Monday, January 25, 2010

1857 సిపాయీల తిరుగుబాటు కంటే ముందే భారతదేశాన్ని దాస్య శృంఖలాలనుండి విడిపించడానికి ప్రయత్నం చేసి బ్రిటీష్ వారితో పోరాడిన వాడు ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి. బ్రిటిష్ పాలన మీద కత్తి దూసి స్వేచ్చకోసం పోరాడి ఉరికొయ్యకు బలై పోయి తరువాతి స్వాత్రంత్ర ఉద్యమానికి స్వాతంత్ర కాంక్షను రగిలించి మండే సూర్యుడయ్యాడు.

ఉద్యమాన్ని అణచి వేయాలంటే ముందా ఉద్యమ స్థావరాన్ని కనుగొని కూల్చి వేయండి,ఈ మాట వింటేనే తెలుస్తోంది ఉద్యమ స్థావరము యొక్క విశిష్టత.ఉద్యమం విజయవంతమైతే అదొక రాజాస్తానముగా చరిత్రని సృష్టిస్తుంది విఫలమైతే ఒక మూగ సాక్షిగా చరిత్రలో నిలిచి పోతుంది,అలాంటి ది ఇప్పుడు ఎక్కడ వుంది అన్నదే చరిత్రకారులకి అంతుచిక్కని విషయం .
ఇంతకి ఆ కోట అహోబిలం అడవుల్లోనే ఉందా !!!
ఇంకా అక్కడ ఏ రకమైన ఆధారాలున్నాయి !!!
అడుగుగునా నక్సల్స్ కోసం జల్లెడ పట్టే గ్రీ హౌండ్స్ దలాలకి ఆ కోట కనిపించిందా !!!
ఆ కోట ఇప్పుడు గిరిజనుల ఆధీనంలోనే ఉందా @@@
ఇంతకి నరసింహా రెడ్డి భావితరాల వారికి ఇచే సందేశం ఆ అడవిలోనే వుండి పోవలసిందేనా ?
1847 ఫిబ్రవరి 22వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు నరసిం హరెడ్డిని ఉరితీస్తారని విస్తారంగా ప్రచారం చేశారు.నరసిం హారెడ్డి మాత్రం ధైర్యంగా, ప్రశాంతంగా ఉన్నాడు.

1857 కంటే ముందు 1846-47 ప్రాంతాల్లో 9000 మంది సైన్యంతో సాయుధపోరాటం నడిపిన ఉయ్యాలవాడ నారసింహారెడ్డి విప్లవానికి భారతీయ స్వాతంత్ర చరిత్రలో సముచిత స్థానాన్నిచారా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకం। మన చరిత్రను మనము రాసుకోకపోవడమే ఇందుకు కారణం. ఇట్లాంటి వీరులు ఇంకా ఎంతమంది చరిత్రలో మరుగున పడిపోయాయో?
నేడు మనముందు కుడా ఓ ఉద్యమము వుండి ఉస్మానియా ఉద్యమ స్థావరముగా ,కాని మనకు ఇప్పుడు కావలసినది జై తెలంగాణమా!!! జై తెలుగుగానమా!!! కాదు "జై ప్రజాస్వామ్యము" నాటి ఉద్యమాల ద్వారా ఏర్పడిన స్వతంత్రాన్ని నిలుపునే కాంక్ష రావాలి...
గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
than q for visiting
BY
viplavAradhana
viplavAradhana
Labels: ఎందరో మహానుభావులు
Subscribe to:
Posts (Atom)