వర్గం అనుకొని బతికాను. ఎందుకంటే అక్కడ దొరికే లిమిటెడ్ సాహిత్యంలో ఆ కోణం తప్పితే ఇంకోటి దొరకదు. నిజంగా అది భావ దారిద్రానికి పరాకాష్ట.

    మీకు ఓపికుంటే ఇక్కడ అమేజాన్ లో దొరికే ఈ క్రింది పుస్తకాలు కూడా చదవండి. "చే" గురించి fascinating propaganda నే కాకుండా, వేరే విషయాలు కూడా తెలుస్తాయి.

    http://www.amazon.com/Guevara-Liberty-Independent-Studies-Political/dp/1598130056

    http://www.amazon.com/Exposing-Real-Che-Guevara-Idolize/dp/1595230270/ref=pd_bbs_sr_1/102-7624290-2170554?ie=UTF8&s=books&qid=1185486017&sr=8-1

    అంత ఓపిక లేకపోతే క్రింద ఉన్న అయినా చదవండి.
    http://www.independent.co.uk/opinion/commentators/johann-hari/johann-hari-should-che-be-an-icon-no-394336.html

    http://www.slate.com/id/2107100/

    ఇందులో slate website is more "left" oriented, and communistic. వాళ్ళే "చే" గురించి negative article పబ్లిష్ చేయడం గమనించదగినది.

    Sorry మీ bubble ని burst చేసుంటే.
    Saraswathi Kumar said...
    "విప్లవానికి అంకురం లూయి బ్లాంక్,అర్పణ చేసింది కార్ల్ మార్క్స్ అయితే,జ్యోతి వెలిగించింది ఖచ్చితంగా చేగువేరానే.."

    మరి లెనిన్,మావోల సంగతేమిటి?

    నాకు తెలిసినంత వరకు తనను కాల్చేటపుడు 'చే'అన్న మాటలు "మీరు ఒక మనిషిని మాత్రమే చంపగలరు"(విప్లవాన్ని కాదు అనే అర్థంలో).

    ఏది ఏమైనా మీ టపా బావున్నది.
    Anonymous said...
    చే గొప్ప మనీషి
    అతను పెరిగిన పరిస్థితులు అలా మార్చాయి అతన్ని
    చే ఆచరణ ఎంత గొప్పది
    ఆయన నిజమైన ' సన్యాసం '
    అంటే ఏమిటో నిరూపించాడు
    నా వరకు ఆయనని వివేకానందుడి కన్నా
    గొప్పవాడి గా భావిస్తున్నా
    ఆరాధిస్తున్నా
    మీ రచన
    సార్ధక నామధేయం
    Anonymous said...
    మీరు "చే" గురించి ఇండియాలో పాపులర్ గా లభించే కోణం కాకుండా, ఇంకో భిన్న కోణంలోంచి ఆయన గురించి చదివారా? చదివితే, అలాంటివి ఒక రెండు ఉదాహరణలు ఇవ్వగలరా?

    కేవలం ఒకే వైపు నుంచి చదివి, "చే"ని "వివేకానందుడు" తో పోల్చడం సరి కాదేమో.

    అన్నీ తెలిసినవారు, మీకు నేను చెప్పేదేముంది.

    మీకు ఆసక్తి ఉందీ అంటే నేను కొన్ని లింక్ లు ఇస్తాను..(పుస్తకాలు పంపియ్యలేను కాబట్టి). "చే" గురించి మంచి నేనూ చాలా చెప్పగలను, ఎలాగూ కమ్యూనిస్ట్ సాహిత్యం అంతా దాంతేనే నిండిపొయి ఉంది, కాబట్టి మళ్ళీ నేను చెప్పడం అనవసరం.

    కాని "చే" sociapathic thug అనీ, స్టాలిన్, మావో ల కన్నా దుర్మార్గుడనీ strong case build చేయొచ్చు. "చే" కు అవకాశమే ఉంటే కనక, హిట్లర్ ని సైతం మించిపోయేవాడు.

    ఒక ఫేయిల్డ్ ఐడియాలజీ కి నిరంకుశ నాయకులు సార్ వీళ్ళంతా. స్టాలిన్, మావో లు చంపించిన లక్షలాది మంది చరిత్ర కనిపించదెందుకో ఇండియాలో?

    ప్రశ్నించే వాళ్ళం మేము అని రొమ్ములు చరచుకునే వీళ్ళు, వీళ్ళని ప్రశ్నించే వాళ్ళ రొమ్ములు చీలుస్తారు.
    Unknown said...
    'Che' gurinchi nenu books eppudu chadavaledu. tana gurinchi appudappudu ilaanti vyaasallO chadavatame.

    'Motor cycle dairies' movie chusinappudu inkomchem ekkuva telisindi.

    ilaa oka viplavaagni gurinchi maato panchukunnanduku krutajnatalu.
    సుజాత వేల్పూరి said...
    చిన్న అనారోగ్యానికే మనం దైనందిన పనుల్ని వాయిదా వేసి అల్లాడిపోతాం! అలాంటిది, తీవ్రమైన ఉబ్బసం, శ్వాస సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతూ కూడా పీడిత ప్రజలకోసం అవిశ్రాంతంగా పోరాడిన చే అంటే నాకు ఎనలేని గౌరవం.
    నిజమే!"విప్లవం మరణించదు, వీరుడూ మరణించడు"

    చే గురించి చాల విషయాలు చెప్పారు! కాకపొతే మీరు ఇవి ఎక్కడినుంచి తీసుకున్నారో source ఇస్తే బాగుంటుంది. చే గురించి కాత్యాయని రాసిన 'ప్రవహించే ఉత్తేజం" కూడా బాగుంటుంది.
    Anonymous said...
    hi! aradhana greetings to you
    this is wasim, you have done a great job by writing the history of our beloved che in telugu, your incredible work here in this blog will definetly help other people who don't understand english hatssoff!!!!!!!!!!!!!!!!!
    koushik said...
    CHE GURINCHI CHALA BAGA RASARU NAKU CHALA BAGA NACHUNDI .CHE GURINCHI KONTHA MANDHI SAMRAJYAVADULU CREATE CHESINA WEBSITE LANU CHOOSI TAPPU GA MATLADUTUNNARU . A VIPLAVAKARUDI GURICHI EVARU ENNI ABBADALU PRACHARAM CHESINA NIJAM MANAKU TAYLUSU DANINE MATRAMAY ANDARIKI CHEPDAM .DAYACHESI NADOKO VIGNAPTI DAKSHINA BHARATHA DESAM LO COMMUNIST VUDYAMA NAYAKUDU P.SUNDARAYYA GARI GURINNCHI RAYALANI NA MANAVI
    Unknown said...
    Dear Sir,

    I learned a lot from your cover story. Can u suggest a biograpghy book name of "Che"
    crazy said...
    che is really gr8888.

Post a Comment