Pages

Subscribe:

Monday, May 24, 2010


నేను నడచిన దారుల్లో నవ్వులు వెల్లివిరిశాయి కాని అవి నాకందలేదు ...

నేను గీసిన బొమ్మలు ప్రాణం పోసుకుని నేలపై కొచ్చాయి కాని నాకు కనిపించలేదు ...

నేను నేర్చిన జ్ఞానం విజ్ఞానాన్ని పంచింది కానీ నేనింకా అజ్ఞానినే ...

నేను మాట్లాడిన మాట ఇతరులకి స్పూర్తినిచింది కాని నాకు కాదు ...

నేనేం చేసిన అది అందరికి ఉపయోగ పడుతుంది కాని నాకెందుకు ఇది జరగడం లేదు ...

నేను ఎప్పుడో చచ్చాను కాని అందరు నన్ను బ్రతికే వున్నారంటున్నారు ...




జీవితంలో ఒక గమ్మత్తైన చమత్కారమేమిటంటే మనం కష్టాలంటే భయపడతాం కాని అవే కష్టాలు ఇక మనకి ఎప్పటికి వుంటాయి అంటే బాధపడతాం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటాం కాని కష్టం తో పాటు దురదృష్టం కుడా తోడైందని భావిస్తే మాత్రం బ్రతుకు చివరంటూ వేచి వుంటాం పోరాడాతం,పిచ్చిగా మనల్ని మనం చూసుకుని నవ్వుతాం నలుగురిని అసూయ పడటం మానేస్తాం .


ఈ లోకంలో కొందరు పరలోకంలో మరికొందరు కష్టాల్ని అనుభవించక తప్పదు అని దేవుడు మనతో చెబితే ఎంత బావుంటుంది కదా !!!ఎందుకంటే ఎలాగు ఈ లోకంలో అనుభవించిన కష్టాలని అక్కడ అలవాటు చేసుకుంటాం.


Thanks For Visiting

By

ARADHANA


Saturday, May 22, 2010


రెప్పలు వలచిన రక్తపు చుక్కలని చెక్కిలిపై ఆపి
నవ్వుల్ని సృష్టించిన మాయల మరాఠి ...
మూగ సైగాల్ని కుంచెగా మార్చి మనసు కాన్వాసు పై
మమతల కోటను కట్టిన మహారాజు ....
యంత్ర ధూతాల గోలలతోనే కష్ట జీవుల కడుపు మంటని
అనువదించిన అభ్యుదయవాది ...
అధికార మదోన్మాధంతో విర్రవీగే మానవ మృగాల అహాన్ని
దెబ్బ తీసిన కళా తపస్వి ....


చార్లీచాప్లిన్‌ పేరు వినగానే ఎవరికైనా నవ్వొస్తుంది. దుర్భరమైన దారిద్య్రం నుండి విముక్తి పొందడానికి అతను పడిన కష్టాలు, అవమానాలు వర్ణనాతీతం. అతను ఆ దీనావస్థ నుండి బయటపడేందుకు అతను అనుసరించిన ఆయుధం 'సహనం'. సహనమే ఆయనను ఉన్నతునిగా తీర్చిదిద్దింది.
ప్రధానంగా హాస్య నటుడైనా హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని , ఒక సార్వజనీనతనుఅతడు తన చిత్రాలలో సాధించాడు. పాంటోమైమ్ , క్లౌనింగ్, మైమింగ్ , బర్లెస్క్,పేరడీ, శ్లాప్‌స్టిక్ - వీటన్నిటిని అతడు మాస్టర్ చేశాడు. ఒక చిత్రమైనబ్రష్‌లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలోవంకీ కర్ర, వంకరటింకర నడక - ఇవీ అతని సరంజామా. తనకు తాను ఒక పాత్రను ట్రాంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రాంప్ అంటే దేశద్రిమ్మరి. ఇవాళ ఇక్కడ వుంటాదు, రేపు మరో చోట. అతడికి ఊరూ పేరూ లేదు. అన్ని ఊర్లూ అతనివే , అన్ని పేర్లూ అతనివే.
ఒకసారి ఒక నటుడు చాప్లిన్‌ని అందరూ చూస్తుండగానే కర్రతో కొట్టాడు. అయినా చాప్లిన్‌ చలించక ''మీ మెదడుకు కూడా పనిపెట్టే సాధన చేసి నాలాగా ప్రయత్నించండి. మీరు నాకన్నా మంచినటులు అవటానికి అవకాశం ఉంటుంది. అంతేకానీ ప్రాంతీయభేదాలు సృష్టిస్తే నష్టపోయేది మీరేనని'' ప్రేమగా సమాధానం చెప్పి పంపాడు. నిర్మాతలకు తన జీవితంలో అనుభవించిన కష్టాలను చెప్పి తనే కథ రాసి డైరెక్షన్‌ కూడా స్వయంగా చేసుకుంటూ అత్యద్భుతంగా నటించి అఖండమైన కీర్తినార్జించాడు. అది నటించడం అనే కంటే జీవించడం అంటే బాగుంటుంది. 'దికిడ్‌' అనేది అతని పూర్తి జీవితకథ. దిగోల్డ్‌ రష్‌, సిటీలైట్స్‌, ది కింగ్‌ ఇన్‌ న్యూయార్క్‌, దిగ్రేట్‌ డిక్టేటర్‌, ది ఐడిల్‌ క్లాస్‌, పోలీస్‌, పేడే, ది సర్కస్‌లాంటి మొత్తం ఎనభై వరకూ చిత్రాలలో నటించాడు.
1. ప్రపంచంలో ఏది శాశ్వితం కాదు. సమస్యలు కూడా .

2. మనము నవ్వని రోజు జీవితంలో అత్యంత వ్యర్థమైన రోజు.

3. వానలో నడవడమంటే నాకు ఇష్టం . ఎందుకంటే నా కన్నీళ్లను ఎవ్వరూ గుర్తించలేరు గనుక!

నాయకులూ నియంతలు మత ప్రవక్తలు ఒక వెలుగు వెలిగి కాల గర్భం లో కలిసిపోతారు కాని మనుషులున్నంత కాలము కనుమరుగు కానిది హాస్యం విషాద విరజితమైన చాప్లిన వదనం.

"జీవితంలో కష్టాలని తొలగించే మంత్ర దండం ఉండదని తెలిసిన చాప్లిన్ కనీసం కష్టాన్ని చూసుకుని నవ్వుకోవడం ఎలాగో మనకు నేర్పి వెళ్ళాడు"




Thanking 'u'

by

ArAdhAnA