Wednesday, January 14, 2009
కొత్త సంవత్సరంలో తోలి తెలుగు పండుగ ,ఏటేట ఏటేటా కొత్తగా వచ్చి పరిమళాలు వెదజల్లుతుంది ,భోగి మంటలు,రంగవల్లులు,రధం ముగ్గులు,గొబ్బిళ్ల పాటలు, మంగళ స్నానాలు,మామిడాకు తోరణాలు,గంగిరెద్దు మేళాలు,హరిదాసు కీర్తనలు,నిండు ధాన్యం తో గాదెలు, నోరేరె గారెలు, డబ్బాల్నిండా నేతి అరిసెలు, ఇలా అన్నింటిని ఒకేసారి మన ముందుకు తీసుకువచ్చి మన మన జీవితంలో మరింత ఆనందాన్ని చేర్చుతుంది
పతంగుల పండుగ వచ్చేసింది పల్లెటురమ్మ రంగు రంగుల రంగవల్లుల చీరను ధరించి నింగికి గాలిపటాలతో నిచ్చెన వేస్తోంది , పట్నము కూడా పతంగులను పలరిస్తూనే వుంది ,ఈ రోజు మా వూర్లో మా చెల్లి ముగ్గు వేసి వుంటుంది ,కాని నేను ఆ ముగ్గును చూడలేక పోయాననే భాద వుంది ,కాని ఆ భాద ఇలా మీ అందరితో పంచుకోవడం ద్వారా ,జల్లెడ కూడలి లోని మీ అందరి బ్లాగుల ముగ్గుల్ని చూసి సంతృప్తి పడుతున్నాను ,...
నిచ్చెన వేస్తోంది , పట్నము కూడా
పట్నం సాఫ్ట్వేర్ పని వాళ్ళని పండక్కి ఇంటికి పంపించి పల్లె ఎదుట తన విజ్ఞతను ప్రదర్శించింది ,పల్లె పడచులు తమ సంతోషాలని అతిథిలా వచ్చే తన సొంతవాల్లని చూసి సంబురపడి పోతోంది ,ఈ సంబురంలో పాలూ పంచుకోలేని నా లాంటి వాళ్ళంతా ఇంతకి ఫోన్లు చేసి కాస్త వూరట చెందాల్సిందే ....
ఈ సంక్రాంతి అందరికి సుఖసంతోషాలను కురిపించాలని కోరుకుంటూ
మీ ఆరాధన
Labels: శుభకాంక్షలు