Pages

Subscribe:

Tuesday, March 10, 2009


రంగుల పండుగ వచ్చేసింది,ఈ పౌర్ణమికి ఆకాశాన వుండే తెల్లటి నిండు జాబిల్లికికి రంగులేయడానికి సిద్దంగా వున్నారా అయితే రండి అందరమూ కలిసి మామ ను వెంబడిద్దాం, ....

హొలీ అనేది రంగుల పండుగ. వసంతోత్సవం లేదా కామునిపండుగ అని కూడా పిలుస్తారు. నీళ్ళలో రంగులు కలిపి చల్లుకోవడం, రంగు పౌడర్ మొహాలకు రాసుకోవడం చేస్తారు.

ఇక పొతే ఈ రంగుల పండుగానే కాముని పండుగ అని కూడా అంటారు , ఈ కాముని పౌర్ణమికి మా వూరిలో అయితే కామిని అంతం ని ఓ గొప్ప వేడుకగా నిర్వహిస్తారు,హిరణ్య కసిపుకుని చెల్లెలైన కామిని ని ఓ బొమ్మగా తయారు చేసి నిప్పంటించగా ,వూరిలోని ప్రజలు తమ వంతుగా తమ తమ ఇండ్ల లోని పాత వస్తువులని తీసుకు వచ్చు ఆ హోమంలో వేసి హోమాన్ని తెల్లవారు జాము వరకు కొనసాగించటం విశేషం.

అంతకు ముందు రాత్రి యువకులు తమ రాత్రి భోజనాన్ని గ్రామములోని వేరే గృహాలనుంచి యాచించి (యాచన ఇలా వుంటుంది "కాం బువ్వ మ్మ కామ్బువ్వ") తద్వారా లభించిన ప్రతిని వురి మద్యలో ఓ చోట కుప్పగా పోసి అందరు సమానముగా ఆరగించడం కొన్ని గ్రామాలలో కనిపిస్తుంది ,ఒకవేళ ఇలాంటి సంప్రదాయాన్ని మీరు చూడాలనుకుంటే మా యింటి కి రాగలరు మీ కోసము మా వురి పొలిమేర మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే వుంటాయి..

ఇక పల్లెటూరి వసంతోత్సవము కాదు కాదు వసంతకము అంటారని మా జేజి చెపుతూ వుంటుంది , ఈ రోజు వరుసకు బావ బావమరుదులైన వారి పైన తమ అభిమానాన్ని రంగుల రూపంలో చూపించడం పరిపాటే , మా కాలేజి రోజుల్లో మేము ఎలా ఎంజాయ్ చేసామంటే ఆ రోజులు మల్లి తిరిగి రావనిపిస్తోంది ,కొసమెరుపేంటంటే కాలేజ్ లో మేమంతా బావ బావ అని పిలుచుకునే వాళ్ళం కాబట్టి మా కు రంగు పడాల్సిందే .

మీకు మీ శ్రేయోభిలాషులకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
ఇట్లు మీ ఆరాధన

Sunday, March 8, 2009

అవును మహిళా దినోత్సవమండి.....!!!



బ్లాగు వనంలో విరబూస్తున్న మహిళా మల్లెపూలకు పండగోచ్చిందండి , మిమ్మల్ని చూస్తె మాకు అసూయగా వుంది ప్రతి చోట ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానముగా వున్నా వారికి ప్రత్యేకంగా పండగేందుకో ,

ఏదో వొకరోజు మాకోసము ఓ రోజొస్తుంది ఆ రోజు మేము మా పండగ చేసుకుంటాము ,ఆ రోజేంతో దూరంలో లేదు ....

కాబట్టి కామ్రేడ్స్
నే చెప్పేదేమిటంటే ....

"జై పురుషుల దినోత్సవము"

కాబట్టి నే చెప్పేదేమిటంటే మా రోజు కోసము మేము నిరీక్షిస్తున్నా మీకోసం వచ్చిన ఈ రోజు కోసం నా తరఫున మీకు మీ మిత్రులకు మీ శ్రేయోభిలాషులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ,



Friday, March 6, 2009



సి నా రె అన్నవి పొడి అక్షరాలూ కావు
పుప్పొడి అక్షరాలూ
అందుకే సి నా రె ను పిండితే మకరందం జాలువారుతుంది




జొన్నరొట్టె మీద వెన్న పూస పూసినారె
తెలుగు పాట బుగ్గ మీద చిటిక వేసినారె
ఇంతింతై విశ్వంభర నంత చూసినారె
జ్ఞానపీటి పైన జానపదములేసినారె






స్వరాల మాలలళ్ళు వేళ
'మామ' కు కుడి చేయి

గురుదేవుని తలచుకుంటూ గుండెలు తడిచేయి
(అందరికి కన్నులు తడిస్తే ఈయనకు గుండెలు తడిచేయి )







మాట పెళుసు గాని
మనసు మల్లెమాల
కవితాత్మక వ్యాపారం
పరమాత్ముని లీల - ఎం ఎస్ రెడ్డి








thank u for visiting ARADHANA