Pages

Subscribe:

Thursday, June 2, 2011


"జీవించినంత కాలం స్టూడెంట్ లా వుండాలి,
చచ్చాక టీచర్ కావాలి"

తమలో ఎంత బాధ ఉన్నా తెరపై చూసేవారికి నవ్వులు తన వారు . అందుకే అన్నారేమో ఆత్రేయ 'వ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి' అని. అలా కొన్ని సినిమాల్లో నవ్వించినా, మరికొన్ని సినిమాల్లో ఏడిపించినా అది హాస్యనటచక్రవర్తికే చెల్లింది. అంతేకాదు డైలాగ్డెలివరీలో వేగం, దానికి తగ్గట్టుగా అభినయం, నేటి ప్రేక్షకులు బ్రేక్‌, షేక్అని చెప్పుకునే డ్యాన్స్లను ఆనాడే చేసి హాస్యనటుల్లో అద్భుతమైన డ్యాన్సర్గా చెప్పదగ్గ హాస్యనటుడు రాజబాబు.

రాజబాబు పేరు వింటేనే హాస్యానికి చిరునామా,అందుకే పేరు తలచుకుని హాస్యం రాజసంతో వుట్టిపడుతుంది.రాజబాబు గారికి అలవాటుండేది అదేంటంటే ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని మరియు నటీమణుల్ని సత్కరించే వారు, అనేక దాన ధర్మాలు చేసేవాడు,రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా రేలంగి,సూర్యకాంతం,సావిత్రి వంటి ప్రముఖులు ఉన్నారు. నిజ జీవితంలో హాస్యపు జల్లు వేళ మంది కళ్ళలో ఆనందపు జల్లుగా కురిసింది.రాజబాబు అభినవ కర్ణుడు ఇంకా అభినవ కృష్ణుడు.
గతాన్ని మరచిపోకూడదు. గతం నుండి పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలే జీవితానికి దారిచూపిస్తాయని రాజబాబు అభిప్రాయం.అందుకేనేమోతన కష్టకాలంలో ఒక పాక హోటల్లోని స్త్రీ పెట్టిన టిఫిన్స్ గుర్తుంచుకుని ఆమె కొడుకులతో మంచి హోటల్ పెట్టించాడు.

ఎప్పుడు అక్కా అక్కా అని పిలుచుకునే సావిత్రి అంటే రాజబాబు కి చాలా ఇష్టం.ఒకసారి రాజబాబు
మహానటి సావిత్రికి ఘన సన్మానం తలపెట్టి చైన్నై త్యాగరాయనగర్వాణీ మహల్లో అత్యంత వైభవంగా సన్మానం చేశాడు, సమయంలో నిజానికి రాజబాబు అంత బిజీగా లేడు.కొంతమంది పెద్దలైతే ఈయనకేమేనా పిచ్చి పట్టిందా? అని మొహం మీద అడిగెేసిన వాళ్లు కూడా వున్నారు. సభ దాదాపు అయిపోవచ్చింది. సభకు, ఆహుతులకు కృతజ్ఞతలు చెబుతూ రాజబాబు మాట్లాడిన మాటలు ..

'సభకు నమస్కారం! (నవ్వు). అక్కా, నేను ఒక్కటే!( తాగుబోతులం అని అర్థం వస్తుందేమోనని నాలుక్కరుచుకుని) ఒకటే అంటే ఒకలాంటి మనస్తత్వం గల వాళ్లం..మా కళ్ల ముందు ఎవరికీ బాధ కలిగినా మేము ఏడ్చేస్తాం. ఇది మా బలమా? బలహీనతా? తెలీదు. చూశారా మా కళ్ళు తాగి తాగి వాచిపోయినవి కావు..ఏడ్చి ఏడ్చి వాచిపోయినవి. మా అక్క మహానటి సావిత్రమ్మకి సన్మానం చే§డం ఇంత ఘనంగా చెయ్యగలగడం నా పూర్వజన్మ సుకృతం. చాలా మంది పెద్దలు రాజబాబుకి పిచ్చా? అన్నారు. అక్కనూ పిచ్చే. నా పిచ్చిలో నాకానందముంది. అనందం అనుభవించిన వారికే తెలుస్తుంది. రావణాసురుడు చనిపోయేముందు రాజనీతి ఏం చెప్పేడు? మీకు తెలీదా? నేను మాస్టారిని కాబట్టి చెబుతున్నా వినండి! (నవ్వు) 'మంచి పని చేయదలచుకున్నప్పుడు వెంటనే చేyaali. ఏదయినా చెడ్డ పని చేయాలనుకున్నప్పుడు ఆలోచించి చేయి అన్నాడు. మా అక్క మహానటి సావిత్రికి నసన్మానం చేయడం నా జీవితంలో నేను చేసిన మంచి పని అనుకుంటున్నాను. ఏమో! ఎవరు చెప్పగలరు? వచ్చే సంవత్సరం వుంటానో వుండనో..(ఏడుపు) అందుకే అక్క గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకోవడం కోసం చిన్న తమ్ముడు చిన్న ప్రయత్నం చేశాడు. ఏమయినా లోపాలుంటే క్షమించక్కా! అంటూ సావిత్రమ్మ పాదాలకు నమస్కరిస్తుండగా ప్రేమగా లేవనెత్తి గుండెలకు హత్తుకుంది. పసిపిల్లాడిలా భోరున ఏడ్చేశాడు.

తరువాత సావిత్రి మాట్లాడుతూ 'సభకు నమస్కారం చాలామంది వక్తలు సావిత్రి చిక్కిపోయింది. చిక్కిపోయింది అన్నారు. సావిత్రి చిక్కదు సన్నబడుతుందంతే! తమ్ముడు రాజబాబు నా కంటే చిన్నవాడు. ఆలశ్యంగా ఫీల్డ్కి వచ్చాడు. అయినా ఎందుకో ఇంత ప్రేమ. ఇప్పుడీ సన్మానాలు అవీ ఎందుకురా పిచ్చికాకపోతే అని వారించాను మొండిఘటం కదా (నవ్వు) వినలేదు.

అక్కా! వచ్చేయేటికి నేనుంటానో వుండనో తెలిదూ! వచ్చే యేటికి నువ్వుంటావో లేదో తెలీదూ అన్నాడు. నవ్వుకున్నాను. సావిత్రి అంత తేలిగ్గా చిక్కదు అని ముందే చెప్పాను కదా! ఆఖరుకి మృత్యువుకి కూడా. మృత్యువుని కూడా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెఱువుల నీళ్లు తాగిస్తాను. భయం లేదు.( సభలో చప్పట్లు వర్షం) రాజబాబు నవ్వూ ఏడుపు..తరువాత జగ్గయ్య మాట్లాడుతూ..

సభలో అపశృతుల్ని భగవంతుడు క్షమించుగాక! అన్నాడు.నిజానికి సంఘటన జరిగిన అనతికాలంలోనే రాజబాబు కన్నమూశాడు. తరువాత సావిత్రి కోమా స్థితిలోకి వెళ్ళి సరిగ్గా అయిదువందల రోజులు మృతువుతో పోరాడింది.అందాక మృత్యువు మహానటి ఛాయను కూడా రాలేకపోయింది. కొన్ని కొన్ని సంఘటనలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. అభిమానుల గుండెల్లో పదిలంగా పవిత్రంగా నిలిచిపోతాయి.

'జీవితం చాలా చిన్నది అనుకున్నాడో ఏమో,ఉన్నత కాలము అందర్నీ నవ్వించి తరలి రాణి లోకాలకు మరలిన మారాజు,నవ్వు ఉన్నంత కాలము రాజబాబు వుంటాడు.'

Thank 'U' For Visiting

By

ARADHANA